అన్వేషించండి

Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

Hero Xoom 125 స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. VX, ZX మధ్య ఫీచర్లు, బ్రేకులు, బ్లూటూత్‌, ధరల్లో వ్యత్యాసం, తెలుగు రాష్ట్రాల్లో ఆన్ రోడ్ ధరలు తెలుసుకోండి.

Hero Xoom 125 Variants: Hero MotoCorp నుంచి స్పోర్టీ 125cc స్కూటర్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టిన మోడల్‌ Hero Xoom 125. ఈ స్కూటర్, TVS Motor Company తయారు చేసిన Ntorq 125కు నేరుగా పోటీగా మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం హీరో జూమ్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి - VX & ZX. ఇక్కడ, ఈ రెండు వేరియంట్లలో ఉన్న ఫీచర్లు, ధరలు, ముఖ్యమైన వ్యత్యాసాలను వివరంగా తెలుసుకుందాం.

ఇంజిన్‌, డిజైన్‌ - రెండింట్లో ఒకేలా

మొదటి ముఖ్యమైన విషయం - VX, ZX రెండింట్లోనూ ఇంజిన్‌ ఒకటే. డిజైన్‌, బాడీ స్టైల్‌, 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ వంటి ప్రధాన హార్డ్‌వేర్ రెండింట్లో సమానంగా ఉంటాయి. LED హెడ్‌ల్యాంప్స్‌, LED టెయిల్ ల్యాంప్ కూడా రెండింట్లోనూ ఉన్నాయి.

అంటే పనితీరులో తేడా లేదు. కానీ ఫీచర్లలో మాత్రం స్పష్టమైన భేదం కనిపిస్తుంది.

VX వేరియంట్ - ఎంట్రీ లెవల్ ఆప్షన్

VX వేరియంట్ అనేది ఈ లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోడల్‌. అయినప్పటికీ ఏ మాత్రం తక్కువ కాదు, బేసిక్ అవసరాలన్నీ ఇస్తుంది.

అయితే ఇందులో కొన్ని ప్రీమియం ఫీచర్లు లేవు:

ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లేదు

బ్లూటూత్ కనెక్టివిటీ లేదు

టర్న్ బై టర్న్ నావిగేషన్ లేదు

USB చార్జింగ్ పోర్ట్ లేదు

అదనపు స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ లేదు

ఇల్యూమినేటెడ్ స్టార్ట్ బటన్ లేదు

బూట్ ల్యాంప్ లేదు

ప్రత్యేకంగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లేకపోవడం కొంతమంది కొనుగోలుదారులకు మైనస్‌గా అనిపించవచ్చు.

ధర (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఎక్స్‌-షోరూమ్‌ ధర): ₹84,879

హైదరాబాద్ ఆన్ రోడ్ ధర వివరాలు:
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹84,879
RTO: ₹11,685
ఇన్సూరెన్స్: ₹6,226
మొత్తం ఆన్ రోడ్ ధర: ₹1,02,790 (సుమారు). ఇతర తెలుగు నగరాల్లోనూ స్వల్ప తేడాలతో ఇదే ధర ఉంటుంది.

ZX వేరియంట్ - పూర్తి ఫీచర్ల ప్యాకేజ్

ZX వేరియంట్‌లో VXలో లేని అన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ఫ్రంట్ డిస్క్ బ్రేక్

LED సీక్వెన్షియల్ ఇండికేటర్స్‌

బ్లూటూత్ కనెక్టివిటీ

టర్న్ బై టర్న్ నావిగేషన్

USB చార్జింగ్ పోర్ట్

అదనపు స్టోరేజ్ స్పేస్

ఇల్యూమినేటెడ్ స్టార్ట్ బటన్

బూట్ ల్యాంప్

అదనంగా VXలో లేని యెల్లో, రెడ్ కలర్ ఆప్షన్లు కూడా ZXలో లభిస్తాయి.

ధర (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఎక్స్‌-షోరూమ్‌ ధర): ₹93,307 

హైదరాబాద్ ఆన్ రోడ్ ధర వివరాలు:
ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹93,307
RTO: ₹12,697
ఇన్సూరెన్స్: ₹6,388
మొత్తం ఆన్ రోడ్ ధర: ₹1,12,392. ఇతర తెలుగు నగరాల్లోనూ స్వల్ప తేడాలతో ఇదే ధర ఉంటుంది.

ఏ వేరియంట్ తీసుకోవాలి?

VX, ZX మధ్య ధర తేడా సుమారు ₹8,400 (ఎక్స్‌-షోరూమ్‌). ఈ తక్కువ వ్యత్యాసానికే ZXలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌, బ్లూటూత్‌, నావిగేషన్‌, USB వంటి ముఖ్యమైన ఫీచర్లు వస్తాయి.

మీరు రోజువారీ ఆఫీస్ ప్రయాణం, కాలేజ్ ఉపయోగం కోసం బేసిక్ ఫీచర్లు సరిపోతాయని భావిస్తే VX సరిపోతుంది. కానీ టెక్నాలజీ, కంఫర్ట్‌, సేఫ్టీ విషయంలో పూర్తి ఫీచర్లు కావాలంటే ZX వేరియంట్ మంచి ఎంపిక అవుతుంది.

మొత్తంగా చూసుకుంటే, స్పోర్టీ లుక్‌తో పాటు ఫీచర్ల పరంగా ZX వేరియంట్ విలువైన ఆప్షన్‌గా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 22 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Embed widget