అన్వేషించండి

GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?

Housing Plan: గ్రేటర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణతో కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ సమరానికి సిద్ధమవుతోంది. గతంలో కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఫార్ములాను రీక్రియేట్ చేస్తోందా?

GHMC Elections Political Strategy: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలో  ఇల్లు  అనేది దశాబ్దాలుగా అత్యంత ఉద్వేగభరితమైన, ఓట్లను శాసించే ప్రాథమిక రాజకీయ అంశం. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను ఈ ఇల్లు అనే తాయిలంతో ఆకట్టుకుని లబ్దిపొందాయి. కానీ ఆ తాయిలాలు నిజంగా ఎంత మందికి అందాయో ఎవరికీ తెలియదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరిణామం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ముంగిట  రాజకీయ చర్చకు తెరలేపింది. గ్రేటర్‌లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ  హౌసింగ్ కార్డు ను బయటకు తీసిందా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

 కేసీఆర్ 2BHK అప్పట్లో విజయవంతమైన రాజకీయ వ్యూహం 

గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్  ఇళ్లు ఇస్తామంటూ విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. లక్షలాది దరఖాస్తులను స్వీకరించి, సర్వేల పేరుతో నగరంలో సుదీర్ఘకాలం హడావుడి చేశారు. ఆచరణలో ఇళ్ల నిర్మాణం తీవ్రంగా ఆలస్యమైనప్పటికీ,  మాకూ ఇల్లు వస్తుంది  అనే ఆశను పేద, మధ్యతరగతి ప్రజల్లో నిలపడంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ అంశం భారీగా ఓట్లను, స్థానాలను తెచ్చిపెట్టింది. నిరంతరం దరఖాస్తులు స్వీకరించడం ద్వారా లబ్ధిదారులను తమ వైపు తిప్పుకోవడం ఒక రాజకీయ వ్యూహంగా ఉపయోగపడింది.

 కాంగ్రెస్  ఇందిరమ్మ  ప్లాన్ 

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరిగ్గా అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, సవాలు విసురుతున్న బీజేపీల ఓటు బ్యాంకును దెబ్బతీయాలంటే నగరంలో సొంతిల్లు లేని లక్షలాది మంది నిరుపేదలను ఆకట్టుకోవడం కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీతో 528 చదరపు అడుగుల వైశాల్యంలో ఫ్లాట్లు కట్టిస్తామని, దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టడం వెనుక వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది స్పష్టం. ఎన్నికల ముంగిట లబ్ధిదారుల ఎంపిక, లాటరీ లేదా సర్వేల పేరుతో వాతావరణాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడమే ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

 కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితి ఏంటి? 

ఇక్కడ ప్రధానంగా ఉద్భవిస్తున్న ప్రశ్న.. బీఆర్ఎస్ హయాంలో కొల్లూరు, రాంపల్లి, జవాహర్‌నగర్ వంటి శివారు ప్రాంతాల్లో నిర్మించి ఇంకా పంపిణీకి నోచుకోని వేలాది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటనేది! గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పంపిణీ చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్‌కు వెళ్తుందనే రాజకీయ సంకోచం సహజంగానే అధికార పార్టీలకు ఉంటుంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాత ఇళ్లను పూర్తి చేసి త్వరితగతిన అర్హులకు అందిస్తుందా లేక వాటిని పక్కన పెట్టి కేవలం కొత్త ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుందా అనే దానిపై నగర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. పాత ఇళ్లను పంపిణీ చేస్తే పొందే పొలిటికల్ మైలేజ్ కంటే, కొత్తగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల ఆశ చూపి పొందే మైలేజ్ ఎక్కువని భావిస్తే పాత ఇళ్ల పంపిణీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

 ఉచితం  vs  లబ్ధిదారుడి వాటా 

కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో లబ్ధిదారుడు రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంది . పట్టణ పేదలకు రూ.6 లక్షలు సేకరించడం, బ్యాంక్ రుణాలు పొందడం ఎంతవరకు సాధ్యమనే ఆర్థిక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం రూ.100 దరఖాస్తు రుసుము, రూ.10,000 ముందస్తు డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తుది కేటాయింపు సమయానికి ఆర్థిక భారంతో అసలైన లబ్ధిదారులు వెనక్కి తగ్గే ప్రమాదం కూడా ఉంది. గతంతో పోలిస్తే గ్రేటర్ ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కేవలం దరఖాస్తు ఫారాలు నింపినంత మాత్రాన ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు లేదు. బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులు ఇచ్చి ఏళ్లు గడిచినా ఇళ్లు రాలేదన్న అసంతృప్తి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దరఖాస్తులకే పరిమితమైతే  అప్లికేషన్ నిరాశ  పెరిగి రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.  

సొంతింటి కలను రాజకీయ అస్త్రంగా మార్చుకోవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. అయితే కేసీఆర్ ఫార్ములాను కాంగ్రెస్ యథాతథంగా అమలు చేయాలనుకుంటే దానికి ఉన్న పరిమితులను గమనించాలి. దరఖాస్తుల ద్వారా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడం మొదటి అడుగు మాత్రమే కాగా, క్షేత్రస్థాయిలో తాళాలు చేతికి ఇచ్చినప్పుడే ఓట్లుగా మారతాయి. రాబోయే గ్రేటర్ పోరులో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల హామీలను ఎంత వేగంగా ఆచరణలోకి తెస్తుందనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget