Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో KL రాహుల్ భారత్‌కు కెప్టెన్ గా భాద్యతలు తీసుకున్నాడు. శుబ్మన్ గిల్ గాయం కారణంగా దూరం అవడంతో అతని స్థానంలో రాహుల్‌ను తాత్కాలిక వన్డే కెప్టెన్ గా నిర్ణయించింది బీసీసీఐ.
అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీమ్ లో లేకపోవడం పెద్ద లోటు అయినప్పటికీ... 'వన్డేల మాస్టర్' విరాట్ కోహ్లీ టీమ్ లో ఉన్నాడని కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు."బౌండరీలు కొట్టడం ఎంత ముఖ్యమో, సింగిల్స్ తీయడం అంతే ముఖ్యం. విరాట్ తన కెరీర్‌లో ఇది బాగా చేశాడు. ఎలా మెరుగవ్వాలి, గేమ్ ప్లాన్ ఎలా ఉండాలనే విషయంపై డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో చర్చించేవాళ్లం. ఎందుకంటే వన్డే క్రికెట్‌కు మాస్టర్ కింగ్ కోహ్లీ. అతన్ని తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌లో చూడటం చాలా బాగుంది" అన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కాన్ఫిడెన్స్ ని పెంచారు. ఆ ఇద్దరూ టీమ్ లో ఉండటం మాకు కలిసొస్తుంది. వారికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. వారు డ్రెస్సింగ్ రూమ్‌పై ఒత్తిడి తగ్గిస్తారని నమ్మకం ఉందని" రాహుల్ పేర్కొన్నాడు.






















