ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసన మండలి వేదికగా ఒక ఆసక్తికరమైన పోరు మొదలైంది.
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Andhra Pradesh Latest News: వైసీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు సభ్యులు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్‌లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తమ పదవులకు ఇప్పటికే రాజీనామా చేశారు.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి వేదికగా ఒక ఆసక్తికరమైన పోరు మొదలైంది. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉండి, ఇప్పుడు బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు నేరుగా మండలి ఛైర్మన్‌పైనే యుద్ధం ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఇప్పుడు మండలి ఛైర్మన్ మోషేనురాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తమ రాజీనామాలను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారనే ఆగ్రహంతో ఉన్న ఈ సభ్యులు, ఛైర్మన్ తీరును నిరసిస్తూ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఎందుకు అసంతృప్తి
వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు సభ్యులు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్‌లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తమ పదవులకు ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలు సమర్పించి చాలా కాలం అవుతున్నా, మండలి ఛైర్మన్ వాటిని ఇంకా ఆమోదించలేదు. ఛైర్మన్ అనుసరిస్తున్న ఈ వైఖరిపై సదరు ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజీనామాలు ఆమోదించకుండా కావాలనే పెండింగ్ పెండింగ్‌లో పెట్టారనేది వారి ప్రధాన ఆరోపణ. అందుకే ఆయనపై అవిశ్వాసం పెట్టి, తమ నిరసనను గట్టిగా తెలియజేయాలని వారు భావిస్తున్నారు.
కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే కాకుండా, మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సరిపడా సంఖ్యాబలం తమకు ఉందని ఈ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ దిశగా ముందుడుగు వేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేని వింగా మండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం వచ్చే పరిస్థితి ఏర్పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వైసీపీ ఫిర్యాదుతో ఛైర్మన్ విచారణ
మరోవైపు ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ ఆదేశాలను దిక్కరించినందున వారిపై అనర్హ వేటు వేయాలని వైసీపీ కోరుతోంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఛైర్మన్ మోషేన్ రాజు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు ఎందుకు రాజీనామా చేశారు. వారిపై ఎవరైనా ఒత్తిడి చేశారా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్సీలు స్పష్టత
ఛైర్మన్ జరిపిన విచారణలో బల్‌లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ తమ వాదనను బలంగా వినిపించారు. తాము ఎవరి ఒత్తిడినో లేదా వేరే ప్రలోభాలు లొంగి రాజీనామా చేయలేదని, తమకు నచ్చిన విధంగా స్వతహాగానే పదవుల నుంచి తప్పుకుంటున్నామని వారు తెలిపారు. అయినప్పటికీ వారి రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో ఇప్పుడు అవిశ్వాసం అనే అస్త్రాన్ని వారు సిద్ధం చేసుకున్నారు.
Frequently Asked Questions
శాసన మండలిలో ఆసక్తికరమైన పోరు ఎక్కడ మొదలైంది?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ మోషేను రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఎమ్మెల్సీలు ఎందుకు మండలి ఛైర్మన్ పై అసంతృప్తిగా ఉన్నారు?
తమ రాజీనామాలను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారనే ఆగ్రహంతో ఎమ్మెల్సీలు ఛైర్మన్ తీరును నిరసిస్తూ ఈ నిర్ణయానికి వచ్చారు.
మండలి ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎంతమంది ఎమ్మెల్సీలు మొగ్గు చూపుతున్నారు?
కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే కాకుండా, మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలి ఛైర్మన్ కు ఏమని ఫిర్యాదు చేసింది?
ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, వారిపై అనర్హ వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది.























