Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

Tirumala Ghat Road Accident | తిరుపతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండపై నుంచి కిందకు వస్తున్న ఓ కారు అదుపుతప్పి, 22వ మలుపు వద్ద ఉన్న పిట్టగోడను బలంగా ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భక్తులలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని కర్ణాటకకు చెందిన సతీష్ కుమార్‌గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో, అతనికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెంటనే తిరుపతిలోని స్విమ్స్ (SWIMS) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, వివరాలు సేకరిస్తున్నారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ట్రెండింగ్ వార్తలు























