అన్వేషించండి

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?

Delimitation 25 Years Freeze: లోక్ సభ సీట్లు మరో పాతికేళ్ల పాటు పెంచవద్దని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. సీట్ల పెంపు ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

South vs North India Delimitation:  భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తీవ్ర రాజకీయ వేడిని రాజేస్తోంది. దేశ జనాభా 1971లో 54 కోట్లుగా ఉన్నప్పుడు నిర్ధారించిన 543 లోక్‌సభ స్థానాలే.. నేడు జనాభా 140 కోట్లు దాటినా కొనసాగుతుండటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 వరకు సీట్ల సంఖ్యను స్తంభింపజేయగా, తిరిగి 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు   ఫ్రీజ్ చేశారు. అయితే, ఇప్పుడు లోక్‌సభ సీట్ల పెంపును మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించడం వెనుక రాజకీయ శక్తుల మధ్య ఉన్న ప్రయోజనాల యుద్ధం స్పష్టమవుతోంది.

జనాభా పెరుగుల తేడాల వల్ల సమస్యలు

ఈ సీట్ల పెంపు ప్రతిపాదనలను నిలిపివేయడం , వాయిదా వేయాలని కోరడం వెనుక ఉన్న ప్రధాన సాంకేతిక, రాజకీయ కారణం  దక్షిణాది వర్సెస్ ఉత్తరాది  రాష్ట్రాల మధ్య ఉన్న జనాభా నిష్పత్తి తారతమ్యం. గత నాలుగైదు దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభాను నియంత్రించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు.. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే పార్లమెంట్‌లో తీవ్రంగా నష్టపోతాయని భయపడుతున్నాయి. జనాభా విస్ఫోటనం చెందిన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్య విపరీతంగా పెరిగి, దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ప్రాధాన్యత తగ్గిపోతుందనేది ప్రధాన ఆందోళన. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కానీ అదే సమయంలో, 25 లక్షల మందికి ఒక ఎంపీ ఉండటం ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రానికే విరుద్ధం.

రిజర్వేషన్లు ఆ స్థాయిలో పెరగవా?
  
మరో కోణంలో చూస్తే, నియోజకవర్గాల సంఖ్య పెరగకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు వర్గాలతో పాటు బీసీ, మహిళా ప్రాతినిధ్యం కూడా పరిమితమైపోతోందనే వాదన బలంగా ఉంది. కొత్తగా అమలులోకి రానున్న మహిళా రిజర్వేషన్ చట్టం  ప్రకారం పార్లమెంట్‌లో 33 శాతం స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంది. మొత్తం సీట్లు పెరగకుండా ఈ రిజర్వేషన్లు వర్తింపజేస్తే, ప్రస్తుతం ఉన్న జనరల్ స్థానాల్లో సగానికి పైగా కోత పడి తీవ్ర రాజకీయ అసంతృప్తికి దారితీస్తుంది. అందుకే నూతన పార్లమెంట్ భవనాన్ని కూడా భవిష్యత్తులో 888 మంది లోక్‌సభ సభ్యులు కూర్చునేలా కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. కాంగ్రెస్ వంటి విపక్షాలు ఈ పెంపును మరో 25 ఏళ్లు ఫ్రీజ్ చేయాలని కోరడం వెనుక ప్రత్యక్షంగా దక్షిణాది రాష్ట్రాల ఆకాంక్షలను కాపాడటం ఒకటైతే, పరోక్షంగా ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ రాజకీయ ఆధిపత్యాన్ని అడ్డుకోవడమేననే విశ్లేషణలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన స్థానాలు పెరిగితే హిందీ రాష్ట్రాల్లోనే లోనే మెజారిటీ మార్కు సులువుగా లభించే అవకాశం అధికార పార్టీకి దక్కుతుందనే భయం విపక్షాల్లో ఉంది. అందువల్లనే, సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండే వరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సమాన నిష్పత్తిలో పెంచుతామంటున్న కేంద్రం

అయితే,  ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెంచితే సమస్య ఏముంది  అనే ప్రశ్నకు రాజ్యాంగ నిపుణులు ఒక పరిష్కారం చూపుతున్నారు. జనాభాతో పాటు రాష్ట్రాల జిడిపి భాగస్వామ్యం, సామాజిక పురోగతి,  ప్రస్తుత సీట్ల నిష్పత్తిని ప్రామాణికంగా తీసుకుని పునర్విభజన చేపడితే ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని విశ్లేషిస్తున్నారు. జనాభా పెరిగిన కొద్దీ ప్రజాప్రతినిధికి-ప్రజలకు మధ్య దూరం పెరుగుతోందని, ఒక ఎంపీ ఇరవై ఐదు లక్షల మందికి ప్రాతినిధ్యం వహించడం వల్ల క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం కష్టమవుతోందని పేర్కొంటున్నారు.  1971 నాటి పాత లెక్కలతోనే ఇంకా కాలం వెళ్లదీయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సీట్ల పెంపును మరో పాతికేళ్లు వాయిదా వేయడం కంటే, దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతాన్ని కాపాడుతూనే, పెరిగిన జనాభాకు తగినట్లుగా ఎంపీ స్థానాలను పెంచే సమగ్ర విధానాన్ని రూపొందించడమే కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు చేయాల్సిన అసలైన పని. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget