అన్వేషించండి

Aditya 369 Re Release: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్... 'ఆదిత్య 369' రీ రిలీజ్ డేట్ మారిందోచ్... థియేటర్లలోకి వారం ముందుగా

Aditya 369 Re Release Date Changed: నందమూరి బాలకృష్ణ కల్ట్ క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369' రీ రిలీజ్ డేట్ మారింది. ముందుగా ప్రకటించినట్టుగా ఏప్రిల్ 11న కాకుండా, అంతకంటే వారం ముందే థియేటర్లలోకి రాబోతోంది.

నందమూరి బాలకృష్ణ క్లాసిక్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369'. దాదాపు 3 దశాబ్దాల తరువాత ఈ థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ రీరిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలే మూవీని ఏప్రిల్ 11 న రీరిలీజ్ చేయబోతున్నాం అని అధికారికంగా ప్రకటించారు. కానీ అంతకంటే వారం ముందుగానే ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్టు ఈ రోజు తెలిపారు.

'ఆదిత్య 369' రీ రిలీజ్ డేట్ ఛేంజ్
 నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సెన్సేషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369'. దివంగత దిగ్గజ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో, శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఫస్ట్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే. ఇందులో కృష్ణదేవరాయలుగా నందమూరి బాలయ్య యాక్టింగ్, సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ స్కిల్స్, ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రం, ఇళయరాజా అద్భుతమైన మ్యూజిక్, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు, జంధ్యాల సంభాషణలు వంటి ఈ సినిమాలో ఉన్న ప్రతి అంశం 'ఆదిత్య 369' మూవీని ఆల్ టైం క్లాసిక్ మూవీగా నిలబెట్టాయి. 

1991లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అప్పట్లోనే సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. ఈ ఫిక్షనల్ టైం ట్రావెల్ సినిమాలో హిస్టారికల్ తో పాటు మూడు జానర్లను టచ్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు. అయితే చాలా కాలంగా 'ఆదిత్య 369' మూవీ రిలీజ్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. రీసెంట్ గా సరికొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా ఈ మూవీని తీర్చిదిద్ది, రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నామని గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఏప్రిల్ 11న 'ఆదిత్య 369' మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని వారం ముందుగానే రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు.

మూవీ రీరిలీజ్ ప్రీ పోన్ కావడానికి ఇదే రీజన్ 
'ఆదిత్య 369' సినిమాను ఏప్రిల్ 11న కాకుండా పీ పోన్ చేసి, ఏప్రిల్ 4న రీరిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ "ఆదిత్య 369 అనే సంచలనాత్మక సినిమాను 5.1 సౌండ్ మిక్సింగ్ తో, అధునాతనమైన 4k డిజిటల్ క్వాలిటీతో థియేటర్లలోకి తీసుకురాబోతున్నాము. నందమూరి బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగానే కాకుండా మరో పాత్రలో కూడా నటించి, ఆ రోజుల్లోనే ఈ మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. జీనియస్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు అద్భుతమైన విజన్ తోనే 'ఆదిత్య 369' ఇండియన్ సినిమాలో ఆల్ టైం క్లాసిక్ హిట్ గా చేరింది. అలాంటి అద్భుతమైన సినిమాను ఈ తరం యూత్ కోసం ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించాము. కానీ మరిన్ని ఎక్కువ థియేటర్లలోకి మూవీని తీసుకురావాలని ఉద్దేశంతో ఇప్పుడు ఏప్రిల్ 4న రీరిలీజ్ చేస్తున్నాము" అని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్యతో పాటు అమ్రిష్ పురి, మోహిని, హీరో తరుణ్, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, చలపతిరావు, చంద్రమోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget