అన్వేషించండి

ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: జనం ఈ కంపెనీ కార్లను తెగ కొన్నారు, డిమాండ్‌ కూడా పెరిగింది

ఫిబ్రవరి 2026లో దేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 25% పెరిగాయి. టాటా మోటార్స్ మహీంద్రాను తక్కువ తేడాతో అధిగమించి రెండో స్థానం దక్కించుకుంది. పూర్తి సేల్స్ రిపోర్ట్ ఇక్కడ తెలుసుకోండి.

 February 2026 Car Sales India: ఫిబ్రవరి 2026లో దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 3,70,616 వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయి. గత సంవత్సరం ఇదే నెల (2025 ఫిబ్రవరి)లో ఈ నంబర్‌ 2,96,657 యూనిట్లు మాత్రమే ఉండగా, ఈసారి 25 శాతం పెరుగుదల కనిపించింది. అయితే నెలవారీగా చూస్తే చాలా బ్రాండ్లు జనవరిలో కంటే కొద్దిగా తగ్గుదల చూపించాయి.

మారుతీ సుజుకి ఆధిపత్యం కొనసాగింపు

Maruti Suzuki 1,53,604 యూనిట్లతో మళ్లీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే 28 శాతం వృద్ధి సాధించింది. మార్కెట్ షేర్ 41.4 శాతానికి పెరిగింది. SUV మోడళ్లతో పాటు హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కూడా కంపెనీ బలంగా నిలిచింది. Wagon R, Swift, Baleno వంటి మోడళ్లు టాప్ సెల్లర్స్‌గా నిలిచాయి. Dzire సెడాన్ కూడా ఆ నెలలో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా గుర్తింపు పొందింది.

టాటా మోటార్స్ రెండో స్థానం

Tata Motors ఫిబ్రవరిలో 50,654 యూనిట్లు విక్రయించింది. 43 శాతం వార్షిక వృద్ధితో, మహీంద్రాను అతి తక్కువ తేడాతో అధిగమించి రెండో స్థానాన్ని దక్కించుకుంది. Nexon (19,430 యూనిట్లు) & Punch (18,748 యూనిట్లు) అమ్మకాలు కంపెనీకి ప్రధాన బలం అయ్యాయి.

మహీంద్రా హోరాహోరీ పోటీ

Mahindra & Mahindra 49,900 యూనిట్లు విక్రయించి మూడో స్థానంలో నిలిచింది, ఫిబ్రవరిలో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. SUV తరహాలో ఉండే మోడళ్లపై ఈ కంపెనీ ఎక్కువగా ఆధారపడుతోంది. XUV 7XO, XEV 9S లాంటి కొత్త మోడళ్లు త్వరలో అమ్మకాలను మరింత పెంచే అవకాశముంది.

హ్యుందాయ్, టయోటా, కియా స్థిర వృద్ధి

Hyundai Motor India 45,213 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. Creta ఒక్కటే 17,938 యూనిట్లు విక్రయించి భారీ డిమాండ్ సంపాదించింది.

Toyota Kirloskar Motor 26,095 యూనిట్లు విక్రయించింది. Innova, Hyryder, Fortuner అమ్మకాలు కంపెనీకి బలం అయ్యాయి. Urban Cruiser EBella అనే కొత్త ఎలక్ట్రిక్‌ మోడల్ ధరలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Kia India 24,690 యూనిట్లతో 27 శాతం వృద్ధి సాధించింది. కొత్త తరం Seltos, Sonet మోడళ్లు మంచి డిమాండ్ పొందాయి.

ఇతర బ్రాండ్ల పరిస్థితి

Skoda Auto Volkswagen India కలిపి 7,578 యూనిట్లు విక్రయించాయి. Volkswagen Tayron R-Line మోడల్‌ను రూ. 46.99 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరకు విడుదల చేసింది.

JSW MG Motor India 4,957 యూనిట్లతో 24 శాతం వృద్ధి సాధించింది. Windsor EV మంచి అమ్మకాలు నమోదు చేసింది.

Honda Cars India మాత్రం 4,759 యూనిట్లతో 11 శాతం తగ్గుదల చూపించింది.

Renault India 3,240 యూనిట్లు విక్రయించి 27 శాతం వృద్ధి సాధించింది.

Nissan Motor India 1,616 యూనిట్లతో 7 శాతం తగ్గుదల నమోదు చేసింది.

మొత్తంగా చూస్తే ఫిబ్రవరి 2026లో కార్ల మార్కెట్ బలంగా పుంజుకుంది. ముఖ్యంగా SUV మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. టాటా–మహీంద్రాల మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారింది. రాబోయే నెలల్లో కొత్త మోడళ్ల ప్రభావంతో మార్కెట్ మరింత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?
E20 Petrol Dispute: E20 పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం.. ఎక్కువ ఇథనాల్‌ కలుపుతున్నారని, రిపేర్లు పెరిగాయని ఆరోపణ
E20 పెట్రోల్‌లో 31.2% వరకు ఇథనాల్? అనుమతించినదాని కంటే ఎక్కువే! అసలు వివాదం ఏమిటి?
204cc ఇంజిన్‌, 26hp పవర్‌తో Yamaha R2.. యూత్‌ స్పీడ్‌కు తగ్గ యాక్సిలరేషన్‌, బ్రేకింగ్‌ ఉన్నట్లేనా?
Yamaha R2పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌: 9 సెకన్లలోనే 0-100kph స్పీడ్‌, R15 కంటే బెటరేనా?
Driving Licence Rules: LLR ఉంది కదాని నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లలేరు.. లైసెన్స్‌ పొందాలంటే కొత్త నిబంధనలు ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఈ ఆరు వీడియోలు చూడకపోతే మీకు DL రాదు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget