అన్వేషించండి

BE 6 అగ్నిప్రమాదంపై Mahindra అధికారిక ప్రకటన: కంపెనీ రియాక్షన్‌ ఎలా ఉందంటే?

ఉత్తరప్రదేశ్‌లో మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్‌ కారులో మంటలు చెలరేగాయి. టైరు కారణంగానే మంటలు చెలరేగాయని మహీంద్రా స్పష్టం చేసింది. బ్యాటరీ సురక్షితమని తెలిపింది.

Mahindra BE 6 Fire Incident: ఉత్తరప్రదేశ్‌లోని గులావోతి ప్రాంతం సమీపంలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం ఆటోమొబైల్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్‌ SUV ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో, ఎలక్ట్రిక్‌ కార్ల భద్రతపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే, ఈ ఘటనపై మహీంద్రా సంస్థ వెంటనే స్పందించింది.

కంపెనీ అధికారిక ప్రకటన ఇదే...

కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఈ అగ్నిప్రమాదంలో ఉన్న వాహనంలో ప్రయాణించిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాలేదని మహీంద్రా స్పష్టం చేసింది. అదే సమయంలో, ఈ మంటలకు కారణం ఎలక్ట్రిక్‌ బ్యాటరీ కాదని కూడా స్పష్టంగా వెల్లడించింది.

మహీంద్రా తెలిపిన వివరాల ప్రకారం, BE 6 కారులో వెనుక కుడి వైపు ఉన్న టైరు పూర్తిగా డిఫ్లేట్‌ అయింది. ఆ స్థితిలోనే కారు సుమారు 10 నిమిషాల పాటు నడిచింది. ఈ సమయంలో కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని కంపెనీ విచారణలో తేలింది. టైరు డిఫ్లేట్‌ అయిందన్న హెచ్చరికలు డ్రైవర్‌కు పలుమార్లు వచ్చాయని మహీంద్రా పేర్కొంది. అంతేకాదు, టైరు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందన్న అలర్ట్స్‌ కూడా కనిపించాయని తెలిపింది.

డిఫ్లేట్‌ అయిన టైరు కారణంగా రోడ్డుతో ఏర్పడిన అధిక ఘర్షణ వల్ల తీవ్ర వేడి ఉత్పన్నమైంది. అదే మంటలకు ప్రధాన కారణమని మహీంద్రా వివరించింది. ఈ సమయంలో వాహనంలో ఉన్న ఎలక్ట్రానిక్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ పూర్తిగా పనిచేశాయని కంపెనీ పేర్కొంది. స్టెబిలిటీ కంట్రోల్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి వ్యవస్థలు పలుమార్లు యాక్టివ్‌ అయ్యి, వీల్‌ స్పిన్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించాయి.

భద్రతా చర్యల్లో భాగంగా, వాహనం వేగాన్ని ఎలక్ట్రానిక్‌గా తగ్గించారు. ఆ తర్వాత డ్రైవ్‌ సిస్టమ్‌ను పూర్తిగా షట్‌డౌన్‌ చేసి, కారును ఆపేశారని మహీంద్రా వెల్లడించింది. వీడియో ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత కూడా, ఆ మంటలు టైరు నుంచే మొదలయ్యాయని నిర్ధారణకు వచ్చామని కంపెనీ తెలిపింది.

హై-వోల్టేజ్‌ బ్యాటరీ పూర్తిగా సురక్షితం

ఈ ఘటనలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే - ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో ఎక్కువ మంది భయపడే హై-వోల్టేజ్‌ బ్యాటరీ పూర్తిగా సురక్షితంగా ఉందని మహీంద్రా స్పష్టం చేసింది. తీవ్రమైన బాహ్య ఉష్ణోగ్రత ప్రభావం ఉన్నప్పటికీ, బ్యాటరీ ప్యాక్‌కు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. బ్యాటరీ హెల్త్‌ పారామీటర్లు, సెల్‌ వోల్టేజీలు అన్నీ నిర్దేశిత పరిమితుల్లోనే ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్‌ మోటర్‌ కూడా పూర్తిగా సురక్షితంగానే ఉందని తెలిపింది.

హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దు

ఈ ఘటన తర్వాత కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల భద్రతపై స్పష్టత తీసుకురావడం కోసం పూర్తిస్థాయి పరిశీలన చేస్తున్నామని మహీంద్రా తెలిపింది. డ్రైవింగ్‌ సమయంలో వచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదన్న సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని ఆటో నిపుణులు చెబుతున్నారు.

భారత మార్కెట్‌లో మహీంద్రా BE 6 మిడ్‌సైజ్‌ ఎలక్ట్రిక్‌ SUVగా అందుబాటులో ఉంది. ఈ మోడల్‌కు 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లు ఉన్నాయి. BE 6 ధరలు రూ. 19.65 లక్షల నుంచి రూ. 27.65 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Car Polish vs Wax: కారు మెరుపు కోసం పాలిష్ మాత్రమే సరిపోదు! పెయింట్ రక్షణకు వ్యాక్స్ కూడా అవసరమే!
కారు పాలిష్ చేయాలా.. వ్యాక్స్ వేయాలా? తేడా ఇదే.. ముందుగా ఏది చేయాలో తెలుసుకోండి

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget