అన్వేషించండి

యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!

యమహా RayZR 125 ఫై హైబ్రిడ్‌ నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ధరలు, బ్రేకులు, కనెక్టివిటీ, నావిగేషన్‌ సహా ప్రతి వేరియంట్‌ ఫీచర్లను తెలుసుకోండి.

Yamaha RayZR 125 Price And Features Telugu: యమహా కంపెనీ, తన RayZR 125 Fi హైబ్రిడ్‌ స్కూటర్‌ను కొత్త ఫీచర్లు & కొత్త రంగులతో అప్‌డేట్‌ చేసింది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ నాలుగు వేరియంట్లలో లభిస్తోంది, అవి - Drum, Disc, Street Rally LCD &Street Rally TFT. బేస్‌ వేరియంట్‌ Drum నుంచి టాప్‌ వేరియంట్‌ Street Rally TFT వరకు ధరలో రూ.20,560 తేడా ఉంది. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? పై వేరియంట్‌కు వెళ్తే అదనంగా ఏం లభిస్తుంది? తెలుసుకుందాం.

ముందుగా అన్ని వేరియంట్లలోనూ ఒకే ఇంజిన్‌ ఉంటుంది. 125cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ 8.2hp శక్తిని, 10.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ పేరులో ఉన్నట్లుగానే అన్ని వేరియంట్లలోనూ యమహా మైల్డ్‌ హైబ్రిడ్‌ వ్యవస్థ ఉంటుంది. ఇది అవసరమైన సమయంలో టార్క్‌ను స్వల్పంగా పెంచుతుంది.

అన్ని వేరియంట్లలో స్టార్టర్‌ మోటార్‌ జనరేటర్‌ ఉంటుంది. దీంతో ఇంజిన్‌ నిశ్శబ్దంగా స్టార్ట్‌ అవుతుంది. స్టాప్‌-స్టార్ట్‌ సిస్టమ్‌ కూడా ఉంటుంది. యూనిఫైడ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. ముందు భాగంలో వేరియంట్‌ను బట్టి డ్రమ్‌ లేదా డిస్క్‌ బ్రేక్‌ ఉంటుంది. అన్ని వేరియంట్లలో వెనుక డ్రమ్‌ బ్రేక్‌ ఉంటుంది.

అలాగే టైర్లు & రిమ్‌ల సైజులు కూడా ఒకేలా ఉంటాయి. సీటు ఎత్తుతో పాటు స్కూటర్‌ కొలతల్లోనూ ఎలాంటి మార్పు లేదు. సీటు కింద 21 లీటర్ల స్టోరేజీ స్థలం ఉంటుంది. అదనపు ఫీచర్లు ఉన్నప్పటికీ అన్ని వేరియంట్ల బరువు 99 కిలోలుగానే ఉంటుంది.

Drum 
డ్రమ్‌ వేరియంట్‌ ఈ సిరీస్‌లో బేస్‌ మోడల్‌. ఇందులో ముందు భాగంలో 130 mm డ్రమ్‌ బ్రేక్‌ ఉంటుంది. LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ద్వారా వేగం, ఇంధన స్థాయి వంటి ప్రాథమిక వివరాలు తెలుసుకోవచ్చు. అయితే కనెక్టివిటీ ఫీచర్లు ఉండవు. ఈ వేరియంట్‌ మెటాలిక్‌ బ్లాక్‌ రంగులో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ.79,880.

ఇది కూడా చదవండి: KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?

Disc
డ్రమ్‌ వేరియంట్‌ తర్వాత డిస్క్‌ వేరియంట్‌ వస్తుంది. ఇందులో 190 mm ముందు డిస్క్‌ బ్రేక్‌ ఉంటుంది. యమహా Y-కనెక్ట్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ బ్యాటరీ స్థాయి, కాల్స్‌, ఈమెయిల్స్‌, SMS అలర్ట్‌లు వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఇంధన వినియోగం, సర్వీస్‌ సూచనలు & చివరిగా స్కూటర్‌ను పార్క్‌ చేసిన ప్రదేశం వంటి సమాచారాన్ని కూడా యాప్‌ ద్వారా చూడవచ్చు. దీని ధర రూ.87,680. బేస్‌ వేరియంట్‌తో పోలిస్తే రూ.7,800 ఎక్కువ.

Street Rally LCD
స్ట్రీట్‌ ర్యాలీ LCD వేరియంట్‌ మరో మెట్టు పైకి తీసుకెళ్తుంది. మెకానికల్‌గా ఇది సాధారణ RayZRతో సమానంగానే ఉంటుంది. అయితే హ్యాండ్‌ గార్డులు & ముందు ఏప్రాన్‌కు అదనపు సైడ్‌ రీన్‌ఫోర్స్‌మెంట్లు ఉంటాయి. కొత్త రంగులు & డీకల్స్‌తో స్పోర్టీ లుక్‌ లభిస్తుంది. దీని ధర రూ.93,930.

ఇది కూడా చదవండి: RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు

Street Rally TFT
అన్నింటికంటే పైస్థానంలో స్ట్రీట్‌ ర్యాలీ టీఎఫ్‌టీ వేరియంట్‌ ఉంటుంది. ఇందులో TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ లభిస్తుంది. వై-కనెక్ట్‌తో పాటు టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ & మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు వస్తాయి. యమహా స్కూటర్‌ ఆన్సర్‌ బ్యాక్‌ ఫీచర్‌ కూడా ఉంటుంది. రద్దీగా ఉండే పార్కింగ్‌ ప్రాంతంలో స్కూటర్‌ను సులభంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఈ టాప్‌ వేరియంట్‌ మ్యాట్‌ టైటాన్‌ & మ్యాట్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. మ్యాట్‌ టైటాన్‌ రంగు ఈ వేరియంట్‌కు ప్రత్యేకం. దీని ధర రూ.1,00,440. అంటే RayZR 125 ఫై హైబ్రిడ్‌ ధర తొలిసారిగా లక్ష రూపాయల మార్క్‌ను దాటింది.

కేవలం ధరను మాత్రమే చూడకుండా, మీకు అవసరమైన ఫీచర్లను బట్టి ఒక వేరియంట్‌ను ఎంచుకోవడం మంచిది. కనెక్టివిటీ అవసరం లేని వారికి డ్రమ్‌ వేరియంట్‌ సరిపోతుంది. డిస్క్‌ బ్రేక్‌ & కనెక్టివిటీ కావాలంటే డిస్క్‌ వేరియంట్‌ ఉపయోగకరంగా ఉంటుంది. స్పోర్టీ డిజైన్‌ కోసం స్ట్రీట్‌ ర్యాలీ వేరియంట్లు ఆకట్టుకుంటాయి. నావిగేషన్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి అదనపు ఫీచర్లు కావాలనుకునే వారికి టాప్‌ వేరియంట్‌ సరైన ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
భారత్‌లో తిరిగే కార్లన్నీ మన దేశానికి చెందినవి కావు.. ఏ కారు ఏ దేశానిదో తెలుసా?
Bajaj Pulsar N250 SS ఫస్ట్ రైడ్ రివ్యూ: పవర్, టెక్నాలజీ.. కొత్త అప్‌డేట్స్‌తో ఈ బండి మరింత స్పెషల్!
పాత పల్సర్‌కు కొత్త హంగులు.. కొత్త పల్సర్‌ N250 SSలో వచ్చిన 5 కీలక మార్పులేవో మీకు తెలుసా?
Affordable Gloves Boots: రూ.15 వేలల్లోనే పూర్తి రైడింగ్ గేర్.. CE Level 2 ఆర్మర్ అంటే ఏమిటి?
రూ.15 వేలల్లోనే బైక్ పూర్తి రైడింగ్ గేర్.. జాకెట్, గ్లౌజులు, బూట్లను ఎలా ఎంచుకోవాలి?
2026 KTM 200 Duke Review: కేవలం రూ.1,500 అదనపు ధర.. కేటీఎం 200 డ్యూక్‌లో 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
2026 కేటీఎం 200 డ్యూక్ రివ్యూ: ఈ బైక్‌లో వచ్చిన 5 కొత్త అప్‌డేట్స్, ప్రత్యేకతలు ఇవిగో!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget