Salman Khan: రష్మిక కూతురితోనూ నటిస్తా... ఆమెకు లేని ఇబ్బంది మీకేంటి? ఏజ్ గ్యాప్ కాంట్రవర్సీపై సల్మాన్ స్ట్రాంగ్ రియాక్షన్
Salman Khan : 'సికందర్' మూవీలో జంటగా నటిస్తున్న సల్మాన్ ఖాన్ - రష్మిక మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి విమర్శలు విన్పిస్తున్నాయి. తాజాగా ఈ వివాదంపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన భారీ యాక్షన్ డ్రామా 'సికందర్'. ఈ మూవీ మార్చి 30న ఈద్ పండుగ కానుకగా థియేటర్లలోకి రానుంది. రష్మిక మందన్న ఇందులో ఫిమేల్ లీడ్ గా నటించింది. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ కు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. గత సంవత్సరం 'సికందర్'లో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పుడే వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సల్మాన్ ఏజ్ గ్యాప్ వివాదంపై స్పందిస్తూ, స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
30 ఏళ్లు ఏజ్ గ్యాప్
సినిమా ఇండస్ట్రీలో తరచుగా చర్చకు వచ్చే అంశాలలో హీరోలకు, హీరోయిన్లకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ కూడా ఒకటి. హీరోయిన్లకు మాత్రం ఇండస్ట్రీలో దశాబ్దం దాటితే, అవకాశాలు కరువు అవుతూ ఉంటాయి. కానీ హీరోల విషయంలో అలా జరగదు. 60లలోకి అడుగు పెట్టిన చాలా మంది హీరోలు... ఇప్పటికి కూడా పాతికేళ్ళ హీరోయిన్లతో రొమాన్స్ చేయడంపై విమర్శలు విన్పిస్తూనే ఉన్నాయి. కొంత మంది హీరోలు మాత్రమే తమ ఏజ్ కు తగ్గ రోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అన్నది వాస్తవం. ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్స్ ఈ వివాదంపై ఎప్పుడూ పెదవి విప్పరు. కానీ తాజాగా సల్మాన్ ఖాన్ మాత్రం ఇచ్చి పడేశాడు. 'సికందర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మికకు, సల్మాన్ కు 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందనే విమర్శలకు సమాధానం చెప్పారు సల్మాన్.
Megastar #SalmanKhan giving a reply to trollers in his own way at the #SikandarTrailer launch event:
— 𝑺ᴀʟᴍᴀɴᴏᴘʜɪʟᴇ 🚩 (@katarsalmanfan) March 23, 2025
They say there’s a 31-year difference between the heroine and me. If the heroine has no problem with it and her father has no problem, why do you have 😂🔥. #Sikandar pic.twitter.com/scb9t2NfrF
రష్మిక కూతురుతో కూడా నటిస్తా - సల్మాన్
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'సికందర్' ఈద్ సందర్భంగా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరో వారం రోజుల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం 'సికందర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఆ వేడుకలోనే హీరో హీరోయిన్ల వయసు తేడా గురించి సల్మాన్ కు ప్రశ్న ఎదురైంది. దానికి సల్మాన్ ఖాన్ స్పందిస్తూ "ఆమెకు, నాకు ఇబ్బంది లేనప్పుడు మీకెందుకు? ఈ సినిమాలో నాకు, హీరోయిన్ కి మధ్య 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు. అయితే హీరోయిన్ కు, ఆమె తండ్రికి సమస్య లేదు. మరి మీకెందుకు? రష్మిక ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు పాప పుడితే ఆమె కూడా బిగ్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా రష్మిక పాపతో కూడా కలిసి నటిస్తా. అయితే ఆ సమయంలో కూడా తల్లిగా రష్మిక అనుమతి తీసుకునే చేస్తాను" అంటూ ఏజ్ గ్యాప్ వివాదంపై గట్టిగా ఇచ్చిపడేశారు. ఇదిలా ఉండగా, సల్లూ భాయ్ అభిమనులంతా 'సికందర్' రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 'పుష్ప 2', 'ఛావా' వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ఈ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

