Tata Sierra కారు గరిష్టంగా ఎంత వేగంతో నడుస్తుంది.

Published by: Shankar Dukanam

టాటా సియెరా ఒక మోడ్రన్ SUV, ఇది గత ఏడాది లాంచ్ అయింది.

టాటా సియెర్రా కారు 1.5 లీటర్ హైపరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో టెస్టులో అత్యధిక వేగం సాధించింది.

సియెర్రా SUV టెస్ట్ ట్రాక్ NATRAX పై గంటకు 222 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించింది.

ఈ వేగం సాధారణ రహదారి డ్రైవింగ్ కోసం కాదు. కేవలం కారు వేగాన్ని టెస్ట్ చేశారు.

సాధారణంగా రోడ్లపై డ్రైవింగ్ కు గంటకు 190 కిలోమీటర్ల వరకు స్పీడ్ లిమిట్ పెట్టారు.

టాటా సియెర్రా కారు పెట్రోల్ బేస్ మోడల్ హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 11,49,000. ఆన్ రోడ్ ధర రూ. 14 లక్షల 36 వేల 861

రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ కలిపిన తరువాత ఎక్స్-షోరూమ్ ధరతో పోలిస్తే ఆన్-రోడ్ ధర బాగా పెరుగుతుంది.

టాటా సియెర్రా Accomplished Plus Diesel AT (Diesel) టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 21 లక్షల 29 వేలు, ఆన్ రోడ్ ధర రూ. 25 లక్షల 33 వేల 522

సియెర్రా Pure DCA (Petrol) ఎక్స్‌షోరూమ్ ధర రూ. 14,49,000, ఆన్ రోడ్ ధర రూ. 18 లక్షల వెయ్యి 8 వందలు