అన్వేషించండి

మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!

మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ సెప్టెంబర్ 5న లాంచ్‌ కానుంది. కొత్త డిజైన్‌, 10.1 అంగుళాల స్క్రీన్‌, కొత్త ఫీచర్లు, ఇంజిన్‌, ధర వివరాలు తెలుసుకోండి.

2026 Maruti Baleno Facelift Price And Features Telugu: మారుతి సుజుకి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నవాళ్లకు గుడ్‌న్యూస్. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కొత్త రూపంతో మరికొన్ని రోజుల్లోనే, అంటే.. సెప్టెంబర్ 5, 2026న లాంచ్‌ కానుంది. 2022లో వచ్చిన రెండో తరం బలెనోకు ఇదే తొలి పెద్ద అప్‌డేట్‌.

కొత్త బలెనోలో డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే కారు ప్రస్తుత డిజైన్‌ పూర్తిగా మాత్రం మారదు. ముందు భాగం, బంపర్లు, గ్రిల్‌ & అల్లాయ్‌ వీల్స్‌లో ప్రధానంగా మార్పులు కనిపించే అవకాశం ఉంది.

డిజైన్‌
2026 బలెనో ఫేస్‌లిఫ్ట్‌ టెస్టింగ్‌ వాహనాలు ఇప్పటికే రోడ్లపై కనిపించాయి. వీటికి భారీగా క్యామొఫ్లాజ్‌ కవర్లు ఉండటంతో పూర్తిస్థాయి డిజైన్‌ తెలీలేదు. అయినప్పటికీ, కొత్త మోడల్‌లో కొన్ని డిజైన్‌ మార్పులు కచ్చితంగా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా గ్రిల్‌, ముందు & వెనుక బంపర్లకు కొత్త డిజైన్‌ వచ్చే అవకాశం ఉంది. అల్లాయ్‌ వీల్స్‌ డిజైన్‌ కూడా మారవచ్చు.

ఇంటీరియర్‌
ప్రస్తుత బలెనోకు దగ్గరగానే డ్యాష్‌బోర్డ్‌ లేఅవుట్‌ ఉండొచ్చని అంచనా. లేయర్డ్‌ డ్యాష్‌బోర్డ్‌, డ్యాష్‌బోర్డ్‌పై ప్రత్యేకంగా కనిపించే ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, ట్రాపిజాయిడల్‌ ఏసీ వెంట్స్‌, ఫిజికల్‌ ఏసీ కంట్రోల్‌ నాబ్స్‌, ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్‌ వీల్‌ కొనసాగవచ్చు. 

క్యాబిన్‌ను మరింత ప్రీమియంగా మార్చేందుకు కంపెనీ కొన్ని మార్పులు చేయొచ్చు. సీట్‌ అప్హోల్స్టరీలో కొత్త మెటీరియల్‌, కొత్త ట్రిమ్‌ ఫినిషింగ్‌ & కొత్త రంగు ఎంపికలను అందించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?

ఫీచర్లు
ఫీచర్ల విషయంలో బలెనో ఫేస్‌లిఫ్ట్‌ మరింత ఆసక్తికరంగా ఉండొచ్చు. విక్టోరిస్‌లో అందించిన 10.1 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఇందులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌ కూడా కొత్తగా చేరొచ్చు.

ప్రస్తుత బలెనోలో ఉన్న చాలా ఫీచర్లు కొత్త మోడల్‌లోనూ కొనసాగనున్నాయి. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, హెడ్‌అప్‌ డిస్‌ప్లే, 6 స్పీకర్ల ఆర్కమిస్‌ ఆడియో సిస్టమ్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. వాయిస్‌ అసిస్టెంట్‌, ఓవర్‌ ది ఎయిర్‌ అప్‌డేట్స్‌, ఆటో డిమ్మింగ్‌ ఇంటీరియర్‌ రియర్‌ వ్యూ మిర్రర్‌, కీలెస్‌ ఎంట్రీ, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు కూడా కొనసాగవచ్చు.

కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ & 360 డిగ్రీ కెమెరా కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీంతో ఫీచర్ల విషయంలో కొత్త బలెనో ప్రస్తుత మోడల్‌ కంటే మరింత ఆకర్షణీయంగా మారనుంది.

ఇంజిన్‌ 
ఈ విషయంలో మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుత 1.2 లీటర్‌ NA పెట్రోల్‌ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 90hp పవర్‌ & 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ & AMT గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉండొచ్చు.

CNG వెర్షన్‌ కూడా కొనసాగనుంది. CNG మోడ్‌లో ఇదే ఇంజిన్‌ 78hp పవర్‌ & 99Nm టార్క్‌ను అందిస్తుంది. CNG వెర్షన్‌ 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

ఇది కూడా చదవండి: రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే

ధర 
ప్రస్తుతం బలెనో ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.48 లక్షల వరకు ఉంది. ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ఫీచర్లు, డిజైన్‌ మార్పులు రావడంతో ధర కొంత పెరిగే అవకాశం ఉంది. 

కొత్త బలెనో... Hyundai i20, Tata Altroz & Toyota Glanzaతో పోటీ పడనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget