అన్వేషించండి

Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?

Council: అచ్చెన్నాయుడు చేసిన క్రిస్టియన్ వ్యాఖ్యలు మండలిలో వివాదం రేపాయి. మండలి చైర్మన్ ను క్రిస్టియన్ గా అచ్చెన్న సంబోధించారు. అయితే తాను హిందువునని మోషేన్ రాజు స్పష్టం చేశారు.

Atchannaidu Christian comments spark controversy in the council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరిగిన చర్చ తీవ్ర ఉత్కంఠకు, అనూహ్య పరిణామాలకు దారితీసింది.  శాసన మండలిలో కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్న చర్చను వైసీపీ సభ్యులు అడ్డుకోవడంపై ఆయన ఆవేదన చెందారు. తాను ఇక్కడ మంత్రిగా కంటే, ఒక సామాన్య వేంకటేశ్వర స్వామి భక్తునిగా మాట్లాడుతున్నానని, కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.      

ఎవరి మతాలను వారు గౌరవించుకోవడంలో తప్పు లేదన్న అచ్చన్న                                
 
ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇతర మతాలను గౌరవించాలని హితవు పలికారు.  నేను హిందువును, జగన్ మోహన్ రెడ్డి ,  చైర్మన్ మోషేన్ రాజు క్రిస్టియన్లు.. ఎవరి మతం వారి ఇష్టం, ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా కలకలం రేపాయి. తనను క్రిస్టియన్‌గా అభివర్ణించడంపై మండలి చైర్మన్ మోషేన్ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.                             

తాను హిందువునని ప్రకటించిన  మోషేన్ రాజు                          
 
మంత్రి వ్యాఖ్యలకు స్పందించిన చైర్మన్ మోషేన్ రాజు తాను క్రిస్టియన్‌ను కాదని, హిందువునని సభలో స్పష్టమైన ప్రకటన చేశారు. తన పేరులో మోషేన్ ఉన్నంత మాత్రాన మతం మార్చుకున్నట్టు కాదని ఆయన వివరించారు. చైర్మన్ నుంచి వచ్చిన ఈ స్పష్టీకరణతో మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తెలియక చేసిన పొరపాటుగా భావించాలని కోరారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ, వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించడం ఆపలేదు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.            

అయినా వైసీపీ సభ్యులు నిరసనలు ఆపకపోవడతో సభ వాయిదా 

ఈ తరుణంలో చైర్మన్ మోషేన్ రాజు వైసీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివరణతో తాను సంతృప్తి చెందానని, వ్యక్తిగతంగా తనకే లేని అభ్యంతరం మీకు ఎందుకని ఆయన  వైసీపీ  సభ్యులనే ప్రశ్నించారు. అయినా వైసీపీ సభ్యులు ఆందోళనలు కొనసాగించారు.  లడ్డూ కల్తీపై జరగాల్సిన చర్చ కాస్తా మతపరమైన అంశాల చుట్టూ తిరగడం సభలో చర్చనీయాంశమైంది. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, చైర్మన్ స్వయంగా జోక్యం చేసుకుని సభ్యులను వారించడంతో గొడవ సద్దుమణిగింది.             

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget