అన్వేషించండి

NDA Delimitation Magic Number:ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!

విపక్ష కూటమిలోని అంతర్గత విభేదాలు ఎన్డీయేకు వరంగా మారుతున్నాయి. టీఎంసీ, శివేసన, సమాజ్‌వాదీపార్టీ ఎంపీల తిరుగుబాటుతో రాజ్యాంగ సవరకు అవసరమైన మ్యాజిక ఫిగర్‌కు మోదీ స్కారు చేరువైంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాజకీయ ముఖచిత్రం మారిపోయింది.
  • విపక్ష కూటములలో చీలికలు ఎన్డీఏ బలాన్ని గణనీయంగా పెంచాయి.
  • రాజ్యాంగ సవరణకు డీఎంకే మద్దతుతో ఆరు ఓట్ల దూరంలో.

NDA Delimitation Magic Number:మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారత రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. కేవలం రెండు వారాల వ్యవధిలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు నేషనల్ పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్నటి వరకు ప్రతిపక్షాల ఐక్యతతో వెనక్కి తగ్గిన మోదీ, ఇప్పుడు వారందర్నీ కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. అంతేకాకుండా రాజ్యాంగ సవరణ బిల్లుకు కూడా లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. గడిచిన ఏప్రిల్ నెలలలో లోక్‌సభలో కేవలం 54 ఓట్ల తేడాతో ఆగిపోయిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు ఇప్పుడు మోదీ ప్రభుత్వం మళ్లీ ప్రాణం పోయబోతోంది. 

విపక్ష కూటమిలో మొదలైన ముసలం, రీజనల్ పార్టీల చీలికలు ఎన్డీఏకు వరంగా మారాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ తృణమూల్ కాంగ్రెస్ చీలిపోవడం, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి కూడా ఎంపీలు జారిపోతుండటంతో ఢిల్లీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే నెంబర్‌పై ఉంది. అది మ్యాజిక్ నెంబర్‌ 6. అవును ప్రభుత్వం అనుకున్నది సాధించాలంటే ఇప్పుడు కేవలం ఆరు ఓట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఈ రాజకీయ చదరంగంలో ఎన్డీఏ విజయం సాధిస్తే వన్‌ నేషన్ వన్‌ ఎలక్షన్ వంటి కీలక సంస్కరణలు మార్గం సుగమంకానుంది. 

బెంగాల్‌టు మహారాష్ట్ర- విపక్షాల కోటలకు బీటలు 

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అనడానికి ప్రస్తుత పరిణామాలే నిదర్శనం.పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో ఊహించని చీలక వచ్చింది. లోక్‌సభలో ఉన్న 28 మంది టీఎంసీ ఎంపీలలో ఏకంగా 20 మంది తిరుగుబాటు చేస్తున్నారు. వీరంతా కలిసి నేషనలిస్ట్ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యారు. ఈ వర్గం ఇప్పుడు ఎన్డీయేకు మద్దతు తెలపడం దాదాపు ఖాయమైంది. 

మరోవైపు మహారాష్ట్ర లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఉద్ధవ్‌ థాకరేకు చెందిన శివసేన నుంచి తొమ్మిది మంది ఎంపీల్లో 6 మంది బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వీరు ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో చేరితే , ఎన్డీఏ బలం అనూహ్యంగా పెరుగుతుంది. ఈ పరిణామాలన్నీ జులైలో జరగబోయే వర్షాకాల సమావేశాల నాటికి పూర్తి కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మ్యాజిక్ ఫిగర్ లెక్కలివే

రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించాలంటే లోక్‌భలో 2/3 మెజారిటీ అవసరం. ప్రస్తుత లెక్క చూస్తే. లోక్‌సభలో మొత్తం సీట్లు 543ఇందులో మూడు ఖాళీగా ఉన్నాయి అంటే 540 అన్నమాట. రాజ్యాంగ సవరణకు కావాల్సిన ఓట్లు 360. ప్రస్తుతం ఎన్డీఏ బలం 318 మాత్రమే. ఇంకా 42 ఓట్లు కావాల్సి ఉంది. అయితే గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు 528 మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఆ లెక్కన చూస్తే మెజారిటీకి మార్క్‌ 352కి పడిపోతుంది. ఆ సమయంలో ప్రభుత్వం కేవల 298 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టీఎంసీ రెబల్స్ 20 మంది, థాకరే శివసేన రెబెల్స్‌ 6 మంది కలిస్తే ఎన్డీఏ బలం 344కు చేరుతుంది. 

డీఎంకే మద్దతు ఎవరికి? 

ఈ మొత్తం సమీకరణంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కీలకంగా మారింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియన్ బ్లాక్ నుంచి డీఎంకే బయటకు రావడంతో కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోంది. డీఎంకేకి ఉన్న 22 మంది లోక్‌సభ ఎంపీలు ఒక వేళ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే, ఎన్డీఏ బలం 348కు చేరుతుంది. ఈ స్థితిలో రాజ్యాంగ సవరణకు ప్రభుత్వం కేవలం 6 ఓట్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ ఆరు ఓట్లు చిన్న చిన్న పార్టీల నుంచి లేదా సమాజ్‌వాది పార్టీలోని అసమ్మతి వర్గం నుంచి సేకరించడం పెద్ద కష్టం కాదని బీజేపీ భావిస్తోంది. 

రాజ్యసభలోనూ అదే జోరు 

లోక్‌సభ మాత్రమే కాదు, రాజ్యసభలోనూ ఎన్డీఏ తన పట్టు బిగిస్తోంది. రాజ్యసభలో రాజ్యాంగ సవరణకు 164 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 150 మంది సభ్యులు ఉన్నారు. ఒక వేళ డీఎంకేకు చెందిన 8 మంది ఎంపీలు మద్దతు ఇస్తే, ఆ బలం 158కి చేరుకుంది. ఇక్కడ కూడా మ్యాజిక్ నంబర్ కోసం ఆరు ఓట్లు మాత్రమే కావాలి. త్వరలో జరగబోయే రాజ్యసభ ఉపఎన్నికల ద్వారా లోటు భర్తీ చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. 

డీలిమిటేషన్ వస్తే ఏం జరుగుతుంది?

ఈ మ్యాజిక్ నెంబర్‌ సాధించిన వెంటనే మోదీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకమైన డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురానుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దీంతోపాటు చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఉత్తర భారత రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. 

Frequently Asked Questions

మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఏ కీలక బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టబోతోంది?

లోక్‌సభలో గతంలో ఆగిపోయిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మోడీ ప్రభుత్వం మళ్లీ ప్రాణం పోయబోతోంది. వీటిని ఆమోదించడానికి ప్రయత్నిస్తోంది.

భారత రాజకీయ ముఖచిత్రం మారడానికి ప్రధాన కారణం ఏమిటి?

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత విపక్ష కూటమిలో మొదలైన ముసలం, రీజనల్ పార్టీలలో చీలికలు ఎన్డీఏకు వరంగా మారాయి. ఇది రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చింది.

రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదం పొందడానికి ఎన్డీఏకు ప్రస్తుతం ఎన్ని ఓట్లు తక్కువగా ఉన్నాయి?

డీఎంకే మద్దతుతో లోక్‌సభలో 348 ఓట్లతో ఎన్డీఏకు రాజ్యాంగ సవరణకు కేవలం 6 ఓట్లు తక్కువగా ఉన్నాయి. రాజ్యసభలో కూడా 6 ఓట్లు అవసరం.

డీలిమిటేషన్ బిల్లు ఆమోదించబడితే ఎలాంటి మార్పులు వస్తాయి?

డీలిమిటేషన్ బిల్లు ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా, ఉత్తర భారత రాష్ట్రాల్లో సీట్ల పెంపు వంటి మార్పులు వస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
YSRCP Candidates: వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
TDP Janasena and BJP Seat Sharing: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Embed widget