అన్వేషించండి

రూ.89,000 నుంచి రూ.1.05 లక్షల వరకు: హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R అన్ని వేరియంట్ల ఫీచర్లు, ధరలు

హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R బైక్‌ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. IBS నుంచి డ్యూయల్‌ ఛానల్‌ ABS వరకు ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హీరో Xtreme 125R నాలుగు వేరియంట్లలో, వివిధ ధరలలో లభ్యం.
  • బేస్ వేరియంట్ IBSతో, ABS లేకుండా రూ.89,000కు లభ్యం.
  • సింగిల్ ఛానల్ ABS వేరియంట్ రూ.92,500, డ్యూయల్ ఛానల్ ABS రూ.1.05 లక్షలు.
  • ఫీచర్లు, బడ్జెట్, భద్రత ఆధారంగా వేరియంట్ ఎంచుకోవచ్చు.

Hero Xtreme 125R Price: గతంలో, 125cc సెగ్మెంట్‌లో ఎక్కువగా కమ్యూటర్‌ బైక్‌లే కనిపించేవి. కానీ ఇప్పుడు స్టైలిష్‌గా, స్పోర్టీ లుక్‌తో యువతను ఆకట్టుకునే మోడళ్లు పెరుగుతున్నాయి. టీవీఎస్‌ రైడర్‌ మంచి సక్సెస్‌ సాధించిన తర్వాత, ఇప్పుడు Hero MotoCorp కూడా అదే రేంజ్‌లో ఎక్స్‌ట్రీమ్‌ 125Rను తీసుకొచ్చింది.

ఈ బైక్‌ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌-షోరూమ్‌ ధరలు

IBS వేరియంట్‌ - ఎంట్రీ లెవల్‌

బేస్‌ వేరియంట్‌ IBS (ఇంటిగ్రేటెడ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌)తో వస్తుంది. ఈ వేరియంట్‌లో ABS ఉండదు. ముందు, వెనుక బ్రేకులు కలిపి పని చేసే కాంబి బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది.

ఇంజిన్‌ మాత్రం అన్ని వేరియంట్లలో ఒకటే. 124.7cc ఎయిర్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ 11.4hp పవర్‌, 10.5Nm టార్క్‌ ఇస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

రెడ్‌, బ్లూ, బ్లాక్‌ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ధర రూ.89,000 (ఎక్స్‌-షోరూమ్‌). ఈ లైనప్‌లో ఇదే అత్యంత చవకైన వేరియంట్‌.

సింగిల్‌ ఛానల్‌ ABS - స్ప్లిట్‌ సీట్‌ & సింగిల్‌ సీట్‌

ఈ రెండు వేరియంట్లు (స్ప్లిట్‌ సీట్‌ & సింగిల్‌ సీట్‌) దాదాపు ఒకేలా ఉంటాయి. ప్రధాన తేడా సీటింగ్‌ సెటప్‌లోనే ఉంటుంది. ఒకదాంట్లో స్ప్లిట్‌ సీట్‌, మరొకదాంట్లో సింగిల్‌ పీస్‌ సీట్‌ ఇస్తారు.

సేఫ్టీ పరంగా సింగిల్‌ ఛానల్‌ ABS ఇస్తారు. అంటే ముందు చక్రానికి ABS ఉంటుంది. ఇది బ్రేకింగ్‌ సమయంలో మరింత నియంత్రణ ఇస్తుంది.

బేస్‌ వేరియంట్‌లో ఉన్న మూడు రంగులతో పాటు అదనంగా ఆరెంజ్‌ కలర్‌ ఆప్షన్‌ కూడా ఇందులో ఉంటుంది. ధర రూ.92,500 (ఎక్స్‌-షోరూమ్‌). బేస్‌తో పోలిస్తే కేవలం రూ.3,500 మాత్రమే ఎక్కువ. సేఫ్టీ పరంగా ఇది మంచి విలువ ఇస్తుంది.

డ్యూయల్‌ ఛానల్‌ ABS - టాప్‌ వేరియంట్‌

లైనప్‌లో అత్యంత ఎక్కువ ఫీచర్లతో వచ్చే వేరియంట్‌ ఇదే. ముందు, వెనుక రెండు చక్రాలకు డ్యూయల్‌ ఛానల్‌ ABS ఇస్తారు.

ఇందులో మూడు రైడింగ్‌ మోడ్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, పెద్ద కలర్‌ LCD డిస్‌ప్లే కూడా ఉంటాయి. అదనపు ఫంక్షన్ల కోసం ప్రత్యేక స్విచ్‌గేర్‌ ఇస్తారు.

గ్రీన్‌, గ్రే, రెడ్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ధర రూ.1.05 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). సింగిల్‌ ఛానల్‌ ABS వేరియంట్‌తో పోలిస్తే రూ.12,000 ఎక్కువ.

ఏ వేరియంట్‌ తీసుకోవాలి?

రోజూ ఆఫీస్‌ వెళ్లే వారు, కాలేజీ విద్యార్థులు బడ్జెట్‌ పరంగా చూస్తే IBS వేరియంట్‌ సరిపోతుంది. కానీ సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తే సింగిల్‌ ఛానల్‌ ABS వేరియంట్‌ మంచి ఎంపిక. 

హైదరాబాద్‌, విజయవాడ లాంటి ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే నగరాల్లో బ్రేకింగ్‌ నియంత్రణ చాలా ముఖ్యం. అందుకే కనీసం సింగిల్‌ ఛానల్‌ ABS వేరియంట్‌ తీసుకోవడం మంచిది.

అయితే ఫీచర్లు ఎక్కువగా కావాలి, టెక్నాలజీ ఇష్టమైతే డ్యూయల్‌ ఛానల్‌ ABS వేరియంట్‌ మీకు సరైన ఎంపిక అవుతుంది. 125సీసీ సెగ్మెంట్‌లో ఇది కొంచెం ఖరీదైనదే అయినా, మీరు ఖర్చు పెట్టే డబ్బుకు ఇది అందించే ఫీచర్లు తగిన విలువ ఇస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

Hero Xtreme 125R బైక్ ఎన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది?

Hero Xtreme 125R బైక్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది: IBS, సింగిల్ ఛానల్ ABS (స్ప్లిట్ సీట్), సింగిల్ ఛానల్ ABS (సింగిల్ సీట్), మరియు డ్యూయల్ ఛానల్ ABS.

Hero Xtreme 125R ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఏమిటి?

ఈ బైక్ 124.7cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 11.4hp పవర్ మరియు 10.5Nm టార్క్‌ను అందిస్తుంది, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Hero Xtreme 125R లో ఏయే సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

IBS వేరియంట్‌లో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. సింగిల్ ఛానల్ ABS వేరియంట్‌లో ముందు చక్రానికి ABS ఉంటుంది, మరియు టాప్ డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్‌లో ముందు, వెనుక రెండు చక్రాలకు ABS ఉంటుంది.

Hero Xtreme 125R టాప్ వేరియంట్ ధర ఎంత మరియు అందులో అదనపు ఫీచర్లు ఏమిటి?

డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ ధర సుమారు రూ.1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో మూడు రైడింగ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్, మరియు పెద్ద కలర్ LCD డిస్ప్లే వంటి ఫీచర్లు ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget