అన్వేషించండి

RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్ ధర, ఇంజిన్, మైలేజ్, ABS, బరువు, గ్రౌండ్ క్లియరెన్స్ & ప్రత్యేక ఫీచర్ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

RE Classic 350 Gorkha Edition Details Explained In Telugu: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో ఒక కొత్త ప్రత్యేక ఎడిషన్ ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చింది. భారత సైన్యంలోని గోర్ఖా రెజిమెంట్ ధైర్యం, క్రమశిక్షణకు గుర్తుగా క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ప్రత్యేకమైన రంగు, గోర్ఖా రెజిమెంట్ గుర్తులతో ఈ బైక్ సాధారణ క్లాసిక్ 350 కంటే ప్రత్యేకంగా కనిపిస్తుంది. 

1. గోర్ఖా ఎడిషన్‌లో ప్రత్యేకత ఏంటి?

గోర్ఖా గ్రీన్ అనే ప్రత్యేక రంగుతో క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్‌ను తీసుకొచ్చారు. ఇది సైనిక వాహనాలను పోలి ఉంటుంది. బైక్ సైడ్ ప్యానల్స్‌ మీద రెండు ఖుక్రీలు క్రాస్ చేసిన ప్రత్యేక గుర్తు కనిపిస్తుంది. ఇది గోర్ఖా రెజిమెంట్ అధికారిక చిహ్నం. ఇంధన ట్యాంక్‌పై ఫ్యూయల్ మూతకు పైన గోర్ఖా ఎడిషన్ స్టిక్కర్ ఉంటుంది. మిగతా డిజైన్ & కొలతల్లో పెద్దగా మార్పులు లేవు.

2. ధర ఎంత?

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్ ధర రూ.2.11 లక్షలు (ఎక్స్-షోరూమ్). సాధారణ క్లాసిక్ 350 ధర రూ.1.87 లక్షల నుంచి రూ.2.24 లక్షల వరకు ఉంటుంది. కమాండో సాండ్ అనే మరో కలర్‌ వేరియంట్ కూడా రూ.2.11 లక్షల ధరకే లభిస్తుంది.

ఇది కూడా చదవండి: KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?

3. ఇంజిన్‌లో మార్పులున్నాయా?

ఈ ప్రత్యేక ఎడిషన్‌లోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ J-సిరీస్ ఇంజిన్‌నే కొనసాగించారు. 2020లో మీటియర్ 350తో పరిచయమైన ఈ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 20.2 హెచ్‌పీ పవర్ & 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి పనితీరు విషయంలో గోర్ఖా ఎడిషన్ సాధారణ క్లాసిక్ 350కు భిన్నంగా ఉండదు.

4. సీటు ఎత్తు ఎంత?

క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్ సీటు ఎత్తు 805 మిల్లీమీటర్లు. సాధారణ క్లాసిక్ 350లోనూ ఇదే సీటు ఎత్తు ఉంటుంది. బైక్ ఎత్తు విషయంలోనూ ప్రత్యేక ఎడిషన్‌లో ఎలాంటి మార్పు చేయలేదు.

5. ఏ ఫీచర్లు ఉన్నాయి?

ఈ బైక్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ అందుబాటులో ఉంది. ప్రయాణంలో మొబైల్‌ను ఛార్జ్ చేసుకునేందుకు టైప్-C USB పోర్ట్ కూడా ఇచ్చారు. క్లాసిక్ 350లోని ఇతర వేరియంట్లకు కూడా ఇటీవల ఇదే ఫీచర్ సెట్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ అందించింది.

ఇది కూడా చదవండి: బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం

6. డ్యూయల్ ఛానల్ ABS ఉందా?

గోర్ఖా ఎడిషన్‌లో డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా లభిస్తుంది. క్లాసిక్ 350లో రంగును బట్టి ABSలో తేడా ఉంటుంది. మొత్తం ఎనిమిది రంగుల్లో రెడ్డిచ్ రెడ్ బేస్ వేరియంట్‌కు మాత్రమే సింగిల్ ఛానల్ ABS ఉంటుంది. గోర్ఖా గ్రీన్ సహా మిగతా రంగుల్లో డ్యూయల్ ఛానల్ ABS అందుబాటులో ఉంటుంది. బ్రేకింగ్ కోసం ముందు 300 మిల్లీమీటర్ల డిస్క్ & వెనుక 270 మిల్లీమీటర్ల డిస్క్ ఉన్నాయి.

7. బరువు & గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత?

గోర్ఖా ఎడిషన్ కర్బ్ బరువు 195 కిలోలు. గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్లు. ఈ రెండు అంశాల్లోనూ సాధారణ క్లాసిక్ 350తో ఎలాంటి మార్పు లేదు. తక్కువ బరువున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కావాలనుకునేవారికి హంటర్ 350 మరో ఆప్షన్. దాని కర్బ్ బరువు 181 కిలోలు. అయితే దాని గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిల్లీమీటర్లు. రోజువారీ వినియోగంలో ఈ 10 మిల్లీమీటర్ల తేడా పెద్ద సమస్య కాకపోవచ్చు.

క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ ప్రత్యేకమైన సైనిక నేపథ్య డిజైన్ & లుక్స్‌. ఇది తప్ప ఇంజిన్, పనితీరు, కొలతలు మాత్రం స్టాండర్డ్‌ క్లాసిక్ 350 తరహాలోనే ఉన్నాయి. ప్రత్యేకంగా కనిపించే RE బైక్‌ కొనాలని భావించేవాళ్లు ఒకసారి షోరూమ్‌కు వెళ్లి, బండిని ప్రత్యక్షంగా చూసి నిర్ణయం తీసుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి అట్రాక్టివ్‌ లుక్.. గోర్ఖా ఎడిషన్‌లో ఉన్న 7 ప్రత్యేకతలు ఇవే
రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?
చేతిలో రూ.50 వేలే ఉందా? అయినా పర్లేదు, కొత్త మారుతి ఆల్టో K10 మీ సొంతం!
KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Embed widget