అన్వేషించండి

Balka Suman arrest: క్యాతన్ పల్లిలో తీవ్ర ఉద్రిక్తత - బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Tension in Kyathanpally: క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తతకు కారణం అవుతోంది. బాల్క సుమన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Police arrest Balka Suman: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో గత రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింతగా విషమించాయి.  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం , స్థానిక ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రామకృష్ణాపూర్ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.                         

క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక  విషయంలో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి వినోద్ కారుపైనా దాడి చేశారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.  అరెస్ట్ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. శాంతిభద్రతల దృష్ట్యా ఆయన్ని మంచిర్యాల కాకుండా వేరే పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.                         

క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేవపూర్ ఎస్ఐ ఎ. గంగారాం  ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు బాల్క సుమన్‌పై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం, అనుమతి లేకుండా ఊరేగింపుగా వెళ్లడం వంటి ఆరోపణలతో ప్రధానంగా ఈ కేసు ఫైల్ అయింది. బాల్క సుమన్‌తో పాటు బిఆర్ఎస్ నాయకులు  రాజా రమేష్, మూల రాజిరెడ్డి, అనిల్, గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డి సహా మరికొంత మందిపై సెక్షన్ 189(3) (చట్టవిరుద్ధమైన సమావేశం), రియాటింగ్ (అల్లర్లు), ప్రభుత్వ ఉద్యోగులపై దాడి మరియు గాయపరచడం వంటి వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.                     

మంత్రి వివేక్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బారికేడ్లను తోసివేయడం, పోలీసులతో వాగ్వాదానికి దిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఈ ఘటనలో ఎస్ఐ గంగారాంతో పాటు మరికొందరు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమవుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget