డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టింది.

- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామాకు వైఎస్సార్‌సీపీ డిమాండ్.
- నిరుద్యోగులకు భృతి, కానిస్టేబుల్ పోస్టుల పెంపు వంటివి ప్రకటించాలని కోరింది.
- ఆగస్టు 7, 8న నిరాహార దీక్షలు, 10న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు.
- వైఎస్సార్‌సీపీ ఆందోళనలపై దాడులను బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.
YSRCP Protest On DSC Irregularities: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ప్రతినిధులో సమావేశమై పార్టీ అధినేత వైఎస్ జగన్, అభ్యర్థుల భవిష్యత్ కోసం తాము పోరాడతామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ -2025 నియామక ప్రక్రియలో అనే అవకతవకలు జరిగాయని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి మద్దతుగా నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు జగన్‌ను కలిశారు. ముఖ్యంగా డీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరుపై ఫలితాల్లో నెలకొన్న అస్పష్టతపై వారు ఫిర్యాదు చేశారు. నిరుద్యోగుల విన్నపాన్ని సానుకూలంగా స్వీకరించిన జగన్, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
తాడేపల్లి
— YSR Congress Party (@YSRCParty) August 6, 2026
పోలీస్ ఉద్యోగాల భర్తీపై వైయస్ జగన్‌ను కలిసిన విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ
కనీసం 10 వేల పోలీస్ పోస్టులు భర్తీ చేయాలి
అభ్యర్థుల వయోపరిమితి 35 ఏళ్లకు పెంచాలి
నిరుద్యోగులకు అండగా ఉంటాం.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: వైయస్ జగన్ భరోసా
తాడేపల్లి:
రాష్ట్రంలో… pic.twitter.com/kR4RF0HcrR
వైసీపీ ప్రధాన డిమాండ్‌లు ఇవే
ప్రభుత్వం ముందు వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ కీలకమైన డిమాండ్‌లు ఉంచింది. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరిపించాలి. ఈ విఫల్యానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నోటిఫికేషన్‌లో పదివేల పోస్టులు భర్తీ చేయాలి. పోలిస్ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35ఏళ్లకు పెంచాలి. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల భృతి ఇవ్వాలి. బకాయిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ గుండాల దాడులు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యలు: ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్
— YSR Congress Party (@YSRCParty) August 6, 2026
రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలు, యువత మరియు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన… pic.twitter.com/U8meWpbhuH
అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్‌ఆర్‌సీపీ భారీ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ రేపు(ఆగస్టు7,8) అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఆగస్టు 10న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ నెల 10 తర్వాత ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వైసీపీ నేతలు వెల్లడించారు.
టీడీపీ గుండాల దాడులు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యలు: ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్
— YSR Congress Party (@YSRCParty) August 6, 2026
రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలు, యువత మరియు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన… pic.twitter.com/U8meWpbhuH
మరోవైపు గురువారం పలు ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో అధికార పార్టీ నేతలు తమపై దాడులు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంపై దాడి చేశారని అన్నారు. టెంట్లు పీకడం, మహిలా కార్యకర్తలపై రాళ్లు, కోడిగడ్లు విసరడం వంటి ఘటనలను మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలో దాడులు జరగడం, నిరసనకారులనే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
డీఎస్సీ అక్రమాలపై ఈరోజు నిరసనలతో అట్టుడికిన రాష్ట్రం!🔥
— YSR Congress Party (@YSRCParty) August 6, 2026
వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీ నేతలతో కలిసి రిలే నిరాహార దీక్షలు చేపట్టిన డీఎస్సీ అభ్యర్థులు.. వారికి మద్దతుగా నిలిచిన GenZ
దీక్షలు చూసి ఓర్వలేక.. ఉద్యమం సాగుతున్న తీరుకు భయపడి దాడులకు టీడీపీ గూండాలను ఉసిగొల్పిన… pic.twitter.com/AyQikeT3kZ
యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పకుండా, @naralokesh రాజీనామా కోరుతున్న దీక్షా శిబిరాలపై టీడీపీ గూండాలు దాడి చేయడం చేతకానితనం కాదా? ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.#NaraLokeshMustResign#MegaDSCScam pic.twitter.com/yC0OIycGg4
— YSR Congress Party (@YSRCParty) August 6, 2026
Frequently Asked Questions
వైసీపీ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు నిరసన తెలుపుతోంది?
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ప్రధాన డిమాండ్లు ఏమిటి?
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
వైసీపీ నిరసన కార్యక్రమాలు ఎప్పుడు జరగనున్నాయి?
ఆగస్టు 7, 8 తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. ఆగస్టు 10న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తారు.
డీఎస్సీ కాకుండా వైసీపీ చేసిన ఇతర డిమాండ్లు ఏమిటి?
కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని, పోలీసు అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని, నిరుద్యోగ భృతి, బకాయిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















