అన్వేషించండి

TVS Orbiter ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రివ్యూ: కొనడానికి 3 కారణాలు, స్కిప్‌ చేయడానికి 2 కారణాలు

TVS Orbiter ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రేంజ్‌, ఫీచర్లు, లోపాలు, తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్‌ ధర వివరాలతో పూర్తి సమీక్ష. ఇది మీకు సరైన స్కూటరేనా? తెలుసుకోండి.

TVS Orbiter Electric Scooter Price And Features: TVS మోటార్‌ కంపెనీ నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ TVS Orbiter. ప్రాక్టికాలిటీ, కనెక్టివిటీ, కంఫర్ట్‌ మధ్య బ్యాలెన్స్‌గా ఈ స్కూటర్‌ను రూపొందించారు. iQubeలో ఉపయోగించిన అదే 3.1kWh బ్యాటరీ ఇక్కడ కూడా ఉంది. కానీ ఈ స్కూటర్‌లో మోటార్‌ ట్యూనింగ్‌ పూర్తిగా రేంజ్‌ మీద ఫోకస్‌ చేసి చేశారు. వేగం కన్నా రోజువారీ ప్రయాణంలో ఎక్కువ దూరం వెళ్లేలా ఈ స్కూటర్‌ డిజైన్‌ చేశారు.

కొనదగిన కారణాలు

ప్రత్యేక డిజైన్‌, ఉపయోగకరమైన ఫీచర్లు

TVS Orbiter డిజైన్‌ చూస్తే వెంటనే ప్రత్యేకంగా కనిపిస్తుంది. షార్ప్‌, బాక్సీ స్టైల్‌తో పాటు ఫ్లాట్‌ సీట్‌ ఈ స్కూటర్‌కు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. ఫ్రంట్‌ ఏప్రన్‌ మీద ఉన్న DRL స్ట్రిప్‌, అందులోనే ఇంటిగ్రేటెడ్‌ టర్న్‌ సిగ్నల్స్‌ ఆకట్టుకుంటాయి.
ప్రాక్టికాలిటీ విషయంలో ఇది మంచి స్కోర్‌ సాధించింది. 34 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌ ఉంది. ఇందులో రెండు హాఫ్‌ ఫేస్‌ హెల్మెట్లు సులభంగా పెట్టుకోవచ్చు. ముందు భాగంలో చిన్న కబ్బీహోల్‌, డాష్‌ కింద USB పోర్ట్‌ ఉన్నాయి. రోజూ ఆఫీస్‌, షాపింగ్‌ ట్రిప్స్‌కు ఇవి బాగా ఉపయోగపడతాయి.

నిదానంగా నడిపితే మంచి రేంజ్‌

Orbiter‌ను సాఫ్ట్‌గా నడిపితే ఇది నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. సిటీ మోడ్‌లో మెల్లగా రైడ్‌ చేస్తే ఫుల్‌ చార్జ్‌తో 112 కిలోమీటర్ల రేంజ్‌ వచ్చింది. అయితే అగ్రెసివ్‌ రైడింగ్‌, ఎక్కువ బరువు మోస్తే రేంజ్‌ తగ్గుతుంది. చార్జింగ్‌ విషయానికి వస్తే, బ్యాటరీ 0 నుంచి 80 శాతం చార్జ్‌ అవ్వడానికి సుమారు 4 గంటల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అంటే రోజూ రాత్రి చార్జ్‌ పెట్టుకుంటే సరిపోతుంది.

ధరకు తగిన ఫీచర్లు

₹1.05 లక్షల (సబ్సిడీకి ముందు ఎక్స్‌-షోరూమ్‌ ధర, తెలుగు రాష్ట్రాలు) ధరకు Orbiter మంచి ఫీచర్‌ ప్యాక్‌ను ఇస్తుంది. Raider లోయర్‌ వేరియంట్స్‌లో ఉన్న LCD స్క్రీన్‌ ఇక్కడ కూడా ఉంది. SmartXonnect యాప్‌ ద్వారా బ్లూటూత్‌ కనెక్టివిటీ లభిస్తుంది. క్రూయిజ్‌ కంట్రోల్‌, పార్క్‌ అసిస్ట్‌ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 760mm సీట్‌ హైట్‌, 112 కిలోల కర్బ్‌ వెయిట్‌ ఉండటం వల్ల కొత్త రైడర్లకు కూడా ఇది సులభంగా అనిపిస్తుంది.

కొనకుండా ఆగడానికి కారణాలు

పెద్ద నగరాల్లో వేగం తక్కువగా అనిపిస్తుంది

Orbiter వేగం విషయంలో కాస్త నిరాశ కలిగిస్తుంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగం చేరుకోవడానికి 7 సెకన్లు పడుతుంది. ట్రాఫిక్‌లో సరిపోతుంది కానీ ఫాస్ట్‌గా మూవ్‌ కావడానికి కాదు. 30 కిలోమీటర్ల లోపు యాక్సిలరేషన్‌ చాలా స్లోగా అనిపిస్తుంది.
50-55 కిలోమీటర్ల స్పీడ్‌లో క్రూయిజ్‌ చేయొచ్చు కానీ ఓవర్‌టేక్‌ చేయాలంటే ఈ స్పీడ్‌ సరిపోదు, ముందే ప్లాన్‌ చేసుకోవాలి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న iQube లేదా Activa లాంటి స్కూటర్లతో పోలిస్తే ఇది నిదానమే.

డిస్క్‌ బ్రేక్‌ ఆప్షన్‌ లేకపోవడం

ఈ స్కూటర్‌లో ముందు, వెనుక రెండూ డ్రమ్‌ బ్రేక్స్‌ మాత్రమే ఉన్నాయి. సాధారణ వినియోగానికి సరిపోతాయి కానీ ముందు భాగంలో డిస్క్‌ బ్రేక్‌ ఆప్షన్‌ ఇచ్చి ఉంటే మరింత భద్రత ఉండేది.

హైదరాబాద్‌లో TVS Orbiter ఆన్‌రోడ్‌ ధర

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹1,04,900

EMPS 2024 సబ్సిడీ: ₹5,000 ‍‌(తగ్గింపు)

RTO ఛార్జీలు: ₹1,500

ఇన్సూరెన్స్‌ (కంప్రెహెన్సివ్‌): ₹5,330

మొత్తం ఆన్‌రోడ్‌ ధర (హైదరాబాద్‌): ₹1,06,730

విజయవాడ సహా తెలుగు నగరాలన్నింటిలోనూ స్వల్ప మార్పులతో దాదాపుగా ఇదే ధర ఉంటుంది.

రోజువారీ ప్రయాణం, రేంజ్‌ ప్రాధాన్యతగా చూసే వారికి TVS Orbiter సరైన ఎంపిక. కానీ వేగం, పవర్‌ ఎక్కువ కావాలంటే మరో స్కూటర్‌ వైపు చూడాల్సిందే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం
Exter Sales Report: 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Embed widget