అన్వేషించండి

Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 

Balka Suman Released : బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మున్సిపాలిటీ ఎన్నికల వేళ జరిగిన ఘర్షణల్లో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.

Balka Suman Released : క్యాతనపల్లిలో మంత్రిపై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌ బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలో ఆయన హస్తం ఉందని పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో రాజకీయ పార్టీల మధ్య  తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో బాల్క సుమన్ ప్రత్యక్షంగా ప్రమేయం కలిగి ఉన్నారని శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గత నెల 18వ తేదీన ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్నారు. 

బాల్క సుమన్ అరెస్టు అక్రమమని, కనీస నిబంధనలు పాటించలేదని ఆయన తరుఫు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదించారు. ముఖ్యంగా అరెస్టు చేసే సమయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన విధి విధానాలను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు కేసు తదుపరి విచార కోసం సుమన్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు మంచిర్యాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం పోలీసుల కస్టడీ పిటిష్‌ను తోసిపుచ్చింది. 

బెయిల్ మంజూరు

సోమవారం నాడు ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. జిల్లా సెషన్స్‌ జడ్జి ఏ వీరయ్య బాల్క సుమన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. పాతికవేల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించారు. అయితే ఈ బెయిల్‌తో పాటు కోర్టు కొన్ని కఠిన నిబంధనలను విధించింది. ఈ కేసులో ఏ 1, ఏ2 ఏ4, ఏ8 నిందితులుగా ఉన్న వారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా రామకృష్ణాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో హాజరైన సంతకం చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధర్యంలో రాష్ట్రమంతటా పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే బాల్క దుయ్యబట్టారు. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్, ఆయన కొడుకు ఎంపీ వంశీకృష్ణ 14 మంది కౌన్సిలర్లను కొనే ప్రయత్నం చేశారని అన్నారు. బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఆఫర్లు చేసారని.. అయినా తమ వాళ్ళు తలొగ్గలేదన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రి, ఎంపీ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లకు మందు తాగించి వాళ్ళతో తమ మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు.

ఇక అక్కడ గొడవ సందర్భంగా రాళ్లు విసిరినోళ్ళ మీద కేసులు బుక్ కాలేదని... మా 25 మంది మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ కాన్వాయ్ ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ చార్జి చేశారని పేర్కొన్నారు. వాళ్లు దాడి చేస్తే.. మాపైనే రివర్స్‌లో కేసు పెట్టారని మండిపడ్డారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. జిల్లాలోని కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జైలు లోపల కూడా తమను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. కొడుకు పుట్టిన రోజు టైమ్ లో ఇంట్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని తెలిపారు. అందర్నీ కలుపుకుపోయాం తప్ప.. కక్ష సాధింపు చేయలేదని స్పష్టం చేశారు. నన్ను జైలులో పెట్టారు కదా.. ఇప్పుడు కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నా అని అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.  

జైలు వద్ద కోలాహలం

బాల్క సుమన్ విడుదలవుతున్నారన్న సమాచారంతో ఆదిలాబాద్‌ జిల్లా జైలు వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో మోహించారు. జైలు గేటు నుంచి ఆయన బయటకు రాగానే శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. విడుదల అనంతరం జైలు ముందే ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు  ఇలాంటి కేసులు పెట్టారని అన్నారు. అనంతం ఆయన అనుచరులతో కలిసి క్యాతనపల్లికి ర్యాలీగా బయల్దేరారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget