అన్వేషించండి

కోట్లు విలువ చేసే కార్లు నడుపుతున్న బాలీవుడ్‌ స్టార్లు - బుగట్టి నుంచి రోల్స్‌ రాయిస్‌ వరకు పూర్తి లిస్ట్‌

షారుఖ్‌ ఖాన్‌ బుగట్టి, శ్రద్ధా కపూర్‌ లాంబోర్గినీ, రణవీర్‌ సింగ్‌ ఆస్టన్‌ మార్టిన్‌ సహా బాలీవుడ్‌ స్టార్లు నడిపే కోట్లు విలువ చేసే లగ్జరీ కార్ల పూర్తి వివరాలు ఇక్కడే ఉన్నాయి.

Bollywood Actors Most Expensive Luxury Cars: బాలీవుడ్‌ స్టార్ల లైఫ్‌స్టైల్‌ అంటే సినిమాలు, గ్లామర్‌, ఫ్యాన్స్‌ మాత్రమే కాదు... వారి గ్యారేజ్‌ల్లో ఉన్న కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు కూడా అంతే హాట్‌ టాపిక్‌. ఎవరు ఏ కారు నడుపుతున్నారు అన్నది తెలుసుకోవడానికి ఫ్యాన్స్‌ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఇప్పుడు షారుఖ్‌ ఖాన్‌ నుంచి కృతి సనన్‌ వరకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు నడిపే అత్యంత ఖరీదైన కార్లపై ఓ లుక్కేద్దాం.

షారుఖ్‌ ఖాన్‌ - Bugatti Veyron

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ గ్యారేజ్‌ అంటే లగ్జరీకి నిర్వచనం. షారుఖ్‌ ఖాన్‌ దగ్గర ఉన్న Bugatti Veyron ధర సుమారు రూ.12 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గా చెబుతారు. దీన్నికితోడు Rolls-Royce Phantom Coupe, Phantom Drophead Coupe, Bentley Continental GT, BMW i8, Range Rover Vogue వంటి కార్లు కూడా ఆయన కలెక్షన్‌లో ఉన్నాయి. వేగం, స్టైల్‌, పవర్‌ - ఈ మూడు కలిసిన కారు వచ్చిదంటే, అది షారుఖ్‌ దగ్గర ఉండాల్సిందే.

శ్రద్ధా కపూర్‌ - Lamborghini Huracán Tecnica

బాలీవుడ్‌లో ఈ మోడల్‌ కారును కొనుగోలు చేసిన తొలి హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్‌ పేరు వినిపిస్తుంది. ఆమె దగ్గర ఉన్న ఎరుపు రంగు Lamborghini Huracán Tecnica ధర సుమారు రూ.4 నుంచి 4.5 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). దీనితో పాటు Mercedes-Benz GLE, Lexus LM 350h కూడా ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయి. శ్రద్ధ యూత్‌ఫుల్‌ స్టైల్‌కి ఈ కారు పర్ఫెక్ట్‌ మ్యాచ్‌.

రణవీర్‌ సింగ్‌ - Aston Martin Rapide S

రణవీర్‌ సింగ్‌ తన 32వ పుట్టినరోజు సందర్భంగా తానకు తానే గిఫ్ట్‌ ఇచ్చుకున్న కారు Aston Martin Rapide S. నాలుగు డోర్లతో వచ్చే ఈ స్పోర్టీ సాలూన్‌ కారు అప్పట్లో రూ.3.8 నుంచి 3.9 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). వైట్‌ కలర్‌, టాన్‌ ఇంటీరియర్‌తో ఈ కారు రణవీర్‌ ఎనర్జీకి అద్దం పడుతుంది.

కృతి సనన్‌ - Mercedes-Maybach GLS 600

టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిన కృతి సనన్‌ గ్యారేజ్‌లో ఉన్న అత్యంత ఖరీదైన కారు Mercedes-Maybach GLS 600 SUV. దీని ధర రూ.2.4 నుంచి 4 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). అంతేకాదు Toyota Vellfire MPV కూడా ఆమె వద్ద ఉంది. కంఫర్ట్‌, లగ్జరీ కోరుకునే వాళ్లకు మేబాచ్‌ బెస్ట్‌ ఆప్షన్‌.

హృతిక్‌ రోషన్‌ - Rolls-Royce Ghost Series II

బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ అని పిలిచే హృతిక్‌ రోషన్‌ దగ్గర ఉన్న Rolls-Royce Ghost Series II ధర సుమారు రూ.7 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). క్లాస్‌, ఎలిగెన్స్‌, పవర్‌ అన్నీ కలిసిన ఈ కారు హృతిక్‌ వ్యక్తిత్వానికి సరిపోతుంది.

ఇమ్రాన్‌ హాష్మీ - Rolls-Royce Ghost Black Badge

2024లో ఇమ్రాన్‌ హాష్మీ కొనుగోలు చేసిన Rolls-Royce Ghost Black Badge ధర సుమారు రూ.12.25 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). బ్లాక్‌డ్‌-అవుట్‌ డిజైన్‌, శక్తిమంతమైన ఇంజిన్‌తో ఈ కారు ఆయన కార్‌ కలెక్షన్‌కు కొత్త గ్లామర్‌ తీసుకొచ్చింది.

అమితాబ్‌ బచ్చన్‌ - Rolls-Royce Phantom

మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు దర్శకుడు విధు వినోద్‌ చోప్రా గిఫ్ట్‌గా ఇచ్చిన Rolls-Royce Phantom అప్పట్లో రూ.3.5 నుంచి 4.5 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). దీనితో పాటు Range Rover Vogue, Porsche Cayman S, Bentley Continental GT వంటి కార్లు కూడా ఆయన వద్ద ఉన్నాయి.

అక్షయ్‌ కుమార్‌ - Rolls-Royce Phantom VII

అక్షయ్‌ కుమార్‌ నడిపే Rolls-Royce Phantom VII ధర రూ.9.5 నుంచి 11 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). ఆయన గ్యారేజ్‌లో Range Rover Vogue, Mercedes-Benz GLS, Porsche Cayenne, Toyota Vellfire కూడా ఉన్నాయి.

బాలీవుడ్‌ స్టార్లకు కార్లు కేవలం ప్రయాణ సాధనం కాదు... అది వారి స్టైల్‌, స్టేటస్‌, వ్యక్తిత్వానికి ప్రతిబింబం. బుగట్టి నుంచి రోల్స్‌ రాయిస్‌ వరకు - ఈ లగ్జరీ కార్లు చూసిన తర్వాత, ఫ్యాన్స్‌ అనేది ఒక్క మాటే... వావ్‌!.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget