SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
త్వరలో భారత్‌లో నాలుగు పెద్ద SUVలు విడుదల కానున్నాయి. వాటిలో మారుతి ఈ విటారా Maruti e Vitara, టాటా హారియర్ (Tata Harrier Petrol), Tata Safari Petrol, Next-Gen Kia Seltos ఉన్నాయి.

SUVs to launch in December | 2025 చివరి నెల డిసెంబర్ భారత SUV మార్కెట్‌కు చాలా ప్రత్యేకం కానుంది. డిసెంబర్‌లో 4 పెద్ద SUVలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటిలో మారుతి కంపెనికి చెందిన మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ SUV e విటారా, టాటా మోటార్స్ నుంచి ప్రజాదరణ పొందిన హారియర్, సఫారిల పెట్రోల్ వెర్షన్ సహా కియా న్యూ జనరేషన్ సెల్టోస్ ఉన్నాయి. ఇవి మార్కెట్లోకి వచ్చాక మిడ్-సైజ్ SUV విభాగంలో గట్టి పోటీ తప్పదు. ఆ ఎస్‌యూవీల ఫీచర్లు, రేంజ్ వివరాలు చూసి డిసైడ్ అవ్వాలి.
మారుతి సుజుకి e విటారా (Maruti e Vitara)
మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ SUV e విటారాను డిసెంబర్ 2న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ SUV కొత్త EV ఆధారిత HEARTECT E-స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారు. ఈ విటారా కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. మారుతి కంపెనీ ఇందులో 49 kWh, 61 kWh బ్యాటరీలను అందిస్తుంది. కంట్రోల్, కనెక్టివిటీ కోసం, ఇది 12.3 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లెవెల్-2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. ఈ SUV నాలుగు వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తుంది. దాంతో మార్కెట్లోకి రాకముందే మారుతి సుజుకీ ఈ విటారా ఎస్‌యూవీలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
టాటా హారియర్, టాటా సఫారి
టాటా మోటార్స్ మొదటిసారిగా హారియర్, సఫారిలను పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. టాటా మోటార్స్‌కు చెందిన ఈ రెండు SUVలలో కొత్త 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 168 PS పవర్ జనరేట్ చేస్తుంది. అదే సమయంలో 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను తీసుకొచ్చింది. టాటా హారియర్ ఎస్‌యూవీ, టాటా సఫారీ ఎస్‌యూవీలను డిసెంబర్ 9, 2025న విడుదల చేయడానికి కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. పెట్రోల్ ఇంజిన్ మోడల్స్ డీజిల్ వేరియంట్‌ల కంటే చౌకగా ఉండనున్నాయి. దాంతో ఇది ఈ SUVల కస్టమర్ బేస్‌ను బాగా పెంచుకుంటుందని భావిస్తున్నారు.
నెక్స్ట్-జెన్ కియా సెల్టోస్ (Kia Seltos Next Gen)
కియా తన సెకండ్ జనరేషన్ సెల్టోస్‌ను డిసెంబర్ 10వ తేదీన దక్షిణ కొరియాలో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత దీనిని 2026 ప్రారంభంలో భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. కొత్త సెల్టోస్‌లో డిజైన్ నుండి ఇంటీరియర్ వరకు పెద్ద మార్పులు చూడవచ్చు. దీని క్యాబిన్‌లో కొత్త డాష్ లేఅవుట్, అప్‌డేట్ చేసిన డిజిటల్ స్క్రీన్, ప్రీమియం మెటీరియల్స్ ఉంటాయి. ఇంజిన్ ఎంపికలలో 1.5 NA పెట్రోల్, 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 డీజిల్ ఇంజిన్లు కొనసాగుతాయి. ఇవి మాన్యువల్ సహా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో విడుదల అవుతున్నాయి. దాంతో ట్రాఫిక్ ఎక్కువ ఉండే రోడ్లపై డ్రైవింగ్ చేసే వారికి కొంచెం ఉపశమనం కలుగుతుంది.






















