అన్వేషించండి

Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!

Rayalaseema Water Supply : పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్ర పర్యావరణ శాఖ. ఈఏసీ అభ్యంతరాలు, తెలంగాణ-ఒడిశా వివాదాలతో ఈ నిర్ణయం తీసుకుంది.

Godavari Water Disputes Tribunal Award: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పోలవరం–బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల అంచనాల కమిటీ షాక్ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పర్యావరణ అనుమతుల  ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. గోదావరి నది నుంచి పెన్నా బేసిన్‌కు నీటిని తరలించేలా రూ. 81,900 కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన చేసిన ఈ డ్రీమ్ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే నిలిచిపోవడం రాష్ట్ర జలవనరుల శాఖకు తీవ్ర ప్రతిబంధకంగా మారింది. 

చట్టపరమైన చిక్కులతో తిరస్కరణ         

ఈ ప్రతిపాదనను తిరస్కరించడానికి ప్రధానంగా అంతర్రాష్ట్ర వివాదాలు, చట్టపరమైన చిక్కులే కారణమని ఈఏసీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు డిజైన్ 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకుంది. గోదావరి వరద జలాల మళ్లింపు వల్ల ఎగువన ఉన్న తెలంగాణతో పాటు, ముంపు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందంటూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రయోజన దెబ్బతింటాయన్న అభ్యంతరాలు వచ్చాయి. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుపై ముందుగా సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది.           

శాస్త్రీయంగా అధ్యయనానికి సూచన           

వరద జలాల లభ్యతపై కేంద్ర జల సంఘం  ద్వారా శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. గోదావరి బేసిన్‌లో అసలు మిగులు జలాలు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయో సవివరమైన నివేదిక రూపొందించాలని పేర్కొంది. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రాలతో ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాలను సంప్రదింపుల ద్వారా లేదా చట్టబద్ధ వేదికలపై పరిష్కరించుకున్న తర్వాతే, పర్యావరణ అనుమతుల కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.      

సముద్రంలో కలసిపోతున్న నీటిని వాడుకుంటామన్న ఏపీ         

 సముద్రంలో వృథాగా కలిసిపోతున్న గోదావరి వరద నీటిలో దాదాపు 200 టీఎంసీలను రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల కరవు ప్రాంతాలకు మళ్లించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీనిద్వారా దాదాపు 80 లక్షల మంది ప్రజలకు సురక్షిత తాగునీరు లభించడమే కాకుండా, 3 లక్షల హెక్టార్ల  దాదాపు 7.41 లక్షల ఎకరాలు  కొత్త ఆయకట్టుకు సాగునీరు అందగలదని, మరో 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.       

తాత్కలికంగా బనకచర్లకు బ్రేక్                

కేంద్రం నుంచి వచ్చిన ఈ సాంకేతిక, చట్టపరమైన ప్రతిబంధకంతో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే, సిడబ్ల్యూసితో కలిసి వరద నీటి లభ్యత గణాంకాలను పక్కాగా సిద్ధం చేయడం, అంతర్రాష్ట్ర అభ్యంతరాలకు సంబంధించి న్యాయపరమైన వివరణలు ఇవ్వడం ద్వారా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ జలవనరుల శాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

AP MPTC ZPTC Election Results Live Updates: ఏపీ పరిషత్ ఫలితాలు.. పులివెందులలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గెలుపు
ఏపీ పరిషత్ ఫలితాలు.. పులివెందులలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గెలుపు
Nara Lokesh: మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
మృత్యుంజయురాలు గోపిక - రాప్తాడు బాధితురాలి కోసం స్వయంగా లోకేశ్ వైద్య పర్యవేక్షణ !
AP MPTC ZPTC Elections Counting: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. కొన్ని గంటల్లో ఫలితాలు
ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. మరికొన్ని గంటల్లో ఫలితాలు
YS Jagan AP Local Body Elections: సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?
సమరం మధ్యలో షాకింగ్ కామెంట్స్ - పల్లెల్లో పోరాడుతున్న క్యాడర్‌కు నిరాశ - జగన్ తొందపడుతున్నారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Bigg Boss Kalyan Padala Movie : బిగ్ బాస్ విన్నర్ కల్యాణ్ పడాల హీరోగా కొత్త మూవీ - హారర్ కామెడీ జానర్‌లో 'ఫన్'
బిగ్ బాస్ విన్నర్ కల్యాణ్ పడాల హీరోగా కొత్త మూవీ - హారర్ కామెడీ జానర్‌లో 'ఫన్'
Driving Licence Rules: LLR ఉంది కదాని నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లలేరు.. లైసెన్స్‌ పొందాలంటే కొత్త నిబంధనలు ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఈ ఆరు వీడియోలు చూడకపోతే మీకు DL రాదు!
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
CM Revanth Reddy: 3 రోజులపాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.9100 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
3 రోజులపాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.9100 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
Embed widget