అన్వేషించండి

Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?

Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? పీజీ కోర్సుల ఎంపిక, ఫీజుల వివరాలు ఎలా ఉంటాయో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎంబిబిఎస్ తర్వాత ఎండీ, ఎంఎస్, డీఎన్బీ మార్గాలున్నాయి.
  • ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు, స్టైఫండ్లు విభిన్నం.
  • పీజీ డిప్లొమా, సూపర్ స్పెషలైజేషన్, విదేశీ అవకాశాలు కలవు.
  • వ్యక్తిగత ఆసక్తి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా సరైన మార్గం ఎంచుకోవాలి.

Career Options After MBBS in Telugu: వైద్య విద్యలో ఎంబిబిఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా పుచ్చుకోవడం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. ఒకప్పుడు ఎంబిబిఎస్‌ పూర్తి చేస్తే సమాజంలో గొప్ప గౌరవం, తక్షణ ఉపాధి లభించేవి. కానీ నేటి పోటీ ప్రపంచంలో ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ పెరుగుతున్న వేళ కేవలం ఒక జనరల్‌ ఫిజిషీయన్‌గా గుర్తింపు పొందడం సవాలుగా మారింది. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే స్పెషలైజేషన్ లేదా సూపర్‌ స్పెషలైజేషన్ తప్పనిసరిగా మారింది. వైద్య విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదుర్కొనే ప్రధాన ప్రశ్న ఏంటంటే? పీజీ చేయాలా లేదా డీఎన్బీ మంచిదా, విదేశాలకు వెళ్లి చదవాలా అనే డౌట్స్ చాలా ఉన్నాయి. 

పోస్టు గ్రాడ్యుయేషన్

మెజారిటీ వైద్య విద్యార్థులు తమ ఇంటర్న్‌షిప్ పూర్తి కాగానే ఎంచుకునే మార్గం ఎండీ లేదా ఎంఎస్‌.  ఈ కోర్సు పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ద్వారా సీట్లు కేటాయిస్తున్నారు. అయితే భవిష్యత్‌లో దీని స్థానంలో నెక్స్ట్‌ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. రోగులకు మందుల ద్వారా చికిత్స అందించే జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్‌‌ వంటివి ఎండీ కిందకు వస్తాయి. సర్జరీలు ప్రధానంగా ఆర్థోపెడిక్స్, గైనకాలజీ వంటివి ఎంఎస్‌ కిందకు వస్తాయి. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏడాదికి కేవలం 30 వేల నుంచి లక్షల రూపాయల లోపు ఫీజు ఉంటుంది. పైగా వీరికి నెలకు 50 వేల నుంచి 90 వేల వరకు స్టైఫండ్‌ వస్తుంది. ప్రైవేటు లేదా డీమ్డ్‌ యూనివర్శిటీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ధర ఏడాదికి 15 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు ఏడాదికి 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉండవచ్చు. మూడు ఏళ్ల కోర్సు పూర్తి అయ్యే సరికి ప్రైవేటు విద్యార్థులపై కోటిన్నర వరకు భారం వడొచ్చు. 

డీఎన్బీ అంటే ఏంటీ?

నేషనల్‌ బోర్డ్ ఆఫ్‌‌ ఎగ్జామినేషన్స్‌ నిర్వహించే డిప్లొమేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డు కోర్సులకు ప్రస్తుతం ఎండీ ఎంఎస్‌తో సమానమైన విలువ ఉంది. డీఎన్బీ కోర్సుల్లో అతి పెద్ద ప్లస్‌ పాయింట్ తక్కువ ఫీజు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏడాదికి 1,25,000 మాత్రమే ఫీజు ఉంటుంది. అలాగే విద్యార్థులకు నెలకు 45 వేల నుంచి 70వేల వరకు స్టైఫండ్ ఇస్తారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండటం వల్ల డీఎన్బీ విద్యార్థులకు క్లినికల్ ఎక్స్‌పోజర్, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ఎక్కువగా లభిస్తుంది. 

పీజీ డిప్లొమా, బ్రిడ్జ్‌ కోర్సులు 

తక్కువ సమయంలో పీజీ స్థాయి గుర్తింపు పొందాలనుకుంటే  రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్స్‌లు ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత రెండేళ్ల సెకండరీ డీఎన్బీ చేయడం ద్వారా పూర్తి స్థాయి పీజీ డిగ్రీని పొందే అవకాశం ఉంటుంది. ప్రైవేటు కళాశాలల్లో వీటి ఫీజు ఏడాదికి ఆరు లక్షల నుంచి 12 లక్ష వరకు ఉంటుంది. 

సూపర్‌ స్పెషలైజేషన్‌

వైద్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణులుగా ఎదగాలంటే సూపర్ స్పెషలైజేషన్ తప్పనిసరి, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ వంటి విభాగాలు ఇందులో ఉంటాయి. దీని కోసం ఎండీ, ఎమ్మెస్‌ పూర్తి చేసిన వారు నీటి ఎస్‌ఎస్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్‌ నుంచి సూపర్ స్పెషలిస్ట్‌ అయ్యే సరికి ఒక డాక్టర్ వయసు 30 నుంచి 32 ఏళ్లు వస్తుంది. కోర్సు పూర్తి అయిన తర్వాత వీరి ప్రారంభ జీతం నెలకు 2.5 లక్షల నుంచి 5 లక్షలపైబడే ఉంటుంది. 

అంతర్జాతీయ అవకాశాలు 

భారతీయ వైద్యులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అమెరికాలో స్థిరపడాలనుకునే వారు యూఎస్‌ఎంఎల్‌ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీని ప్రిపరేషన్‌, పరీక్షల కోసం పది లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. బ్రిటన్ వెళ్లాలనుకునే వారు ప్లాబ్‌ పరీక్ష ద్వారా ఎన్‌హెచ్‌ఎస్‌లో వైద్యాధికారిగా చేరవచ్చు. 

ఎంబిబిఎస్‌ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలనేది కేవలం ర్యాంకుపైనే కాకుండా, వ్యక్తిగ ఆసక్తి, కుటుంబ ఆర్థిక పరిస్థితి, మనం కేటాయించగలిగే సమయంపై ఆధారపడి ఉండాలి. ప్రైవేటు సీట్ల కోసం భారీగా అప్పులు  చేసే ముందు, ఆ పెట్టుబడికి తగిన ప్రతిఫలం ఎంత కాలంలో వస్తుందో బేరీజు వేసుకోవడం డాక్టర్లకు, వారి కుటుంబాలకు ఎంత ముఖ్యం. 

Frequently Asked Questions

ఎంబీబీఎస్ తర్వాత సాధారణంగా ఎంచుకునే పీజీ మార్గాలు ఏమిటి?

ఎంబీబీఎస్ తర్వాత మెజారిటీ విద్యార్థులు ఎండీ లేదా ఎంఎస్ కోర్సులను ఎంచుకుంటారు. ఈ కోర్సులు పూర్తి చేయడానికి మూడేళ్లు పడుతుంది మరియు నీట్ పీజీ పరీక్ష ద్వారా సీట్లు కేటాయిస్తారు.

డీఎన్బీ (DNB) కోర్సు అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏంటి?

డీఎన్బీ అనేది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే కోర్సు, ఇది ఎండీ/ఎంఎస్‌తో సమానమైన విలువ కలిగి ఉంటుంది. తక్కువ ఫీజు, స్టైఫండ్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో మంచి క్లినికల్ ఎక్స్‌పోజర్ దీని ముఖ్య ప్రయోజనాలు.

వైద్య రంగంలో సూపర్ స్పెషలైజేషన్ అంటే ఏమిటి?

సూపర్ స్పెషలైజేషన్ అంటే కార్డియాలజీ, న్యూరాలజీ వంటి అత్యున్నత విభాగాలలో నిపుణులుగా మారడం. ఇది ఎండీ/ఎంఎస్ తర్వాత నీట్ ఎస్‌ఎస్‌ పరీక్ష ద్వారా చేయబడుతుంది. దీని తర్వాత అధిక జీతాలు ఉంటాయి.

ఎంబీబీఎస్ తర్వాత విదేశాల్లో వైద్య వృత్తి చేపట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?

అమెరికాలో స్థిరపడాలంటే యూఎస్‌ఎంఎల్‌ఈ పరీక్షలు రాయాలి. బ్రిటన్‌లో వైద్యాధికారిగా చేరాలంటే ప్లాబ్‌ పరీక్ష ద్వారా అవకాశం ఉంటుంది.

ఎంబీబీఎస్ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవడానికి ఏ అంశాలను పరిగణించాలి?

కోర్సు ఎంపిక కేవలం ర్యాంకుపైనే కాకుండా, వ్యక్తిగత ఆసక్తి, కుటుంబ ఆర్థిక పరిస్థితి, కేటాయించగలిగే సమయంపై ఆధారపడి ఉంటుంది. భారీగా అప్పులు చేసే ముందు పెట్టుబడికి తగిన ప్రతిఫలం బేరీజు వేసుకోవాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget