PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ఆహ్వానం పలికేందుకు ప్రధాని మోదీ ప్రోటోకాల్ ను బ్రేక్ చేశారు. సాధారణంగా ప్రధాని, అధ్యక్ష స్థాయి వ్యక్తులకు షేక్ హ్యాండ్ ద్వారా మాత్రమే స్వాగతం పలకాల్సి ఉన్నా భారత్ - రష్యా మైత్రి, పుతిన్- మోదీ వ్యక్తిగత స్నేహం దృష్ట్యా మోదీ స్వయంగా ఎయిర్ పోర్ట్ కి వెళ్లటం...షేక్ హ్యాండ్ కి బదులుగా హగ్ చేసుకుని పుతిన్ ను ఆహ్వానించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్యన్, భారత అధికారులతో ప్రోటోకాల్ గ్రీట్ అనంతరం పుతిన్ కు సంప్రదాయ భరత నాట్యం నృత్యంతో ఎయిర్ పోర్ట్ లోనే స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వాగత కార్యక్రమాల అనంతరం పుతిన్ తో కలిసి ఒకే కారులో మోదీ ఆయన్ను ప్రైవేట్ డిన్నర్ కు తీసుకువెళ్లారు. రాత్రికి ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకోనున్న పుతిన్..రేపు భారత్ - రష్యాల మధ్య జరిగే 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఈ సదస్సు ఇరు దేశాల ద్వైపాక్షి సంబంధాల విషయంలో కీలకంగా నిలవనుంది.





















