అన్వేషించండి

లాంబోర్గినీ, రోల్స్‌ రాయిస్‌ నుంచి పోర్షే వరకు - ప్రపంచంలోని లగ్జరీ కార్లన్నీ దక్షిణాది సినీ స్టార్ల గ్యారేజీల్లోనే ఉన్నాయ్‌గా!

రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, సమంత, నయనతార, యష్‌ వంటి దక్షిణాది స్టార్‌లు ఏ లగ్జరీ కార్లు వాడుతున్నారు? వారి వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే ఖరీదైన కార్ల పూర్తి వివరాలు.

Tollywood Celebrities Luxury Cars: సినిమా స్క్రీన్‌పై హీరోలు చేసే పాత్రలు ఎంత స్టైలిష్‌గా ఉంటాయో, స్క్రీన్‌ బయట వారు డ్రైవ్‌ చేసే కార్లు కూడా అంతే స్టైలిష్‌గా ఉంటాయి. దక్షిణాది సినీ పరిశ్రమలోని టాప్‌ స్టార్‌ల గ్యారేజీల్లో ఉన్న లగ్జరీ కార్లు చూస్తే, ఒక్కో కార్‌ వెనుక ఒక్కో వ్యక్తిత్వం కనిపిస్తుంది. వేగాన్ని ఇష్టపడే హీరోలు సూపర్‌ కార్లను ఎంచుకుంటే, కంఫర్ట్‌కి ప్రాధాన్యం ఇచ్చే వాళ్లు అల్ట్రా లగ్జరీ SUVలను ఎంచుకుంటున్నారు.

స్పోర్ట్స్‌ కార్లతో రేస్‌ మూడ్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ - లాంబోర్గినీ ఉరస్‌ గ్రాఫైట్‌ క్యాప్సూల్‌
ఎనర్జీ, పవర్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌... ఇవన్నీ కలిసిన వ్యక్తిత్వం జూనియర్‌ ఎన్టీఆర్‌ది. అదే స్టైల్‌ను ప్రతిబింబించేలా ఆయన ఎంచుకున్న లాంబోర్గినీ ఉరస్‌ గ్రాఫైట్‌ క్యాప్సూల్‌తో... భారతదేశంలో ఈ కారును తొలిసారిగా తీసుకున్న సెలబ్రిటీగా ఆయన నిలిచారు. అగ్రెసివ్‌ డిజైన్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, స్పోర్టీ డ్రైవింగ్‌ ఫీల్‌ ఈ కార్‌ ప్రత్యేకతలు.

నాగ చైతన్య - ఫెరారీ 488 GTB
నాగ చైతన్య వ్యక్తిత్వంలానే ఆయన ఫెరారీ కూడా సైలెంట్‌గా ఆకట్టుకుంటుంది. ఎక్కువ హంగామా లేకుండా క్లాస్‌ను చూపించే ఈ సూపర్‌ కార్‌, పెర్ఫార్మెన్స్‌తో పాటు ఎలిగెన్స్‌కు ప్రతీకగా నిలుస్తుంది.

సమంత రూత్‌ ప్రభు - పోర్షే కేమన్‌ GTS
సమంతకు నచ్చే పాత్రలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో, ఆమె డ్రైవ్‌ చేసే పోర్షే కేమన్‌ GTS కూడా అంతే పవర్‌ఫుల్‌. సెవెన్‌ స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ గేర్‌బాక్స్‌, స్పోర్టీ హ్యాండ్లింగ్‌ ఈ కార్‌ను నిజమైన డ్రైవర్‌ కార్‌గా నిలబెడతాయి.

లగ్జరీ కార్లలో రాజసం

రామ్‌ చరణ్‌ -  రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌
రామ్‌ చరణ్‌ గ్యారేజ్‌ అంటే లగ్జరీకి మరో పేరు. ఫెరారీ పోర్టోఫినో, ఆస్టన్‌ మార్టిన్‌, మెర్సిడెస్‌ మేబాక్‌ GLS 600 వంటి కార్లు ఉన్నప్పటికీ, అసలు ఆకర్షణ రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్‌. పూర్తిగా ఎలక్ట్రిక్‌గా వచ్చిన ఈ కూపే సుమారు ₹7.5 కోట్ల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) విలువతో, రాయల్‌ లుక్‌, ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీని కలిపిన కార్‌గా నిలుస్తుంది.

అట్లీ - BMW i7
సినిమాల్లో మాస్‌ ఎలిమెంట్స్‌ చూపించే అట్లీ, నిజ జీవితంలో మాత్రం సొఫిస్టికేటెడ్‌ లగ్జరీని ఎంచుకున్నాడు. BMW i7లో ఉన్న 31.3 అంగుళాల 8K థియేటర్‌ స్క్రీన్‌ ఈ కార్‌ను ఒక మూవింగ్‌ సినిమా హాల్‌లా మార్చేస్తుంది.

నయనతార - మెర్సిడెస్‌ బెంజ్‌ మేబాక్‌ GLS
లేడీ సూపర్‌స్టార్‌కి తగ్గ కార్‌ ఇదే. భర్త విఘ్నేశ్‌ శివన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన మేబాక్‌ GLS, అల్ట్రా లగ్జరీ SUVగా నయనతార స్టైల్‌ను పర్ఫెక్ట్‌గా చూపిస్తుంది.

మోహన్‌లాల్‌ - టయోటా వెల్‌ఫైర్‌
హంగామా కన్నా కంఫర్ట్‌ ముఖ్యం అనుకునే మోహన్‌లాల్‌, వెల్‌ఫైర్‌ను ఎంచుకున్నారు. రిక్లైనింగ్‌ సీట్లు, మసాజ్‌ ఫంక్షన్‌, నిశ్శబ్దమైన డ్రైవ్‌ ఈ కార్‌ ప్రత్యేకతలు.

యష్‌ - రేంజ్‌ రోవర్‌ ఇవోక్‌
రఫ్‌ అండ్‌ టఫ్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా యష్‌ ఎంచుకున్నది రేంజ్‌ రోవర్‌ ఇవోక్‌. SUV తరహాలో ఉండే లుక్‌, ఆఫ్‌రోడ్‌ సామర్థ్యం, కాంపాక్ట్‌ సైజ్‌లో లగ్జరీ ఫీల్‌ ఈ కార్‌ ప్లస్‌ పాయింట్స్‌.

మొత్తానికి, దక్షిణాది స్టార్‌లు డ్రైవ్‌ చేసే కార్లు కేవలం వాహనాలు కాదు... వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే నాలుగు చక్రాల ప్రతిరూపాలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Ampere Magnus Grand vs Honda Activa eయాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ vs హోండా యాక్టివా ఇ! ఏది కొంటే మీకు లాభం?
యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ vs హోండా యాక్టివా ఇ! ఏది కొంటే మీకు లాభం?
Mahindra Thar On Road Price Hyderabad: హైదరాబాద్‌లో మహీంద్రా థార్ ఆన్‌రోడ్‌ ధర ఎంత? నెల వారీ EMI వివరాలు ఏంటీ?  
హైదరాబాద్‌లో మహీంద్రా థార్ ఆన్‌రోడ్‌ ధర ఎంత? నెల వారీ EMI వివరాలు ఏంటీ?  
టయోటా టైసర్ ప్లస్‌లు & మైనస్‌లు ఇవే - కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
టయోటా టైసర్‌ కొనాలా? తొందరపడొద్దు, ముందు ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకోండి
అథర్ రిజ్టా & చేతక్‌కు కొత్త పోటీ - సెప్టెంబర్ 2న రాబోతున్న సింపుల్ అరైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఫ్యామిలీమ్యాన్‌ కోసం సింపుల్ ఎనర్జీ కొత్త ఇ-స్కూటర్ - రిజ్టాకు పోటీ, రేటు ఎంత ఉండొచ్చంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget