విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి

Vijayawada Crime News | విజయవాడ కృష్ణ లంక పరిధిలోని మెట్లబజారు వద్ద గల పద్మావతి ఘాట్ వద్ద విషాదం చోటు చేసుకుంది. కృష్ణ నదిలో ఈతకు దిగిన ముగ్గురు చిన్న పిల్లలు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన పిల్లలను కృష్ణ లంక ఇంద్ర కాలనీ ప్రాంతానికి చెందిన తిగుళ్ల తేజ, గడ్డం జాషువా, వీసాం గౌతమ్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కృష్ణ లంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపు శ్రమించిన గజ ఈతగాళ్లు నదిలో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం వీరి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు చనిపోవడంతో ఇంద్ర కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ట్రెండింగ్ వార్తలు























