అన్వేషించండి

Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన

Inter Student Commits Suicide | లెక్చరర్ అవమానించడంతో గద్వాల జిల్లా కొత్తపల్లిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జిల్లా సెకండ్ ర్యాంకర్ నేతిబొట్టు తరుణ్ (17) అనే విద్యార్థి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జోగులాంబ గద్వాల విద్యార్థి తరుణ్ ఇంటర్ ఫస్టియర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
  • లెక్చరర్ మార్కులపై అవమానం, చెంపదెబ్బతో తరుణ్ తీవ్ర మనస్తాపం చెందాడు.
  • లెక్చరర్‌పై చర్యలు కోరుతూ తరుణ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య.

గద్వాల: అతడు చదువుల్లో టాపర్. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ స్కోర్ చేసిన విద్యార్థికి ఇంటర్ ఫస్టియర్‌లో జిల్లాలో రెండో ర్యాంక్ వచ్చింది. కానీ లెక్చరర్ చేసిన తీవ్ర అవమానాన్ని తట్టుకోలేక ఓ టాలెంట్ ఉన్న ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లిలో చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) అనే విద్యార్థి గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బైపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు.


Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన

నువ్వేమైనా మంత్రి కుమారుడివా..

ఈ క్రమంలో కాలేజీలో ఓ మహిళా లెక్చరర్ 435 మార్కులు సాధించగా.. మరొక విద్యార్థితో తరుణ్‌ను పోలుస్తూ, ‘434 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా? నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఉన్నారంటూ’ మిగతా విద్యార్థుల ముందే కించపరిచింది. అలా అందరి ముందు నిరుత్సాహపరచడం, అవమానించడం కరెక్ట్ కాదని తరుణ్ ఆమెకు విజ్ఞప్తి చేశాడు. దాంతో విచక్షణ కోల్పోయిన ఆ లెక్చరర్.. "నువ్వేమైనా మంత్రి కొడుకువా? అంతకంటే గొప్పోడివా?" అంటూ తరుణ్ చెంపపై కొట్టి తీవ్రంగా అవమానించినట్లు ఆరోపణలు ఉన్నాయి.


Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన

ఇలా ఎవరికీ జరగకూడదు..

లెక్చరర్ ప్రవర్తనకు తోటి విద్యార్థులందరూ నవ్వడంతో తరుణ్ తీవ్ర ఆవేదనకు, మనోవేదనకు గురయ్యాడు. 2 రోజుల పాటు తీవ్రంగా కలత చెందిన తరుణ్ మంగళవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టీచర్లు, లెక్చరర్లు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప ఇలా అవమానించకూడదని, సున్నిత స్వభావం ఉన్న ఉన్న వారికి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆ లెక్చరర్‌కు తెలియాలని తన సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయం ప్రజలందరికీ తెలియాలనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

Frequently Asked Questions

కొత్తపల్లిలో జరిగిన విషాద ఘటన ఏమిటి?

గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి నేతిబొట్టు తరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్ అవమానించడం వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఎవరు? అతని చదువులో ప్రతిభ ఎలా ఉంది?

ఆ విద్యార్థి పేరు నేతిబొట్టు తరుణ్ (17). అతను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 440కి 434 మార్కులు సాధించి జిల్లాలో రెండో ర్యాంక్ సాధించాడు.

తరుణ్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణం ఏమిటి?

కళాశాలలోని ఓ మహిళా లెక్చరర్ అందరి ముందు అవమానించి, చెంపదెబ్బ కొట్టడం వల్లే తరుణ్ తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

లెక్చరర్ తరుణ్‌ను ఎలా అవమానించారు?

ఆమె తరుణ్‌ను మరో విద్యార్థితో పోల్చి, '434 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా?' అని కించపరిచింది. ఆ తర్వాత 'నువ్వేమైనా మంత్రి కొడుకువా?' అంటూ చెంపదెబ్బ కొట్టింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget