అన్వేషించండి

Hero Xtreme 125R vs Honda SP125: హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R vs హోండా ఎస్పీ 125; మైలేజీ, ధర, ఫీచర్స్‌ పరంగా సూపర్ బైక్ ఏదీ?

Hero Xtreme 125R vs Honda SP125: హోండా ఎస్పీ 125 ఎక్స్‌- షో రూమ్ ధర సుమారు 88, 750 నుంచి ప్రారంభమవుతుంది. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R ధర కొంత ఎక్కువగా 90, 672 నుంచి స్టార్ట్ అవుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, హోండా SP125 ధరలు, రంగులు, వేరియంట్లు ఇక్కడ ఉన్నాయి.
  • ఎక్స్‌ట్రీమ్ 125R ఇంజిన్ శక్తి, పనితీరు SP125 కంటే మెరుగ్గా ఉంది.
  • మైలేజీ విషయంలో హోండా SP125 స్పష్టమైన విజేతగా నిలుస్తోంది.
  • ఎక్స్‌ట్రీమ్ 125R స్పోర్టీ లుక్, SP125 తేలికపాటి నిర్మాణం కలిగినవి.

Hero Xtreme 125R vs Honda SP125: భారత్‌ ద్విచక్ర వాహన మార్కెట్‌లో 125సీసీ సెగ్మెంట్‌ ప్రస్తుతం అత్యంత వేగంగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు కేవలం మైలేజీకే పరిమితమైన ఈ సెగ్మెంట్‌, ఇప్పుడు స్టైల్‌, పెర్ఫార్మెన్స్‌, అత్యాధునిక ఫీచర్ల కలయికగా మారింది. ఈ విభాగంలో గట్టి పోటీని ఇస్తుంది. రెండు ముఖ్యమైన బైక్‌లు హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R, హోండా ఎస్పీ 125. ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు సరిపోతుంది? ధర, మైలేజీ, ఫీచర్లు, ఇంజిన్‌ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా మరింత విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం. 

ధర, వేరియంట్లు

ఎలాంటి వాహనం కొనాలని అనుకున్నా ముందు చూసేది ధర. హోండా ఎస్పీ 125 ఎక్స్‌- షో రూమ్ ధర సుమారు 88, 750 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి విరుద్ధంగా హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R ధర కొంత ఎక్కువగా 90, 672గా నిర్ణయించారు. హోండా ఎస్పీ 125 ఐదు విభిన్న రంగులతో లభిస్తుండగా, హీరో ఎక్స్‌ట్రీమ్‌ మూడు ఆకర్షణీయమైన రుంగులలో అందుబాటులో ఉంది. ధర పరంగా చూస్తే హోండా ఎస్పీ125 కొంత చౌకగా కనిపిస్తోంది. 

ఇంజిన్ సామర్థ్యం, పనితీరు

పర్ఫార్మెన్స్‌ విషయానికి వస్తే హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో 124.7cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్ ఉంది. ఇది 11.4 bhp శక్తిని, 10.5Nm టార్క్‌ను  ఉత్పత్తి చేస్తుంది. హోండా ఎస్పీ125లో 123. 94cc ఇంజిన్‌ ఉండగా, ఇది 10.72bhp శక్తిని, 10.9Nm టార్క్‌ను అందిస్తుంది. 

రెండు బైక్‌లు కూడా 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉన్నాయి. గరిష్ట వేగం పరంగా చూస్తే, రెండు బైక్‌లు గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలు. అయితే వేగవంతమైన పికప్‌ కోరుకునే వారికి హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R మెరుగైన ఎంపికగా ఉంటుంది. 

మైలేజీ, ఇంధన పొదుపులో ఎవరు ముందున్నారు?

125cc బైక్‌  కొనేవారు ప్రధానంగా సూచేది మైలేజీ. ఈ విషయంలో హోండా ఎస్పీ 125 స్పష్టమైన విజేతగా నిలుస్తుంది. వినియోగదారుల నివేదిక ప్రకారం హోండా ఎస్పీ 125 లీటర్‌కు 62కిలోమటర్ల మైలేజీ ఇస్తుండగా, హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R లీట్‌కు57 కిలోమీటర్లు మైలేజీ మాత్రమే అందిస్తుంది. మీరు ప్రతి రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారైతే, హోండా ఎస్పీ 125 మీకు భారీగా ఇంధన ఖర్చులను ఆదా చేస్తుంది. 

డిజైన్, డైమెన్షస్‌    

డిజైన్‌ పరంగా రెండు బైక్‌లు విభిన్నమైన వ్యక్తిత్వాలను కలిగి ఉన్నాయి. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R యువతను ఆకర్షించేలా స్పోర్టీ, అగ్రెసివ్‌ లుక్‌తో వస్తుంది. దీని బరువు 136 కేజీలు, ఇది హోండా కంటే కాస్త బరువుగా ఉంటుంది. హోండా ఎస్పీ 125 కేవలం 116 కేజీల బరువుతో చాలా తేలికా ఉంటుంది. దీని వల్ల సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించడం సులభతరం అవుతుంది. 

గ్రౌండ్‌ క్లియరెన్స్‌ విషయంలో హీరో ఎక్స్‌ట్రీమ్‌, హోండా కంటే మెరుగ్గా ఉంది. ఇది ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. సీటు ఎత్తులో స్వల్ప తేడాలు ఉన్నాయి. 

ఫీచర్లు, భద్రత విషయంలో ఎవరి సత్తా ఏంటీ?

సాంకేతికతపరంగా హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125Rలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌సీడీ డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. హోండా ఎస్పీ 125లో ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌, డిజిటల్ కన్సోల్‌, సైలెంట్‌ స్టార్ట్ వంటి ఫీచర్ల ఉన్నాయి. భద్రత విషయంలో హీరో ఎక్స్‌ట్రీమ్‌ ఐీఎస్‌, 240 మి.మి. ఫ్రంట్ డిస్క్‌ బ్రేక్‌తో వస్తుంది. హోండా ఎస్పీ 125లో సీబీఎస్‌ అందుబాటులో ఉంది. టైర్ల విషయంలో హీరో ఎక్స్‌ట్రీమ్‌ వెనుక వైపు 120/80-17 వెడల్పాటి టైర్‌ను కలిగి ఉండటం వల్ల రోడ్డుపై మెరుగైన పట్టును ఇస్తుంది. 

వారంటీ- సర్వీస్‌

కస్టమర్‌ నమ్మకాన్ని పెంచడంలో హీరో మోటోకార్ప్‌ ముందుంది. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R ఐదేళ్లలు లేదా 70వేల కిలోమీటర్లు వారంటీ లభిస్తుంది. దీనికి అదనంగా ఐదు ఉచిత సర్వీస్‌లు కూడా ఉన్నాయి. హోండా ఎస్పీ 125పై మూడేళ్ల లేదా 42వేల కిలోమీర్ల వారంటీ మాత్రమే లభిస్తుంది. మూడు ఉచిత సర్వీస్‌లు అందుబాటులో ఉన్నాయి. 

మీకు స్పోర్టీ లుక్‌, ఎక్కువ పవర్‌, మెరుగైన వారంటీ , స్టైలిష్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్ట్‌ లైట్లు కావాలనుకుంటే హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R  కొనుగోలు చేయవచ్చు. మీకు అత్యుత్తమ మైలేజీ, తక్కువ ధర, తేలికపాటి, స్మూత్ ఇంజిన్ కోసం చూస్తుంటే మీరు కచ్చితంగా హోండా ఎస్పీ 125ను ఎంచుకోవచ్చు. 

Frequently Asked Questions

హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మరియు హోండా SP125 లలో ధర పరంగా ఏది చౌకగా ఉంటుంది?

ధర పరంగా చూస్తే, హోండా SP125 సుమారు ₹88,750 నుండి ప్రారంభమవుతుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R ధర ₹90,672. కాబట్టి, హోండా SP125 కొంత చౌకగా లభిస్తుంది.

ఇంజిన్ పనితీరు విషయంలో ఏ బైక్ మెరుగ్గా ఉంది?

పనితీరు విషయంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 125R ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీని ఇంజిన్ 11.4 bhp శక్తిని, 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా SP125 ఇంజిన్ 10.72bhp శక్తిని, 10.9Nm టార్క్‌ను అందిస్తుంది.

మైలేజీ విషయంలో ఏ బైక్ మెరుగైనది?

మైలేజీలో హోండా SP125 స్పష్టమైన విజేత. ఇది లీటరుకు 62 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R లీటరుకు 57 కిలోమీటర్లు మైలేజీ అందిస్తుంది.

డిజైన్ మరియు బరువు పరంగా ఈ రెండు బైకుల మధ్య తేడా ఏమిటి?

హీరో ఎక్స్‌ట్రీమ్ 125R స్పోర్టీ లుక్‌తో 136 కేజీల బరువుతో వస్తుంది. హోండా SP125 116 కేజీల బరువుతో చాలా తేలికగా ఉంటుంది, ఇది ట్రాఫిక్‌లో సులభంగా నడపడానికి అనువుగా ఉంటుంది.

ఫీచర్లు మరియు భద్రత విషయంలో ఏ బైక్ మెరుగైనది?

హీరో ఎక్స్‌ట్రీమ్ 125R లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LCD డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ABS, 240mm డిస్క్ బ్రేక్, వెడల్పాటి వెనుక టైర్ ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌.. టయోటా, ఇసుజుకి స్ట్రాంగ్‌ కాంపిటీషన్‌!
Clean Cloudy Car Headlights: వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Safest Cars Of India: ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget