అన్వేషించండి

Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!

ఏపీ రైల్వే ప్రయాణంలో కీలక మార్పులు రానున్నాయి. విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన సిద్ధమవుతోంది. దీంతోపాటు విజయవాడ నుంచి కర్నూలుకు రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్ రైలు కారిడార్ ప్రతిపాదన, ప్రయాణ సమయం తగ్గింపు.
  • విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు, రెండు గంటల్లో చేరుకునే సౌకర్యం.
  • శ్రీశైలం, గద్వాల్, అనంతపురం, దుగరాజపట్నం పోర్టులకు కొత్త రైల్వే లైన్లు ప్రతిపాదన.

Vijayawada- Visakha High Speed Rail: ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, మారుమూల ప్రాంతాలకు, పుణ్య క్షేత్రాలకు రైలు సౌకర్యం కల్పించేలా రైల్వే శాఖ ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా బులెట్ రైళ్లు, సమీ హైస్పీడ్‌ రైళ్లు, కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైనల్‌ లొకేషన్ సర్వే కోసం రైల్వే అధికారులు బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభంకానున్నాయి. 

విజయవాడ - విశాఖ మధ్య హైస్పీడ్ ప్రయాణం

రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ, విశాఖ మధ్య ప్రయాణం ఇకపై మరింత వేగంగా సాగనుంది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్‌ను రైల్వే శాఖ ప్రతిపాదించింది. సుమారు 350 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కారిడార్‌ ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఈ రైలు అందుబాటులోకి వస్తే గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, అమరావతి- విజయవాడ- విశాఖ ప్రాంతాలను కలుపుతూ, భవిష్యత్తులో హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్‌కు అనుసంధానంకానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్‌ కారిడార్లను కేంద్రం ప్రకటించగా అందులో ఏపీ మీదుగా వెళ్లే హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్‌- బెంగళూరు, చెన్నై - బెంగళూరు కారిడార్లతో ఇప్పుడు నాలుగో కారిడార్‌ కూడా చేరనుంది. 

విజయవాడ నుంచి కర్నూలు రెండు గంటల్లోనే...

రాయలసీమ, కోస్తా ఆంధ్రను కలిపే కీలక మార్గంలో కూడా భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి కర్నూలుకు నేరుగా వెళ్లే రైలు సౌకర్యం లేదు. ప్రయాణికులు డోన్ లేదా నంద్యాల వద్ద రైలు దిగి మరో రైలు ఎక్కాల్సి వస్తోంది. ఈ  ఇబ్బందులు తొలగిస్తూ విజయవాడ- కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్‌ను ప్రతిపాదించారు. ఈ కొత్త లైన్ గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా సుమారు 350 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి భవిష్యత్‌లో విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు, సాధారణ ప్రయాణికులకు ఒక గొప్ప వరంగా మారనుంది. 

మల్లన్న దర్శనానికి రైలు మార్గం

కోట్లాది మంది భక్తులు సందర్శించే శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైలు మార్గం ఉండాలనే దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీని వల్ల అటు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు ఇటు మార్కాపురం వైపు నుంచి వచ్చే వారికి శ్రీశైలానికి నేరుగా రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు 184కిలోమీటర్ల కొత్త లైన్ ద్వారా తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీ నౌకాశ్రయాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది. నెల్లూరు నుంచి రాజంపేట వైపు వెళ్లాలంటే రేణిగుంట మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. అలా కాకుండా 120 కిలోమీటర్ల నేరుగా కొత్త లైన్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, రవాణాకు ఉపయోగపడేలా 150కిలోమీటర్ల మేర ఈ లైన్ ప్రతిపాదించారు. 58 కిలోమీటర్ల కళ్యాణదుర్గం- అనంతపురం మధ్య రైల్వే లైన్ పూర్తి అయితే రాయదుర్గం నుంచి అనంతపురానికి నేరుగా రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. గూడూరు నుంచి దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్‌ పోర్టుకు, అక్కడ నిర్మించబోయే షిప్ బిల్డింగ్‌ యూనిట్‌కు రైల్వే రైన్ కోసం మళ్లీ సర్వే చేయనున్నారు. 

Frequently Asked Questions

విజయవాడ - విశాఖపట్నం మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ ఎంత దూరం ఉంటుంది?

ఈ కారిడార్ సుమారు 350 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

విజయవాడ నుండి కర్నూలుకు సెమీ హైస్పీడ్ రైలుతో ఎంత సమయంలో చేరుకోవచ్చు?

సెమీ హైస్పీడ్ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి, భవిష్యత్తులో విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు.

శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ప్రతిపాదించారు?

హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి అధికారులు ప్రతిపాదించారు.

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget