అన్వేషించండి

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Indiramma Housing Slab Size | ఇందిరమ్మ ఇళ్ల శ్లాబులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 500 నుంచి గరిష్టంగా 750 చదరపు అడుగులు మాత్రమే ఉండాలని పేర్కొంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇందిరమ్మ ఇళ్ల స్లాబు 500-750 చ.అడుగులకు పరిమితం చేస్తూ ఉత్తర్వులు.
  • స్లాబు ప్రొజెక్షన్లు ముందు 3 అడుగులు, ఇతర వైపు 1 అడుగు.
  • లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ నిర్ణయం ముఖ్య లక్ష్యం.
  • నిరుపేదలైన లబ్ధిదారులకు ₹5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు.

Indiramma Houses | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్లాబు సైజుపై స్పష్టమైన పరిమితులు విధిస్తూ ప్రభుత్వం ఈ గైడ్‌లైన్స్ ఇచ్చింది. కొత్త జీవో ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల స్లాబు విస్తీర్ణం 500 చదరపు అడుగుల నుంచి గరిష్టంగా 750 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిబంధనలతో పాటు స్లాబు ప్రొజెక్షన్ల (ముందుకొచ్చే భాగాలు) పై కూడా గృహనిర్మాణ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇంటి స్లాబు ముందువైపు కేవలం 3 అడుగులు, మిగతా మూడు వైపులా కేవలం ఒక అడుగు వరకు మాత్రమే ప్రొజెక్షన్ ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్లాబు విస్తీర్ణం పరిమితికి మించి పెరగడం వల్ల లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని హౌసింగ్ కార్పొరేషన్ పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులకు నిర్మాణ ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విస్తీర్ణ పరిమితులను విధించినట్లు ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటే ఏమిటి? 
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' ఒకటి. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలే రాని రోజును చూడాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు శాశ్వతమైన, సురక్షితమైన ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

Also Read: Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతంగా పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఏకంగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డబ్బును ప్రభుత్వం 100 శాతం రాయితీ (సబ్సిడీ) రూపంలో ఇస్తుంది, ఇది ఎలాంటి అప్పు కాదు. దాంతో పేద కుటుంబాలపై ఎలాంటి తిరిగి చెల్లించే భారం కానీ, అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కానీ ఉండదు.

ఈ పథకం ఇటు స్థలం ఉన్నవారికీ, అటు స్థలం లేని నిరుపేదలకూ ఇద్దరికీ అండగా నిలుస్తుంది. ఇప్పటికే సొంతంగా చిన్న స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బుల్లేని పేదలకు.. బేస్‌మెంట్, గోడలు, స్లాబ్ మరియు ఇల్లు పూర్తయ్యే దశలను బట్టి విడతలవారీగా ఈ 5 లక్షల రూపాయల నిర్మాణ నిధులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. కనీసం ఇళ్ల స్థలం కూడా లేని అత్యంత నిరుపేదలకు, ప్రభుత్వం ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయించడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఈ 5 లక్షల గ్రాంట్‌ను కూడా అందిస్తుంది.

సమాజంలో స్త్రీలకు మరింత భద్రతను, సమానత్వాన్ని కల్పించేందుకు ఈ ఇందిరమ్మ ఇళ్లను ఆయా కుటుంబాల్లోని మహిళల పేరిట మాత్రమే మంజూరు చేస్తారు. అంతేకాకుండా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు (OBC), మైనారిటీలు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి సరైన మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస వసతులతో గౌరవంగా బతికే అవకాశం లభిస్తుంది.

Frequently Asked Questions

ఇందిరమ్మ ఇళ్ల స్లాబు విస్తీర్ణం ఎంత ఉండాలి?

కొత్త జీవో ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల స్లాబు విస్తీర్ణం 500 నుండి గరిష్టంగా 750 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలి. ఇది లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా ఉండటానికి ఉద్దేశించినది.

ఇందిరమ్మ ఇంటి స్లాబు ప్రొజెక్షన్లకు పరిమితులు ఏమిటి?

స్లాబు ముందువైపు కేవలం 3 అడుగులు, మిగతా మూడు వైపులా ఒక అడుగు వరకు మాత్రమే ప్రొజెక్షన్ ఉండాలని గృహనిర్మాణ శాఖ స్పష్టం చేసింది. ఇది కొత్త మార్గదర్శకాలలో భాగం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటే ఏమిటి?

ఇళ్లు లేని పేదలకు శాశ్వతమైన, సురక్షితమైన ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఇది. దీనితో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూత లభిస్తుంది.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు? ఇది రుణమా?

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని 100% రాయితీ (సబ్సిడీ) రూపంలో అందిస్తారు. ఇది ఎలాంటి అప్పు కాదు, కాబట్టి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget