NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
NRI Priest Cheating: ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక పరిహారాల పేరిట సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మోసగించిన ఎన్నారై పూజారి చమర్తి రామ లచ్చారావును బాచుపల్లి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.

Spiritual Fraud : ఆధ్యాత్మిక పరిహారాలు, ప్రత్యేక పూజల పేరిట అమాయక భక్తులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసి మోసగిస్తున్న ఒక ఎన్నారై పూజారిని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడిని చమర్తి రామ లచ్చారావుగా గుర్తించారు. విదేశాల్లో ఉంటూ పూజల ముసుగులో ఈయన సాగించిన ఈ నయా దందా బాధితుడైన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడంతో ఎయిర్‌పోర్టులో అడ్డంగా దొరికిపోయాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి టార్గెట్.. సమస్యల పరిష్కారం పేరిట దోపిడీ!
హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం పూజారి రామ లచ్చారావును ఆశ్రయించాడు. బాధితుడి మానసిక పరిస్థితిని, బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఈ కిలాడీ పూజారి.. పెద్ద ఎత్తున హోమాలు, ప్రత్యేక దోష నివారణ పూజలు, ఆధ్యాత్మిక పరిహారాలు చేయాలని నమ్మబలికాడు. దైవకార్యాల పేరిట విడతల వారీగా బాధితుడి నుండి లక్షలాది రూపాయలను వసూలు చేశాడు. అయితే ఎంతకాలం గడిచినా సమస్యలు తీరకపోగా, తాను మోసపోయానని గ్రహించిన సదరు టెక్గీ బాచుపల్లి పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు.
లుక్ అవుట్ సర్క్యులర్ జారీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్!
బాధితుడి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితుడు రామ లచ్చారావు అమెరికా లేదా ఇతర విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు, తక్షణమే అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు పంపారు. శనివారం నిందితుడు విదేశాల నుండి తిరిగి హైదరాబాద్ వస్తున్నాడనే సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అలర్ట్ అయ్యారు. అతడు ఫ్లైట్ దిగి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు రాగానే రికార్డులను తనిఖీ చేసి నిర్బంధించారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.
ఇంకా చాలా మంది బాధితులు ఉండే అవకాశం..
ఈ ఎన్నారై పూజారి రామ లచ్చారావు కేవలం ఒక్కరినే కాకుండా, ఆధ్యాత్మికత పేరిట ఇలాంటి మోసాలకు చాలా మందిని మోసం చేసి ఉంటాడని ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించాయి. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తే మరిన్ని సంచలన నిజాలు మరియు ఈ కేటుగాడి బ్యాంకుని ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. విదేశాలలో ఉండే ఎన్నారైలు, హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈయన పెద్ద ఎత్తున నెట్‌వర్క్ నడికు ఖాతాల వివరాలు, బాధితుల సంఖ్య బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
నకిలీ బాబాలు, పూజారులను నమ్మొద్దు.. పోలీసుల హెచ్చరిక
ఈ అరెస్ట్ అనంతరం బాచుపల్లి పోలీసులు ప్రజలకు కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆన్‌లైన్ పూజారులు , ఆధ్యాత్మిక వైద్యుల మాయమాటలు నమ్మి భారీగా డబ్బులు సమర్పించుకోవద్దని కోరారు. ఎవరైనా ప్రత్యేక పూజల పేరిట మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసినా లేదా లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసినా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. రామ లచ్చారావు చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని శాంతిభద్రతల అధికారులు స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















