అన్వేషించండి

డ్రైవ్‌ చేస్తూ అలసిపోతున్నారా? ఈ 7 మోడ్రన్‌ కార్ టెక్నాలజీలు మీకు పెద్ద రిలీఫ్‌

లాంగ్‌ డ్రైవ్‌లలో డ్రైవర్‌కు తెలియకుండానే అలసట పెరుగుతుంది. ఈ 7 ఆధునిక కార్ టెక్నాలజీలు డ్రైవింగ్‌ సమయంలో మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించి సేఫ్‌ & కంఫర్ట్‌ అనుభవాన్ని ఇస్తాయి.

Adaptive Cruise Control Explained: రోజంతా రోడ్డుపై డ్రైవ్‌ చేయాల్సి వస్తే, డ్రైవర్‌కు తెలియకుండానే అలసట పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా కనిపించదు. నెమ్మదిగా ఏకాగ్రత తగ్గుతుంది, రియాక్షన్‌ టైమ్‌ స్లో అవుతుంది, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనినే డ్రైవర్‌ ఫటిగ్‌ (driver fatigue) అంటారు. ఈ సమస్యను గుర్తించిన కార్ తయారీ కంపెనీలు, డ్రైవర్‌పై భారం తగ్గించేలా కొన్ని స్మార్ట్‌ టెక్నాలజీలను కార్లలో అందిస్తున్నాయి. 

డ్రైవర్‌ అలసటను తగ్గించే 7 మోడ్రన్‌ కార్ టెక్నాలజీలు: 

1. అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌ (Adaptive Cruise Control)

హైవే డ్రైవ్‌లలో ముందున్న వాహనానికి దూరాన్ని ఆటోమేటిక్‌గా మెయింటైన్‌ చేస్తూ, స్పీడ్‌ను సర్దుబాటు చేసే టెక్నాలజీ ఇది. బ్రేక్‌, యాక్సిలరేటర్‌ను పదే పదే వాడాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. దీంతో డ్రైవర్‌ మానసిక ఒత్తిడి తగ్గి, డ్రైవ్‌ మరింత నేచురల్‌గా అనిపిస్తుంది.

2. లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌ (Lane keeping assist)

సిగ్నల్‌ ఇవ్వకుండా వాహనం లేన్‌ నుంచి బయటకు వెళ్తే, స్టీరింగ్‌ను సాఫ్ట్‌గా సరిచేసే సిస్టమ్‌ ఇది. హైవేల్లో ఒకే రకమైన రోడ్డు పరిస్థితుల్లో డ్రైవ్‌ చేస్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న స్టీరింగ్‌ కరెక్షన్‌ల భారం తగ్గి అలసట తగ్గుతుంది.

3. డ్రైవర్‌ అటెన్షన్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (Driver attention monitoring systems)

ఈ సిస్టమ్‌ డ్రైవర్‌ తల కదలికలు, కళ్ల చలనం, డ్రైవింగ్‌ ప్యాటర్న్‌ను గమనిస్తుంది. అలసట లక్షణాలు కనిపిస్తే, అలర్ట్‌లు ఇస్తుంది. ముందే హెచ్చరిక రావడం వల్ల కాసేపు విశ్రాంతి తీసుకోవడం, జాగ్రత్త పడడం సులభమవుతుంది.

4. ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ (Automatic climate control)

క్యాబిన్‌లో ఉష్ణోగ్రత ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాల్సిన పని లేకుండా చేసే ఫీచర్‌ ఇది. ఎక్కువ వేడి లేదా ఎక్కువ చలి రెండూ అలసట పెంచుతాయి. స్థిరమైన టెంపరేచర్‌ ఉండడం వల్ల డ్రైవర్‌ కంఫర్ట్‌గా ఉండగలుగుతాడు.

5. నాయిస్‌ తగ్గించే క్యాబిన్‌ డిజైన్‌ (Noise-reducing cabin design)

ఆధునిక కార్లలో అకౌస్టిక్‌ గ్లాస్‌, మెరుగైన ఇన్సులేషన్‌, ఏరోడైనమిక్‌ డిజైన్‌ వంటివి వాడుతున్నారు. దీంతో బయట శబ్దం లోపలికి చాలా తక్కువగా వస్తుంది. క్యాబిన్‌లోని నిశ్శబ్ద వాతావరణం డ్రైవర్‌ మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచుతుంది.

6. హెడ్‌ అప్‌ డిస్‌ప్లే (HUD)

స్పీడ్‌, నావిగేషన్‌ వంటి ముఖ్యమైన సమాచారం నేరుగా విండ్‌షీల్డ్‌పై (డ్రైవర్‌ ఎదుట కారు అద్దంపై) కనిపిస్తుంది. దీంతో, సమాచారం కోసం డ్యాష్‌బోర్డ్‌ వైపు మళ్లీ మళ్లీ తల తప్పి చూడాల్సిన అవసరం ఉండదు. కళ్లపై ఒత్తిడి తగ్గి, ఫటిగ్‌ కూడా తగ్గుతుంది. అంతేకాదు, తల పక్కకు తిప్పడం వల్ల జరిగే ప్రమాదాలు కూడా తగ్గుతాయి.

7. ఎర్గోనామిక్‌ సీట్లు & లంబార్‌ సపోర్ట్‌ (Ergonomically designed seats with lumbar support)

బాగా డిజైన్‌ చేసిన సీట్లు సరైన పోస్చర్‌ను మెయింటైన్‌ చేయడంలో సహాయపడతాయి. అడ్జస్టబుల్‌ లంబార్‌ సపోర్ట్‌, బాడీకి సపోర్ట్‌ ఇచ్చే షేప్‌ వల్ల కండరాల అలసట తగ్గుతుంది. దీర్ఘకాల డ్రైవ్‌లలో ఇది చాలా కీలకం.

డ్రైవర్‌ ఫటిగ్‌ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు. నెమ్మదిగా పెరుగుతుంది. ఈ సమస్యను తగ్గించడానికే ఆధునిక కార్ టెక్నాలజీలు పనిచేస్తున్నాయి. డ్రైవర్‌కు తెలియకుండానే పెద్ద సపోర్ట్‌ ఇస్తూ, డ్రైవింగ్‌ను సేఫ్‌గా, కంఫర్ట్‌గా మార్చడమే వీటి లక్ష్యం. టెక్నాలజీ ఎంత నిశ్శబ్దంగా పనిచేస్తే, డ్రైవ్‌ అంత రిలాక్స్‌గా సాగుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget