అన్వేషించండి

Revanth Reddy: కాంగ్రెస్ నెక్ట్స్ జనరేషన్ లీడర్స్‌లో రేవంత్ టాప్ - మున్సిపల్ ఫలితాలతో అంతా మారిపోయిందా?

Congress Next Generation Leader: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముఖ్యనేతగా రేవంత్ రెడ్డి ఎదుగుతున్నారు. నెక్ట్స్ జెనరేషన్ లీడర్స్ లో ఆయన కీలకంగా మారుతున్నారు.

Revanth tops Congress Next Generation Leaders:  తెలంగాణలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక యాసిడ్ టెస్ట్‌గా నిలిచాయి. ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టి..  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 శాతానికి పైగా మున్సిపాలిటీలు,  కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహ చతురతకు నిదర్శనంగా మారింది. ముఖ్యంగా పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, గతంలో కేవలం గ్రామీణ పార్టీగా ఉన్న ముద్రను రేవంత్ చెరిపివేయగలిగారు. ఈ విజయంతో ఆయన హైకమాండ్ వద్ద తన పరపతిని అమాంతం పెంచుకున్నారు.

నేనే రాజు.. నేనే మంత్రి 

ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన  నేనే రాజు.. నేనే మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే, దీనిపై ఆయన తర్వాతి కాలంలో స్పష్టత ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు, మున్సిపల్ పరిపాలన శాఖను కూడా తానే పర్యవేక్షిస్తున్నందున, ఈ ఎన్నికల గెలుపోటములకు తానే పూర్తి బాధ్యత  వహిస్తాననే ఉద్దేశంతో ఆ మాట అన్నట్లు వివరించారు. ఒక సేవకుడిగానే తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెబుతూనే, బాధ్యతను భుజానికెత్తుకునే విషయంలో తనకున్న తెగింపును ఈ వ్యాఖ్యల ద్వారా చాటారు. 

కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేక వర్గం లేదు! 

కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే  గ్రూపు రాజకీయాలు రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. పార్టీలో ఆలస్యంగా చేరినప్పటికీ, సీనియర్లను సమన్వయం చేసుకుంటూనే, తన నిర్ణయాలే ఫైనల్ అనే స్థాయికి ఆయన ఎదిగారు. గతంలో బహిరంగంగా విమర్శలు చేసిన నాయకులు కూడా ఇప్పుడు మౌనం వహించడం. రేవంత్ నాయకత్వాన్ని సమర్థించడం ఆయన సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం. హైకమాండ్ పూర్తి మద్దతు ఉండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో రేవంత్ ఇప్పుడు  ఒక్కడే మొనగాడు గా కనిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక కామెంట్లు చేస్తున్నా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. 

జాతీయ స్థాయిలో తదుపరి తరం నేతగా రేవంత్

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ  నెక్స్ట్ జనరేషన్ లీడర్‌గా గుర్తింపు పొందుతున్నారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నమ్మకాన్ని చూరగొనడంలో ఆయన సఫలీకృతులయ్యారు.

రాష్ట్రంలో తిరుగులేని పట్టు 

వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ  ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడంతో తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎదురులేకుండా పోయింది. అటు విపక్ష బీఆర్ఎస్ బలహీనపడటం, ఇటు బీజేపీ పట్టణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం రేవంత్‌కు కలిసొచ్చింది. తన సంక్షేమ పథకాలు, దూకుడుగా ఉండే రాజకీయ శైలితో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయ యవనికపై ఒక బలమైన ముద్ర వేశారు. ఇది రేవంత్ నాయకత్వ పరంగా పంజుకోవడానికి కలసి వచ్చింది.           

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget