అన్వేషించండి

డిజైన్‌ నుంచి ఇంజిన్‌ వరకూ మార్పులే మార్పులు: రెనాల్ట్‌ డస్టర్‌ ఇండియా స్పెక్‌ - గ్లోబల్‌ స్పెక్‌ మధ్య తేడాలు

2026 Renault Duster భారత్‌లోకి కొత్త అవతార్‌లో వస్తోంది. గ్లోబల్‌ మోడల్‌తో పోలిస్తే డిజైన్‌, ఇంటీరియర్‌, ఫీచర్లు, ఇంజిన్‌ పరంగా ఇండియా స్పెక్‌ కారులో ఏం మారిందో పూర్తిగా తెలుసుకోండి.

New Renault Duster 2026 India: భారత్‌లో ఒకప్పుడు SUV సెగ్మెంట్‌కు కొత్త ఊపునిచ్చిన పేరు Renault Duster. మొదటి తరం డస్టర్‌ ఉత్పత్తి నిలిచిపోయిన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు రెనాల్ట్‌ అదే నేమ్‌ప్లేట్‌ను మళ్లీ భారత్‌కు తీసుకొచ్చింది. ఈసారి ఇది పూర్తిగా కొత్తగా రూపొందించిన మూడో తరం (Third-Generation) Renault Duster. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గ్లోబల్‌ మార్కెట్లలో వచ్చిన రెండో తరం డస్టర్‌ను భారత్‌కు తీసుకురాకుండా స్కిప్‌ చేసి, నేరుగా ఈ తాజా మోడల్‌ను (మూడో తరం) ఇండియన్‌ మార్కెట్‌ కోసం సిద్ధం చేసింది. అంతేకాదు, ఈ మోడల్‌లో భారతీయుల అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసింది.

బయట డిజైన్‌లో ఏం మారింది?

ఇండియా స్పెక్‌ 2026 Renault Duster బయటకు చూస్తే గ్లోబల్‌ మోడల్‌కు దగ్గరగా ఉన్నా, కొన్ని కీలక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు భాగంలోని గ్రిల్‌పై పెద్ద తేడా ఉంది. దక్షిణాఫ్రికా, మౌరిషస్‌ లాంటి మార్కెట్లలో గ్రిల్‌పై ‘Renault’ బ్రాండింగ్‌ కనిపిస్తే, భారత్‌లో మాత్రం అదే చోట ‘Duster’ అనే పేరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియన్‌ మార్కెట్‌లో బ్రాండ్‌ కంటే డస్టర్‌ పేరు ఎక్కువగా గుర్తింపు ఉండటమే దీనికి కారణం.

హెడ్‌ల్యాంప్స్‌ ఆకృతి ఒకేలా ఉన్నా, లోపలి LED సెటప్‌ మాత్రం మారింది. గ్లోబల్‌ మోడల్‌లో కనిపించే Y-షేప్‌ DRLs‌ను తీసేసి, భారత్‌లో ఐబ్రో స్టైల్‌ స్లిమ్‌ LED DRLs ఇచ్చారు. ఫ్రంట్‌ బంపర్‌ డిజైన్‌లో కూడా మార్పులు చేశారు. ఫాగ్‌ ల్యాంప్స్‌ను కార్నర్లకు షిఫ్ట్‌ చేసి, పైభాగంలో మూడు ఎయిర్‌ ఇంటేక్స్‌ జోడించారు.

లాంచ్‌ ఎడిషన్‌లో ఫ్రంట్‌ ఫెండర్‌పై హిమాలయన్‌ ఇన్‌స్పైర్డ్‌ బ్యాడ్జ్‌లు, డోర్స్‌ కింద ఎల్లో కలర్‌ ‘Iconic’ స్ట్రిప్‌, రూఫ్‌ రైల్స్‌పై ఎల్లో కలర్‌ ‘Duster’ బ్రాండింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 18 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ సైజ్‌ ఒకేలా ఉన్నా, ఇండియా స్పెక్‌లో బ్లాక్‌ ఫినిష్‌ ఇచ్చారు.

వెనుక భాగంలో కనెక్టెడ్‌ LED లైట్‌ స్ట్రిప్‌, షార్క్‌ఫిన్‌ యాంటెనా, కొత్త డ్యూయల్‌ టోన్‌ బంపర్‌ డిజైన్‌ డస్టర్‌కు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి.

ఇంటీరియర్‌లో ప్రీమియం టచ్‌

ఇండియా స్పెక్‌ Renault Duster లోపల కూర్చుంటే గ్లోబల్‌ మోడల్‌ కంటే మరింత ప్రీమియంగా అనిపిస్తుంది. గ్రే కలర్‌ థీమ్‌కు బదులుగా ఎల్లో కాంట్రాస్ట్‌ స్టిచింగ్‌, డాష్‌బోర్డ్‌పై ఎల్లో ‘Duster’ బ్రాండింగ్‌, ఫాక్స్‌ కార్బన్‌ ఫైబర్‌ ఇన్‌సర్ట్స్‌, సాటిన్‌ సిల్వర్‌ ట్రిమ్‌ వంటివి ఉన్నాయి. టూ-టోన్‌ లెదరెట్‌ సీట్లు కూడా ఆకట్టుకుంటాయి.

డ్రైవర్‌ వైపు స్వల్పంగా వంగిన డాష్‌బోర్డ్‌, సెంటర్‌ కాన్సోల్‌ స్పోర్టీ ఫీల్‌ ఇస్తాయి. రెండు డిజిటల్‌ స్క్రీన్‌లను ఒకే ప్యానెల్‌లా డిజైన్‌ చేయడం వల్ల కేబిన్‌ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.

ఫీచర్లు & భద్రత

2026 Renault Dusterలో పానోరమిక్‌ సన్‌రూఫ్‌, పవర్డ్‌ & వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, PM2.5 ఫిల్టర్‌, 48 కలర్‌ అంబియంట్‌ లైటింగ్‌, My Renault కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ లభిస్తాయి. 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్‌, వైర్‌లెస్‌ Apple CarPlay, Android Auto, గూగుల్‌ యాప్స్‌ సపోర్ట్‌ కూడా ఉన్నాయి.

భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, సరౌండ్‌ వ్యూ కెమెరాలు, ESC, ISOFIXతో పాటు 17 వరకు ADAS ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ఇంజిన్‌ ఎంపికల్లో తేడా

భారత్‌కు AWD వెర్షన్‌ రాకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం. అయినా, ఇండియా స్పెక్‌ Dusterలో 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌, శక్తిమంతమైన 1.3 టర్బో పెట్రోల్‌, అలాగే 1.8 లీటర్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటాయి. ఈ హైబ్రిడ్‌ సెటప్‌ గ్లోబల్‌ మోడల్‌తో పోలిస్తే ఎక్కువ పవర్‌ను ఇస్తుంది.

మొత్తానికి, ఇండియన్‌ కొనుగోలుదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కొత్త Renault Duster, గ్లోబల్‌ మోడల్‌తో పోలిస్తే డిజైన్‌, కంఫర్ట్‌, ఫీచర్లలో స్పష్టమైన ఆధిక్యత చూపిస్తోంది. SUV సెగ్మెంట్‌లో ఇది మళ్లీ డస్టర్‌ పేరు మెరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!
Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget