అన్వేషించండి

Balka Suman: కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ఆగమైంది: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

Adilabad News | కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆగమైపోతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలు ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

BRS Ex MLA Balka Suman | మంచిర్యాల: కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనతో అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఆగం అయిందని మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. మంచిర్యాల (Mancherial) జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాక సమీక్ష సమావేశంలో పాల్గొన్న బాల్క సుమన్ కాంగ్రెస్ విధానాలపై మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ట్రైనింగ్ మాడ్యూల్లో భాగంగా గత బిఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితిపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ విధానాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడిందని అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవ చేశారు. గత బిఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ ఎట్లుండే, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పరిస్థితి ఇలా దిగజారిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అప్పుడే బాగుండే తెలంగాణ కాన్సెప్ట్ తో ప్రజల్లోకి వెళ్తున్నామని ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమం మొదటగా చెన్నూరులోనే పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి

రైతులకు రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. గడిచిన 20 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన అప్పుడే మంచిగుండే కార్యక్రమం విజయవంతంగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Nirmal News: నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
Rishi Panchami Celebrations: మథురాల కోలాటం.. లెంగీ నృత్యాలు.. ఆదిలాబాద్ జిల్లాలో మథుర లభానల ఋషి పంచమి వేడుకలు
మథురాల కోలాటం.. లెంగీ నృత్యాలు.. ఆదిలాబాద్ జిల్లాలో మథుర లభానల ఋషి పంచమి వేడుకలు
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Adilabad Nimajjanam: ఒక్కసారిగా నిలిచిన గణేష్ శోభాయాత్ర, భక్తుల ఆందోళన.. కలెక్టర్ హామీతో తిరిగి ప్రారంభం
ఒక్కసారిగా నిలిచిన గణేష్ శోభాయాత్ర, భక్తుల ఆందోళన.. కలెక్టర్ హామీతో తిరిగి ప్రారంభం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget