అన్వేషించండి

బడ్జెట్‌ 2026లో ఆటో రంగానికి శుభవార్తలు.. EVలు, ఈ బస్సులు, ప్రమాద క్లెయిమ్‌లపై ట్యాక్స్‌ మినహాయింపు

Union Budget 2026 ఆటో ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. CNGలో బయోగ్యాస్‌ బ్లెండింగ్‌, EV బ్యాటరీల తయారీకి ఊతం, కీలక ఖనిజాలపై డ్యూటీ మినహాయింపు, ప్రమాద క్లెయిమ్‌లపై ట్యాక్స్‌ రద్దు వంటివి ఉన్నాయి.

Union Budget 2026 - Auto Industry: కేంద్ర బడ్జెట్‌ 2026-27లో, కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్‌ రంగాన్ని గ్రీన్‌ మొబిలిటీ వైపు తీసుకెళ్లేలా కీలక నిర్ణయాలు ప్రకటించింది. పర్యావరణ హితం, ఇంధన ఆదా, దేశీయ తయారీ ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా CNG, ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీ తయారీ, ప్రజా రవాణా వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

CNGలో బయోగ్యాస్‌ బ్లెండింగ్‌

ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ఆకర్షించిన అంశం CNGలో బయోగ్యాస్‌ బ్లెండింగ్‌. రవాణా అవసరాల కోసం వాడే CNGలో దశలవారీగా కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (CBG)ని తప్పనిసరిగా కలపనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇదే విధంగా, గృహ అవసరాల కోసం ఉపయోగించే PNGలో కూడా ఈ బ్లెండింగ్‌ అమలు చేయనున్నారు. దీనివల్ల దేశంలో బయోగ్యాస్‌ ఉత్పత్తికి ప్రోత్సాహం లభించడంతో పాటు, దిగుమతి ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీల కోసం కీలక నిర్ణయాలు

ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలోనూ బడ్జెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో EV ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. EVల తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ బస్సుల వినియోగాన్ని పెంచేందుకు పేమెంట్‌ సెక్యూరిటీ మెకానిజంలను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు. దీని వల్ల ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలపడనుంది.

EV బ్యాటరీల తయారీకి ఊతమిచ్చేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ తయారీకి అవసరమైన 35 అదనపు క్యాపిటల్‌ గూడ్స్‌ను కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు జాబితాలో చేర్చారు. అదే విధంగా మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీల తయారీకి అవసరమైన మరో 28 క్యాపిటల్‌ గూడ్స్‌కూ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. దీని వల్ల దేశీయంగా లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీల తయారీ పెరిగి, ఖర్చు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

కీలక ఖనిజాలపై సుంకం రద్దు

కీలక ఖనిజాల విషయంలోనూ ఆటో ఇండస్ట్రీకి లాభం కలిగే నిర్ణయం తీసుకున్నారు. కోబాల్ట్‌ పౌడర్‌, లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీ స్క్రాప్‌, లీడ్‌, జింక్‌తో పాటు మరో 12 కీలక ఖనిజాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా రద్దు చేశారు. ఇది గతంలో మినహాయించిన 25 కీలక ఖనిజాలకు అదనం. ఈ చర్య వల్ల తయారీ రంగంలో ముడి సరుకుల లభ్యత పెరిగి, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.

ఇదే బడ్జెట్‌లో రోడ్డు ప్రమాద బాధితులకు కూడా పెద్ద ఊరట లభించింది. మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చే వడ్డీపై ఆదాయ పన్ను పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అలాగే ఆ వడ్డీపై TDSను పూర్తిగా రద్దు చేశారు. దీంతో బాధితులకు మంజూరైన పరిహారం ఎలాంటి కోతలు లేకుండా మొత్తం వారి చేతికి చేరుతుంది.

మొత్తంగా Union Budget 2026 ఆటో ఇండస్ట్రీని గ్రీన్‌, సస్టైనబుల్‌, దేశీయ తయారీ వైపు తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా మారింది. ఈ నిర్ణయాలు రానున్న రోజుల్లో వాహన మార్కెట్‌పై, వినియోగదారుల ఖర్చులపై, పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget