NTR: జపాన్లో ఎన్టీఆర్ కటౌట్‌కు పూజలు... అమ్మాయిలేంటి ఇంత క్రేజీగా ఉన్నారు... వైరల్ వీడియో చూశారా?
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన మూవీ 'దేవర'. త్వరలో జపాన్ లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అక్కడ ఎన్టీఆర్ కు ఉన్న లేడీ ఫ్యాన్స్ 'దేవర'పై అభిమానానాన్ని ఓ వీడియో ద్వారా చాటుకున్నారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన 'దేవర' (Devara Movie) మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీని త్వరలోనే జపాన్ (Devara Japan Release)లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ అంటే తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వీడియోలు చేస్తున్నారు. అందులో అమ్మాయిలంతా కలిసి 'దేవర' మూవీని ప్రత్యేకంగా ప్రమోట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
'దేవర'కు జపాన్ లేడీ ఫ్యాన్స్ పూజ
'దేవర' మూవీకి సంబంధించి జపాన్ లో 2025 మార్చి 19న ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. అక్కడ ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం విశేషం. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత అక్కడ రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ మూవీ ఇదే. మరో ఐదారు రోజుల్లో 'దేవర' జపాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో అక్కడ ఉన్న తారక్ ఫ్యాన్స్ హడావిడి మొదలు పెట్టారు. తాజాగా జపాన్లో ఉన్న కొంత మంది తారక్ లేడీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా 'దేవర'కు సంబంధించి పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో 'దేవర' మూవీలోని ఎన్టీఆర్ కటౌట్ ను పెట్టి, దానికి పూజ చేస్తూ కనిపిస్తున్నారు అమ్మాయిలు. ఇదిలా ఉండగా 'దేవర' మూవీని మార్చ్ 28న జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు.
🇮🇳祝デーヴァラ日本公開🇯🇵
— 🇯🇵 ぼらこ నా పేరు నావోరి / Nickname:Shilpa (@QUEENjiyko) March 21, 2025
インドのファンが建物の上からざばーって垂れ幕を下ろすアレに憧れて、ミニ垂れ幕を作りました。@devaramovie_jp. #DEVARA #デーヴァラ #DevaraInJapan pic.twitter.com/FjAP0hbuce
ఓటీటీలోనూ 'దేవర' సంచలనం
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర పార్ట్ 1' 2024 సెప్టెంబర్ 27న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. రెండు భాగాలుగా ఈ మూవీ రాబోతుండగా, 'దేవర పార్ట్ వన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. మొదటి రోజే 172 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించిన ఈ మూవీ క్లోజింగ్ టైంకి 550 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా ఈ మూవీ చేసిన హడావిడి అంతా కాదు. 2024 నవంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది 'దేవర'. నాన్ ఇంగ్లీష్ సినిమా కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ కొల్లగొట్టిన నాలుగవ మూవీగా నెట్ ఫ్లిక్స్ లో 'దేవర' రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ జపాన్ లో రిలీజ్ కాబోతుండడంతో అక్కడ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రానుంది అనేది ఆసక్తికరంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

