అన్వేషించండి

సిటీ ట్రాఫిక్‌లో టెన్షన్‌ తగ్గాలంటే ముందు ఇవి తెలుసుకోండి: ఆటోమేటిక్‌, AMT కార్లపై పూర్తి గైడ్‌

సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ సులభం కావాలంటే ఆటోమేటిక్‌, AMT కార్లు ఎందుకు బెస్ట్‌ ఆప్షన్‌? క్లచ్‌ లెస్‌ డ్రైవింగ్‌ నుంచి మైలేజ్‌ వరకు 10 కీలక విషయాలు తెలుసుకోండి.

Automatic car tips 2026: ఒకప్పుడు ఆటోమేటిక్‌ కార్లు అంటే లగ్జరీ సెగ్మెంట్‌కే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌, సిటీ రోడ్లపై స్టాప్‌-గో డ్రైవింగ్‌ కారణంగా ఆటోమేటిక్‌, AMT (Automated Manual Transmission) కార్లు సామాన్య కొనుగోలుదారులకూ ఫస్ట్‌ ఆప్షన్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా తొలిసారి కారు కొనేవాళ్లు, రోజూ ఆఫీస్‌కి వెళ్లేవాళ్లు, ట్రాఫిక్‌లో ఎక్కువగా డ్రైవ్‌ చేసేవాళ్లకు ఇవి నిజంగా ఉపశమనం కలిగిస్తున్నాయి.

1. క్లచ్‌ హడావుడికి పూర్తిగా గుడ్‌బై

AMT కార్లలో క్లచ్‌ పెడల్‌ ఉండదు. AMTని సెమీ ఆటోమేటిక్‌ అని కూడా పిలవొచ్చు. పూర్తి మాన్యువల్‌ కార్లలో ప్రతి కొన్ని సెకన్లకోసారి క్లచ్‌ నొక్కాల్సి రావడం ట్రాఫిక్‌లో చాలా అలసట కలిగిస్తుంది. AMTలో గేర్‌ మార్పులు పూర్తిగా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. డ్రైవర్‌ స్టీరింగ్‌, బ్రేక్‌లపై మాత్రమే దృష్టి పెట్టొచ్చు.

2. కొత్త డ్రైవర్లకు బెస్ట్‌ ఆప్షన్‌

డ్రైవింగ్‌ కొత్తగా నేర్చుకునే వాళ్లకు గేర్‌, క్లచ్‌ భయం ఉంటుంది. AMT కార్లు ఆ భయాన్ని పూర్తిగా తొలగిస్తాయి. గేర్‌ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా సిటీ డ్రైవింగ్‌ చాలా సులభంగా మారుతుంది.

3. తక్కువ ఖర్చుతో ఆటోమేటిక్‌ అనుభవం

ఫుల్‌ ఆటోమేటిక్‌ కార్లతో పోలిస్తే AMT కార్ల ధర తక్కువగా ఉంటుంది. మాన్యువల్‌ గేర్‌బాక్స్‌కే ఆటోమేషన్‌ జోడించడంతో ఖర్చు తగ్గుతుంది. అందుకే బడ్జెట్‌ హ్యాచ్‌బ్యాక్‌లలో AMT విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.

4. మెయింటెనెన్స్‌ కూడా ఈజీ

AMTల్లో క్లిష్టమైన టార్క్‌ కన్వర్టర్లు లేదా CVT భాగాలు ఉండవు. అందుకే మెయింటెనెన్స్‌ ఖర్చు కూడా తక్కువే. మొదటి కారు కొనేవాళ్లకు ఇది పెద్ద ప్లస్‌ పాయింట్‌.

5. మైలేజ్‌ విషయంలో లాభం

సాంప్రదాయ ఆటోమేటిక్‌ కార్లతో పోలిస్తే AMT కార్లు మంచి ఇంధన సామర్థ్యం ఇస్తాయి. మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఆధారంగా ఉండటంతో సిటీ, లాంగ్‌ డ్రైవ్‌లలో మైలేజ్‌ తగ్గకుండా ఉంటుంది.

6. కొన్ని పరిమితులు కూడా ఉంటాయి

అన్ని AMT కార్లలో పార్కింగ్‌ మోడ్‌, హిల్‌ హోల్డ్‌, హిల్‌ డీసెంట్‌ వంటి ఫీచర్లు ఉండకపోవచ్చు. కొండ ప్రాంతాల్లో పార్క్‌ చేసే సమయంలో హ్యాండ్‌ బ్రేక్‌ తప్పనిసరిగా వాడాలి. ఇవి ముందే తెలుసుకుని డ్రైవ్‌ చేయాలి.

7. మాన్యువల్‌ మోడ్‌తో అదనపు కంట్రోల్‌

చాలా AMT కార్లలో మాన్యువల్‌ మోడ్‌ ఉంటుంది. అవసరమైనప్పుడు డ్రైవర్‌ స్వయంగా గేర్‌ మార్చుకోవచ్చు. ఓవర్‌టేక్‌, ఎత్తైన రోడ్లపై ఇది బాగా ఉపయోగపడుతుంది & డ్రైవింగ్‌ ఫన్‌ కూడా మిస్‌ కాదు.

8. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి

ఇప్పటి AMT కార్లలో హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, స్మూత్‌ గేర్‌ షిఫ్ట్‌ టెక్నాలజీలు వస్తున్నాయి. టాటా నెక్సాన్‌, రెనాల్ట్‌ డస్టర్‌ వంటి కార్లు దీనికి ఉదాహరణ.

9. ట్రాఫిక్‌లో ‘క్రీప్‌’ ఫీచర్‌ ఉపయోగం

క్రీప్‌ ఫీచర్‌ వల్ల యాక్సిలేటర్‌ నొక్కకుండానే కారు నెమ్మదిగా ముందుకు కదులుతుంది. స్టాప్‌-గో ట్రాఫిక్‌లో ఇది నిజంగా డ్రైవర్‌కు రిలీఫ్‌ ఇస్తుంది.

10. ఓవర్‌టేక్‌లలో ప్లానింగ్‌ అవసరం

AMT కార్లలో గేర్‌ షిఫ్ట్‌ కొంచెం ఆలస్యంగా ఉండొచ్చు. అందుకే ఓవర్‌టేక్‌ చేసే ముందు కచ్చితంగా ప్లాన్‌ చేయాలి. భద్రతకు ఇది చాలా ముఖ్యం.

చివరిగా... సిటీ ట్రాఫిక్‌లో సౌకర్యం, తక్కువ అలసట, మంచి మైలేజ్‌ కావాలంటే ఆటోమేటిక్‌, AMT కార్లు నిజంగా స్మార్ట్‌ ఎంపిక. వాటి బలాలు, పరిమితులు ముందే తెలుసుకుంటే డ్రైవింగ్‌ మరింత సేఫ్‌గా, హ్యాపీగా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget