చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల అణచివేత కోసం హైడ్రా (HYDRA) వ్యవస్థ కచ్చితంగా ఉండాల్సిందేనంటూ స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ తమ్మడి కుంట చెరువు వద్ద హైడ్రాకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. చెరువులను కాపాడుకోవడానికి హైడ్రా చర్యలు ఎంతో అవసరమని, ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములను రక్షించాలని నినాదాలు చేశారు.