అన్వేషించండి

Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !

Guntur Mirchi tourism: గుంటూరు మిర్చి వీడియో టూరిజం ప్రాజెక్టుకు కారణం అవుతోంది. ఆనంద్ మహింద్రా చేసిన సూచనకు నారా లోకేష్ స్పందించారు.

Guntur Mirchi  tourism project:  గుంటూరు మిర్చి సాగు అద్భుత దృశ్యాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా , ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆసక్తికర చర్చ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.  గుంటూరు జిల్లాలో మిరపకాయలను ఆరబోసిన దృశ్యాలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. పైనుంచి చూస్తుంటే ఎర్రటి తివాచీ పరిచినట్లున్న ఈ దృశ్యం ప్రకృతి సిద్ధమైన హోలీ రంగుల పండుగను తలపిస్తోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ అద్భుతమైన దృశ్యాన్ని కేవలం వ్యవసాయానికే పరిమితం చేయకుండా, ఏపీ ప్రభుత్వం దీనిని ఒక పర్యాటక ఆకర్షణగా  మార్చాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. శీతాకాలంలో జరిగే ఈ పంట కోత సమయాన్ని పర్యాటక సీజన్‌గా మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నేల మీద నుంచి చూస్తే ఈ అందం కనిపించకపోవచ్చని, అందుకే పర్యాటకుల కోసం హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అలాగే స్థానిక సంగీత, నృత్య ప్రదర్శనలతో ఒక ఫెస్టివల్‌లా దీనిని నిర్వహించవచ్చని అద్భుతమైన ఐడియాలను ఇచ్చారు.

ఆనంద్ మహీంద్రా సూచనలపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తూ సానుకూలంగా సమాధానమిచ్చారు. గుంటూరు మిర్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, వేల మంది రైతుల కష్టానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ రంగుల దృశ్యాన్ని పర్యాటక పరంగా ఎలా అభివృద్ధి చేయవచ్చో పరిశీలించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. మహీంద్రా ఇచ్చిన సలహాలు స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.    

అదే సమయంలో మంత్రి లోకేష్ చమత్కారంగా మరో ప్రతిపాదన కూడా చేశారు. భవిష్యత్తులో ఏపీపై డ్రోన్ విజువల్స్ తీసినప్పుడు కేవలం వ్యవసాయ క్షేత్రాలే కాకుండా.. రాష్ట్రంలో రాబోయే మహీంద్రా ఆటో ఫ్యాక్టరీ, డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, ఏరోస్పేస్ పార్కులు కూడా ఆ డ్రోన్ కెమెరాల్లో కనిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పారిశ్రామికంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందుతోందో ప్రపంచానికి చూపించాలనే తన ఆకాంక్షను ఆయన వెల్లడించారు. 

ఆనంద్ మహీంద్రాను స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో ఉన్న పారిశ్రామిక మరియు పర్యాటక అవకాశాలను దగ్గరుండి చూపిస్తామని లోకేష్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పారిశ్రామిక దిగ్గజం ఇచ్చిన ఐడియాకు, ఒక యువ మంత్రి స్పందించిన తీరు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.   

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Embed widget