విజయవాడ ముత్యాలంపాడులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరువర్గాల వాగ్వాదం తోపులాటకు దారితీసింది. స్థానికంగా భయానక వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.