అన్వేషించండి

Honda Activa 125 vs Suzuki Access 125: హోండా యాక్టివా 125 vs సుజుకి యాక్సెస్‌ 125లో కింగ్ ఎవరు? సిటీ రైడర్లకు ఏది మంచిది?

Honda Activa 125 vs Suzuki Access 125: స్కూటర్‌లు ఎవరైనా కొనాలనే ఆలోచన వస్తే మొదటి మైండ్‌లో వచ్చే పేరు యాక్టివా, ఆ తర్వాత యాక్సస్‌. మరి ఈ రెండింటిలో ఏది బెటర్, సిటీ డ్రైవింగ్‌కు ఏది మంచిదో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ధరలో సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125 కంటే చౌక.
  • ఇంజిన్, పనితీరు: యాక్టివా 125 స్మూత్, యాక్సెస్ 125 పికప్ బాగుంది.
  • మైలేజీలో యాక్టివా 125 స్వల్పంగా ముందు, యాక్సెస్ 125 కూడా పోటీ ఇస్తుంది.
  • ఫీచర్లు, స్టోరేజ్: యాక్సెస్ 125 స్టోరేజ్, యాక్టివా 125 H-smart ఫీచర్ అందిస్తున్నాయి.
  • ఐదేళ్ల ఖర్చు, నిర్వహణలో హోండా యాక్టివా 125 లాభదాయకం.

Honda Activa 125 vs Suzuki Access 125: భారతీయ రోడ్లపై స్కూటర్ల ఆధిపత్యం గురించి మాట్లాడితే, అందరికీ ముందుగా గుర్తొచ్చే పేర్లు హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్‌. ముఖ్యంగా 125cc విభాగంలో ఈ రెండు మోడల్స్‌ దశాబ్దాలుగా తిరుగులేని దిగ్గజాలుగా కొనసాగుతున్నాయి. 2026 నాటికి నగర ప్రయాణాలకు అనువైన ఫీచర్లు, మెరుగైన మైలేజ్, అత్యాధునిక సాంకేతికతతో ఈ రెండు స్కూటర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే కొత్త వాహనాన్ని కొనేముందు ఏది ఆర్థికంగా లాభదాయకం? ఏది మెరుగైన పనితీరును కనబరుస్తుంది? ఒక్కసారి పరిశీలిద్దాం...

ధరల్లో ఎవరిది పైచేయి?

ధర విషయంలో సుజుకి యాక్సెస్‌ 125 తన దూకుడును ప్రదర్శిస్తోంది. సుజుకి యాక్సెస్‌ 125 ఎక్స్‌ షోరూమ్‌ ధర సుమారు 80, 643 నుంచి ప్రారంభమవుతుంది. హోండా యాక్టివా 125 ప్రారంభ ధర 92, 297 రూపాయలుగా ఉంది. 

హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధరలను పరిశీలిస్తే... సుజుకి యాక్సెస్‌ 125 బేస్ వేరియంట్‌ సుమారు 1,09,056కి లభిస్తుండగా, హోండా యాక్టివా 125 బేస్‌ వేరియంట్‌ 1,13,583కి అందుబాటులో ఉంది. అంటే ప్రారంభస్థాయిలో సుజుకి యాక్సెస్‌ సుమారు పదివేల నుంచి 12వేల వరకు తక్కువ ధరతో ఎంట్రీ లెవల్‌ కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. హోండా యాక్టివా 125 మొత్తం 3 వేరియంట్లలో సుజుకి యాక్సెస్‌ 125 మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తున్నాయి. 

ఇంజన్, పనితీరు; స్మూత్‌నెస్ vs పికప్‌

టెక్నికల్‌గా ఈ రెండు స్కూటర్లు దాదాపు సమానమైన శక్తిని కలిగి ఉన్నాయి. హోండా యాక్టివా 125లో 123.92 సీసీ ఇంజిన‌ ఉండగా, సుజుకి యాక్సెస్‌ 125లో 124cc ఇంజన్ అమర్చారు. రెండు స్కూటర్లు కూడా 6500 rpm వద్ద 8.3 గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 

అయితే టార్క్‌ విషయంలో స్వల్ప తేడాలు ఉన్నాయి. హోండా యాక్టివా 124 10.5Nm టార్క్‌ను అందిస్తుండగా, సుజుకి యాక్సెస్‌ 125 10.2Nm టార్క్‌ను అందిస్తుంది. 

హోండా ఇంజన్ అత్యంత స్మూత్‌గా, రిఫైన్డ్‌గా ఉంటుంది. ఇందులోఉన్న సైలెంట్‌ స్టార్‌ టెక్నాలజీ స్టార్టింగ్‌ సమయంలో ఎటువంటి శబ్దం రాకుండా చేస్తుంది. సుజుకి యాక్సెస్‌ 125 దాని వేగవంతమైన పికప్‌, ఎక్సలరేషన్‌కు ప్రసిద్ధి చెందింది. రెండు స్కూటర్లు కూడా గరిష్టంగా గంటకు 90కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. 

లీటర్‌కు ఎన్ని కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి?

నగర ప్రయాణాల్లో మైలేజీ అత్యంత కీలకం. హోండా యాక్టివా 125 ఇక్కడ స్వల్పంగా ముందంజలో ఉంది. హోండా తన ఇడ్లింగ్‌ స్టాప్‌ సిస్టమ‌ కారణంగా సిటీలో 45-50kmpl రియల్‌- వరల్డ్‌ మైలేజీని ఇస్తుంది. సుజుకి యాక్సెస్‌ 125 తన SEPటెక్నాలీతో 42-47 kmp వరకు మైలేజీని అందిస్తోంది. 

లెటెస్ట్ టెక్నాలజీలో టాప్ ఎవరు?

నేటి తరం వాహనదారులకు అవసరమైన అన్ని  అధునిక ఫీచర్లను ఈ రెండు కంపెనీలు అందిస్తున్నాయి. రెండు స్కూటర్ల టాప్ వేరియంట్లలో TFT స్క్రీన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ ఉన్నాయి. హోండాలో రోడ్‌ సింక్‌ ఫీచర్‌ ఉండగా, సుజుకిలో కాల్స్‌ SMS అలర్ట్స్‌ వంటి బ్లూటూత్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇక్కడ సుజుకి యాక్సెస్‌ 125 స్పష్టమైన విజేతగా చెప్పవచ్చు. ఇందులో 24.4 లీటర్ల భారీ అండర్ సీట్ సటోరేజ్‌ ఉంది. అదే హోండా యాక్టివా 125లో కేవలం 18 లీటర్ల మాత్రమే ఉంది. హోండా తన టాప్ వేరియంట్‌లో H-smart అనే కీలెస్ ఎంట్రీ, లాక్ ఫీచర్ అందిస్తోంది. రెండు స్కూటర్లలోనూ కాంబీ బ్రేక్ సిస్టమ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇంజన్‌ కట్‌ ఆఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 

నిర్వహణ- వారంటీ విషయంలో ఏది బెటర్ 

హోండా తన సర్వీస్‌ నెట్‌వర్క్ , వారంటీ విషయంలో నమ్మకాన్ని కలిగి ఉంది. హోండా 3 ఏళ్లు లేదా 36వేల కిలోమీటర్లకు వారంటీ ఇస్తుండగా, సుజుకి 2 ఏళ్లు లేదా 24వేల కిలోమీటర్లకు మాత్రమే వారంటీ ఇస్తోంది. హోండా 3 ఉచిత సర్వీస్‌లు ఇస్తే, సుజుకి 4 ఉచిత సర్వీస్‌లు అందిస్తోంది. సగటు వార్షిక మెయింటెనెన్స్‌ ఖర్‌చు 1500 నుంచి 2500 మధ్య ఉంటుంది. 

ఐదేళ్ల ఓనర్‌ షిప్ ఖర్చు

ఒక వాహనం కొన్న తర్వాత ఐదేళ్ల పాటు అయ్యే ఖర్చును లెక్కిస్తే అంటే సుమారు 50వేల కిలోమీటర్లు ప్రయాణించారని అనుకుంటే... హోండా యాక్టివా 125 మరింత లాభదాయకంగా ఉంటుంది. హోండాకు ఉన్న మెరుగైన మైలేజీ, అధిక రీసేల్‌ వాల్యూ వల్ల, ఐదేళ్ల తర్వాత నికర ఖర్చు సుమారు 1, 38, 732 రూపాయలు అవుతుంది. అదే సుజుకి యాక్సెస్‌ 125కి 1,52, 084 రూపాయలుగా ఉంది. అంటే హోండా యాక్టివా 125 వల్ల దీర్ఘకాలంలో సుమారు 13, 352 రూపాయలు ఆదా అవుతుంది. 

ఏ వర్గానికి ఏది సరిపోతుంది?

సిటీ, ఫ్యామిలీ కోసం హోండా యాక్టివా 125 మంచి ఆప్షన్. దీని స్మాత్‌ ఇంజన్, మంచి మైలేజ్‌, సర్వీస్‌ నెట్‌వర్క్ వీళ్లకు సరిగా సరిపోతుంది. యువత, హైవేలో ప్రయాణించే వాళ్లకు సుజుకి యాక్సెస్‌ 25 మేలైంది. అధిక పికప్‌, స్లైలిష్‌లుక్‌, లార్జ్‌స్టోరేజ్‌, స్పీడ్‌ ఎక్సీడింగ్‌ అలర్ట్‌ వంటి ఫీచర్లు యువతను ఆకట్టుకుంటాయి. 

Frequently Asked Questions

హోండా యాక్టివా 125 మరియు సుజుకి యాక్సెస్ 125 మధ్య ధరలో తేడా ఏమిటి?

సుజుకి యాక్సెస్ 125 ధర సుమారు 80,643 రూపాయల నుండి ప్రారంభమవుతుంది, అయితే హోండా యాక్టివా 125 ధర 92,297 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ప్రారంభ ధరలలో సుజుకి యాక్సెస్ 125 సుమారు 10,000 నుండి 12,000 రూపాయలు తక్కువ.

ఇంజన్ పనితీరులో రెండు స్కూటర్లు ఎలా ఉన్నాయి?

రెండు స్కూటర్లు దాదాపు సమానమైన శక్తిని కలిగి ఉన్నాయి, 6500 rpm వద్ద 8.3 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తాయి. హోండా ఇంజన్ స్మూత్ గా ఉంటుంది, సుజుకి యాక్సెస్ వేగవంతమైన పికప్ కు ప్రసిద్ధి.

మైలేజ్ విషయంలో ఏ స్కూటర్ మెరుగైనది?

హోండా యాక్టివా 125 కొంచెం మెరుగైన మైలేజ్ ఇస్తుంది, సిటీలో 45-50 kmpl వరకు అందిస్తుంది. సుజుకి యాక్సెస్ 125 తన SEP టెక్నాలజీతో 42-47 kmpl వరకు అందిస్తుంది.

లెటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ లో ఏ స్కూటర్ ముందుంది?

రెండు స్కూటర్లలో TFT స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుజుకి యాక్సెస్ 125లో 24.4 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంది, ఇది హోండా యాక్టివా 125 (18 లీటర్లు) కంటే ఎక్కువ.

దీర్ఘకాలికంగా ఏది ఎక్కువ లాభదాయకం?

ఐదేళ్ల ఓనర్షిప్ ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే, హోండా యాక్టివా 125 మరింత లాభదాయకంగా ఉంటుంది. మెరుగైన మైలేజ్ మరియు అధిక రీసేల్ వాల్యూ కారణంగా ఇది సుమారు 13,352 రూపాయలు ఆదా చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget