Cars Under 10 lakh with 6 Airbags: రూ.10 లక్షల రేంజ్‌లో 6 ఎయిర్ బ్యాగ్స్‌తో సన్రూఫ్ కలిగిన కార్లు ఇవే
Cars under 10 lakh | భారత్‌లో రూ.10 లక్షల లోపు సన్రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడల్స్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Cars under 10 lakh with sunroof and 6 Airbags: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో పలు కంపెనీలు ఎప్పటికప్పుడూ కొత్త కారు మోడల్స్ తీసుకొస్తుంటాయి. వాటిలో కొన్ని కార్లలో సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని కార్లను తయారు చేస్తారు. అయితే ఇప్పుడు మార్కెట్‌లో సన్‌రూఫ్ సౌకర్యంతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కొన్ని కార్లు వచ్చాయి. ఈ అన్ని ఫీచర్లతో కూడిన కార్లు భారత మార్కెట్‌లో 10 లక్షల రూపాయల్లోనే లభిస్తున్నాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్ ఈ ధరల శ్రేణిలో ఉత్తమ మోడల్స్ కలిగి ఉన్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
హ్యుందాయ్ ఎక్స్‌టర్ 5 సీటర్ కారు. హ్యుందాయ్ కంపెనీ ఈ కారు 38 వేరియంట్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్‌టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.68 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 9.61 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో ప్రయాణికులు భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కారులో EBDతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చి ఇచ్చారు. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఈ కారులో సన్‌రూఫ్ కూడా ఉంది.
టాటా నెక్సాన్ (Tata Nexon)
భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. ఈ కారులో 60 వేరియంట్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,31,890 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ టాటా కారు గ్లోబల్ NCAP నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. టాటా నెక్సాన్ 10 లక్షల రూపాయల ధరలోనే ఉంది. ఈ కారులో సన్‌రూఫ్ సౌకర్యాన్ని అందించారు.
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
హ్యుందాయ్ వెన్యూ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ వెన్యూలో 25 వేరియంట్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 8 రంగు వేరియంట్‌లలో భారత మార్కెట్‌లో ఉంది. హ్యుందాయ్ ఈ కారులో వెనుక AC వెంట్స్ కూడా ఉన్నాయి. వెన్యూ మోడల్ కారులో సన్‌రూఫ్ ఫీచర్ కూడా ఉంది. కారులో డ్యూయల్ టోన్ లెదర్ సీట్ల ఫీచర్ ఇచ్చారు. ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో మార్కెట్‌లో విక్రయాల్లో దూసుకెళ్తోంది.






















