రోడ్ల దుస్థితిపై ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు యువత వినూత్న రీతిలో నిరసన తెలిపింది. అధ్వానంగా మారిన రోడ్డును బాగు చేయాలని కోరుతూ బురదలో పొర్లుదండాలు పెడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు.