అన్వేషించండి

Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్

Anakapalle ACB Raids: అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో క్వారీ లీజు కోసం రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ఏసీబీకి పట్టుబడ్డారు. 2018 తర్వాత రెండోసారి ఏసీబీకి దొరికిన వైనం.

5 Lakh Bribe ACB Trap Anakapalle: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా గనుల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ  అధికారులు గురువారం సంచలన దాడి నిర్వహించారు. క్వారీ లీజు దరఖాస్తును ప్రాసెస్ చేసి అనుమతులు మంజూరు చేయడానికి ఓ బాధితుడి నుంచి ఏకంగా రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా పారదర్శక పరిపాలన అందించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ, క్రింది స్థాయి అధికారుల అక్రమార్జన వేధింపులు కొనసాగుతుండటానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.                 

ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్. రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలోని సర్వే నంబర్ 211లో గల 2 హెక్టార్ల క్వారీ లీజు కోసం తుమ్మపాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గనుల శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తుకు సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసి అప్రూవల్ ఇప్పించేందుకు సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ మొత్తం రూ. 15 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు. అధిక మొత్తంలో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ నెల 4వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. 

బాధితుడి ఫిర్యాదును ప్రాథమికంగా విచారించి నిజమని నిర్ధారించుకున్న ఏసీబీ బృందం పక్కా వ్యూహంతో ఉచ్చు బిగించింది. గురువారం నాడు అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో సర్వేయర్ మురళీకృష్ణ అడ్వాన్స్‌గా రూ. 5 లక్షల లంచం సొమ్ము తీసుకుంటుండగా, ఏసీబీ అదనపు ఎస్పీ ఎస్.ఆర్. హర్షిత , డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితుడి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని, రసాయన పరీక్షల ద్వారా ఆధారాలను సేకరించారు.             

అవినీతికి అలవాటుపడిన ఈ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో 2018లో విశాఖపట్నం మైన్స్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలోనే రూ. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ కేసు ఇంకా న్యాయస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, అనకాపల్లి కార్యాలయంలో పోస్టింగ్ పొంది మళ్లీ అదే తరహాలో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేస్తూ రెండోసారి ఏసీబీకి దొరికిపోవడం స్థానికంగా ,  శాఖాపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.                                         

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. కాగా, ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్‌పై కేసు నమోదు చేసి, అనకాపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడితో జిల్లాలోని పలు శాఖల అధికారుల్లో కలకలం రేగింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget