అన్వేషించండి

ఈ నెలలో Honda City, Elevate, Amaze కొనేవాళ్లకు భారీ బెనిఫిట్స్‌ - ₹1.97 లక్షల వరకు డిస్కౌంట్

Honda మార్చి 2026లో City, Elevate, Amaze కార్లపై ₹1.97 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. హైదరాబాద్, విజయవాడ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు, వేరియంట్ వారీ ఆఫర్ల వివరాలను తెలుసుకోండి.

Honda City March Offer: జపాన్ కార్ల తయారీ సంస్థ Honda Cars India, ఈ నెలలో ‍‌(మార్చి 2026) తన మొత్తం మోడల్ లైనప్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. Honda City, Honda Elevate, Honda Amaze మోడళ్లపై గరిష్టంగా ₹1.97 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ వంటి ఆఫర్లు ఇందులో ఉన్నాయి. అయితే నగరం, వేరియంట్, స్టాక్ అందుబాటు ఆధారంగా ఆఫర్లు మారుతాయి కాబట్టి హైదరాబాద్, విజయవాడ డీలర్ వద్ద ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడం మంచిది.

Honda City - గరిష్టంగా ₹1.97 లక్షల వరకు లాభం

మార్చి నెలలో Honda కార్లలో అత్యధిక బెనిఫిట్ అందిస్తున్న మోడల్ City e HEV హైబ్రిడ్ వేరియంట్. దీనిపై గరిష్టంగా ₹1.97 లక్షల వరకు ఆఫర్ లభిస్తుంది. ఈ హైబ్రిడ్ సెడాన్‌లో 1.5 లీటర్ శక్తిమంతమైన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఇస్తారు. ఇది 126 hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. e CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుతుంది.

City హైబ్రిడ్ ఎక్స్‌-షోరూమ్‌ ధర భారత్‌లో సుమారు ₹20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

పెట్రోల్ వేరియంట్ల విషయానికి వస్తే, గరిష్టంగా ₹1.56 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 121 hp పవర్ ఇస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆప్షన్ ఉంటుంది.

City పెట్రోల్ ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹11.95 లక్షల నుంచి ₹16.15 లక్షల వరకు ఉంది.

Honda Elevate - ₹1.81 లక్షల వరకు డిస్కౌంట్

మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీ పడుతున్న Elevate పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. మార్చి నెలలో గరిష్టంగా ₹1.81 లక్షల వరకు లాభం పొందొచ్చు.

ఈ SUVలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 121 hp పవర్ ఇస్తుంది. మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే Elevate లో హైబ్రిడ్ ఆప్షన్‌ లేదు.

Elevate ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹11.6 లక్షల నుంచి ₹16.25 లక్షల వరకు ఉంది.

Honda Amaze - ₹68,000 వరకు ఆఫర్

Honda ప్రస్తుతం రెండో తరం, మూడో తరం Amaze మోడళ్లను ఒకేసారి విక్రయిస్తోంది. పాత మోడల్‌పై గరిష్టంగా ₹68,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రెష్‌ Amaze మోడల్‌పై గరిష్టంగా ₹57,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ రెండు మోడళ్లలో కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 hp పవర్ ఇస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆప్షన్ ఉంటుంది.

ప్రస్తుత Amaze ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹7.47 లక్షల నుంచి ₹10 లక్షల వరకు ఉంది. పాత మోడల్ ధర ₹6.98 లక్షల నుంచి ₹7.8 లక్షల వరకు ఉంది.

తెలుగు రాష్ట్రాల యూజర్లకు ఇదేనా మంచి సమయం?

హైదరాబాద్, వరంగల్‌, విజయవాడ, విశాఖ వంటి తెలుగు నగరాల్లో హోండా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా City హైబ్రిడ్‌పై భారీ డిస్కౌంట్ ఉండటం ఆకర్షణీయమైన అంశం. SUV కొనాలనుకునేవారికి Elevate మంచి ఆప్షన్. తక్కువ బడ్జెట్ సెడాన్ కావాలంటే Amaze సరైన ఎంపిక.

కార్ కొనుగోలు ముందు డీలర్‌ను సంప్రదించి ఖచ్చితమైన ఆన్‌-రోడ్ ధర, బీమా, రిజిస్ట్రేషన్ ఖర్చులు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
Embed widget