అన్వేషించండి

Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!

Palamaner Latest News:బుధవారం ఉదయం పలమనేరు సమీపంలోని జాతీయ రహదారిపై ఒక కారు అతివేగంగా ప్రయాణిస్తుంది. అయితే అదే సమయంలో ముందు వెళ్తున్న లారీని ఈ కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పలమనేరు వద్ద కారు లారీని ఢీకొని ఐదుగురు దుర్మరణం.
  • తిరుమల దర్శనానికి వెళ్తుండగా బెంగళూరు వాసులకు ఘోర ప్రమాదం.
  • అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణ.
  • ఒకేసారి ఐదుగురు మృతితో బెంగళూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.

Palamaner Latest News: భక్తుల కొంగు బంగారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆ కుటుంబ ఆశలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. పుణ్యక్షేత్రానికి వెళ్తున్న ప్రయాణం మృత్యులోకానికి తీసుకెళ్లింది. చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం ఐదుగురు ప్రాణాలను బలి తీసుకుంది. పలమనేరు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

బుధవారం ఉదయం పలమనేరు సమీపంలోని జాతీయ రహదారిపై ఒక కారు అతివేగంగా ప్రయాణిస్తుంది. అయితే అదే సమయంలో ముందు వెళ్తున్న లారీని ఈ కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. 

మృతులు బెంగళూరు వాసులు 

ప్రమాద సమాచారం అందిన వెంటనే పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వద్ద ఉన్న  వివరాల ఆధారంగా వారు కర్ణాటక వాసులుగా గుర్తించారు. వీరంతా బెంగళూరు నగరంలోని రాజాజీ నగర్ నివాసితులుగా పోలీసులు నిర్ధారించారు. వీరంతా కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి బెంగళూరు నుంచి బయల్దేరగా గమ్యస్థానానికి చేరుకోక ముందే ఈ విషాదం చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో వృద్ధులతోపాటు యువతులు కూడా ఉన్నారు. మోహన్‌దాస్‌, నాగరాజారావు, కుసుమ, జయంతి, పూజ మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలోని, బంధువర్గంలోని  ఐదుగురు వ్యక్తులు మరణించడంతో రాజాజీ నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. 

పలమనేరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.  ప్రాథమిక దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం, కారు డ్రైవర్‌ అతి వేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వేగం ఎక్కువగా ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, ముందు వెళ్తున్న లారీని గమనించలేక ఢీ కొట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. 

Frequently Asked Questions

పలమనేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతమంది మరణించారు?

పలమనేరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. వీరిలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.

ప్రమాదానికి గురైనవారు ఎక్కడికి వెళ్తున్నారు?

ఈ ప్రమాదంలో మరణించినవారు బెంగళూరు వాసులు. వీరంతా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి బయల్దేరారు.

ప్రమాదం ఎలా జరిగింది?

పలమనేరు సమీపంలో ఒక కారు అతివేగంగా ప్రయాణిస్తూ, ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కారణం ఏమిటని పోలీసులు భావిస్తున్నారు?

ప్రాథమిక విచారణ ప్రకారం, కారు డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొన్నారని పోలీసులు భావిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget