ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7200పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో 15% సీట్లు ఆల్ ఇండియా కోటా కింద, మిగతా 85% సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది.
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్ కాలేజీల కటాఫ్ సంగతేంటీ?
AP NEET MBBS Cutoff Ranks:ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు నీట్ కటాఫ్ మార్కులు, ర్యాంకులపై పూర్తి అవగాహన అవసరం. లేకుంటే కన్ఫ్యూజ్ అవుతారు.

- ఆంధ్రప్రదేశ్‌లో 7200కు పైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- అఖిల భారత 15%, రాష్ట్ర 85% కోటా సీట్ల భర్తీ జరుగుతుంది.
- ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కేటగిరీలవారీగా ర్యాంకు కటాఫ్‌లు మారతాయి.
- కొత్త కాలేజీల ఏర్పాటుతో కటాఫ్ ర్యాంకుల్లో సడలింపు లభిస్తుంది.
AP NEET MBBS Cutoff Ranks:వైద్యులుగా మారి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలలుకంటూ ఉంటారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ కౌన్సెలింగ్ తాజాగా ప్రారంభమైంది. అయితే చాలా మంది మదిలో ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. నాకు వచ్చిన ర్యాంకుకు ఏపీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందా? వస్తే ఏ కాలేజీలో రావచ్చు?. నిజానికి కటాఫ్ మార్కులు స్థిరంగా ఉండవు. ఏడాదికి ఏడాది మారిపోతూ ఉంటుంది. ప్రశ్నాపత్రంలో క్లిష్టత, అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు, రిజర్వేషన్ల ఆధారంగా మారుతుంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన కౌన్సెలింగ్‌లను ఆధారంగా ఒక అంచనాకు మాత్రం రావచ్చు.
ఏపీలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌్ సీట్లు ఎన్ని?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, సొసైటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో మొత్తం 7200పైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లు భర్తీ ప్రక్రియ ప్రధానంగా రెండు విభాగాల్లో జరుగుతుంది. మెడిక్ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా మొదట విధానంలో పదిహేను శాతం సీట్లు భర్తీ చేస్తారు. ఏపీలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఈ కోటా కింద సీటు రావాలంటే ఆల్ ఇండియా ర్యాక్ మూడు వేల నుంచి పన్నెండు వేల లోపు ఉండాలి.
మిగతా 85 శాతం సీట్లను విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది. లోకల్ అభ్యర్థులకు ఈ కోటా అత్యంత కీలకం.
టాప్ ఎంబీబీఎస్ ప్రభుత్వ కాలేజీలు ఏవీ?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీటు సాధించడం అంటే అత్యుత్తమ మెరిట్ ఉండాల్సిందే. రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా ఉన్న ఆంధ్రా మెడిక్ కాలేజ్‌లో సీటు సాధించాలి అంటే 1700 నుంచి 9700 ర్యాంకు ఉండాలి. గుంటూరు మెడిక్ కాలేజ్‌లో సీటు కోసం 2300 నుంచి 12000 లోపు ర్యాంకు ఉన్న వారికి ఛాన్స్ ఉంటుంది. కర్నూలు మెడికల్ కాలేజ్‌లో చేరాలీ అంటే 7100 నుంచి 17,700 మధ్య ర్యాంక్ సాధించాలి. శ్రీవెంటకేశ్వర మెడికల్ కాలేజ్‌లో సీటు కోసం 11,500నుంచి 27, 600 మధ్య ర్యాంక్ సాధించిన వారికి ప్రవేశం లభిస్తుంది.
కేటగిరీల వారీగా సేఫ్ ర్యాంక్ ఎంత?
రిజర్వేషన్ల ఆధారంగా సీటు దక్కే అవకాశాలు మారుతూ ఉంటాయి. అభ్యర్థుల అవగాహన కోసం ప్రాథమిక అంచనాలు మాత్రమే చెప్పగలం. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ 15000నుంచి 35000 మధ్య ఉంటే ప్రభుత్వం కాలేజీల్లో సీటు గ్యారంటీగా వస్తుంది. బీసీ కేటగిరీ అభ్యర్థులకు 20వేల నుంచి 45వేల మధ్య ర్యాంకు ఉంటే సీటు ఖాయంగా చెప్పవచ్చు. ఎస్సీ అభ్యర్థులకు 50వేల నుంచి లక్ష వరకు ర్యాంకు వస్తే సీటు దక్కుతుంది. ఎస్టీ అభ్యర్థులకు 80వేల నుంచి లక్షా యాభైవేల వరకు ఛాన్స్ ఉంటుంది.
కొత్త మెడికల్ కాలేజీల ప్రభావం ఎంత?
గడిచిన కొద్ది కాలంలో ఏపీ ప్రభుత్వం కొత్త కాలేజీలను ఏర్పాటు చేసింది. దీని వల్ల మొత్తం సీట్ల సంఖ్య పెరిగి కటాఫ్ ర్యాంకుల్లో సుమారు రెండు వేల నుంచి ఐదు వేల వరకు ర్యాంకుల సడలింపు లభిస్తుంది. మధ్యస్థ ర్యాంకులు సాధించిన వారికి ఊరటగా చెప్పవచ్చు.
ప్రైవేటు కాలేజీల్లో సీట్ల విభజన
ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాని వారికి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు దక్కవచ్చు. ఇక్కడ మూడు కేటగిరీలు ఉంటాయి. ఇందులో యాభై శాతం సీట్లు భర్తీ చేసే ఏ కేటగిరీ కోటా సీట్ల కోసం 35వేల నుంచి 70వేల ర్యాంకు వచ్చిన వారు పోటీ పడతారు. 35 శాతం సీట్లు భర్తీ చేసే మేనేజ్‌మెంట్ కోటాలో 1.5లక్షల నుంచి 2.5 లక్షల ర్యాంక్ ఉన్న అభ్యర్థుల వరకు ఇక్కడ పోటీ పడవచ్చు. మూడోది సీ కేటగిరీ. అర్హత కలిగిన నీట్ స్కోర్ ఉండి, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్‌షిప్ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.
ఎంబీబీఎస్ సీటు సాధించం అనేది ఒక మైలు రాయి మాత్రమే. సరైన కాలేజీ ఎంపిక మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అభ్యర్థులు తమ ర్యాంకులకు అనుగుణంగా వాస్తవిక దృక్పథంతో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి.
Frequently Asked Questions
ఏపీలో మొత్తం ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా భర్తీ చేస్తారు?
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు పొందడానికి వివిధ కేటగిరీలకు సురక్షితమైన ర్యాంకులు ఎంత ఉండాలి?
ఓపెన్ కేటగిరీకి 15000-35000, బీసీకి 20000-45000, ఎస్సీకి 50000-1 లక్ష, ఎస్టీకి 80000-1.5 లక్ష ర్యాంకు ఉంటే ప్రభుత్వ కాలేజీలో సీటు దక్కే అవకాశం ఉంది.
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు వల్ల కటాఫ్ ర్యాంకులపై ప్రభావం ఎంత ఉంటుంది?
కొత్త కాలేజీల వల్ల మొత్తం సీట్ల సంఖ్య పెరిగి, కటాఫ్ ర్యాంకుల్లో సుమారు రెండు వేల నుంచి ఐదు వేల వరకు సడలింపు లభిస్తుంది. ఇది మధ్యస్థ ర్యాంకులు సాధించిన వారికి ఊరటనిస్తుంది.
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ల విభజన ఎలా ఉంటుంది?
ప్రైవేటు కాలేజీల్లో సీట్లు మూడు కేటగిరీలుగా ఉంటాయి. 50% ఏ కేటగిరీ, 35% మేనేజ్‌మెంట్ కోటా (బి కేటగిరీ) మరియు ఎన్ఆర్ఐ స్పాన్సర్‌షిప్ ఉన్నవారికి సి కేటగిరీ సీట్లు ఉంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















